16, ఏప్రిల్ 2010, శుక్రవారం

జరిగిందొక ఘోరం

మనకందరకూ సుపరిచితులు అయిన చందమామ అభిమానులలో ఒకరు శ్రీ రాజశేఖర రాజుగారు నిర్వహిస్తున్న చందమామ బ్లాగు హఠాత్తుగా మాయమైపోయింది. ఆయన దాదాపు ఎనిమిది నెలల బట్టి ఎంతో శ్రమపడి తయారు చేసుకున్న చందమామ చరిత్ర క్రమమంతా కనపడకుండా పోయింది. బాక్ అప్ అన్నా తీయకపోతినె అని బాధ పడుతున్నారు. ఒక్కసారి అలోచించండి కష్టపడి ఎంతో మక్కువగా తయారు చేసుకున్న బ్లాగు ఇక మన కళ్ళపడదు అంటే ఎంత బాధ. రాజశేఖర రాజుగారి బ్లాగు కింది లింకు నొక్కితే రావాలి. కాని రావటం లేదు. ఏవేవో ఎర్రర్ మెసేజీలు వస్తున్నాయి. అవేమిటోనాకుగాని రాజుగారికి గాని తెలియదు
రాజుగారి బ్లాగు
http://blaagu.com/chandamamalu


ఈ విషయంలో ఈ బ్లాగు విషయాలు టెక్నికల్ గా తెలిసిన వారు ఎవరైనా ఈ బ్లాగు మాయం కావటం ఎలా జరిగింది, ఇప్పుడు కనపడకుండా పోయిన ఆ బ్లాగును తిరిగి తెప్పించగలమా అన్న విషయాన్ని దయచేసి పరిశీలించగలరు. చందమామ గురించి అనేకమైన అద్భుత విషయాలను మొట్టమొదటిసారిగా మనందరికీ అందచేసిన బ్లాగు రాజుగారి బ్లాగు. అటువంటి బ్లాగు పోవటం నష్టం ఆయనోక్కడిదే కాదు, చందమామను అభిమానించే మనందరిదీను.

నేను మరి కొంతమంది (రాజుగారు కూడ) కలిసి నిర్వహిస్తున్న మన తెలుగు చందమామ బ్లాగ్ లో రాజుగారు వ్రాసిన ఈ విచారకర వార్త ఆపైన వచ్చిన వ్యాఖ్యలు పొందుపరుస్తున్నాను.

తెలిసిన వారు రాజు గారి బ్లాగును తిరిగి తెప్పించే ఉపాయం ఏమేనా ఉంటే దయచేసి చెప్పగలరు. ఏమైనా సలహాలు ఉంటే వ్యాఖ్యల రూపంలో పొందుపరచగలరు


దీనివల్ల ఇప్పుడు మనందరమూ నేర్చుకోవాలిసిన పాఠం ఏమంటే మన బ్లాగులకు వెంటనే బాక్ అప్ తీసి పెట్టుకోవాలి. ఆ పని కొత్త పోస్టు చేసినప్పుడల్లా చేయాలి. లేకపోతె ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి మనం బాధపడాలి.
==============================================================

Chandamama said...

లేటుగా చూసాను శివరాం గారూ. అప్పుటికే మీరు ఆఫ్ లైన్ లో ఉన్నారు. 8 నెలల తీవ్ర శ్రమ, సేకరణ అన్నీ పోగొట్టుకుని షాక్ లో ఉండటంతో నేనివ్వాళ శాయి గారి ప్రకటనను ప్రచురించలేకపోయాను. మీరు మంచి పనిచేసారు. చందమామ బ్లాగు ఇక చరిత్రలో కలిసిపోయినట్లే. కనీసం దాంట్లోని సగం ఆర్టికల్స్ కూడా మళ్లీ దొరుకుతాయని ఆశలేదు. ఎందుకంటే ఎలెక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి కదా ఇక సిస్టమ్‌లో ఎందుకులే అని నా కథనాలు, సేకరణ విషయాలను క్రమానుగతంగా భద్రపర్చటంలో నిర్లక్ష్యం చేశాను. కాని బ్లాగు.కామ్ వారు ఇంత పని చేస్తారని అనుకోలేదు. ఏదీ శాశ్వతం కాదని తెలుసు. కానీ 8 నెలల కష్టం ఒకే ఒక క్షణంలో కళ్లముందే మాయమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మీరు మొదట్లో చేసినట్లుగా నా బ్లాగ్ మొత్తాన్ని అప్పుడప్పడూ మీరే బ్యాకప్ తీసిపెట్టి ఉంటే బాగుండేది. మీరు మనతెలుగు చందమామలో తిరిగి ప్రచురించిన నా కథనాలు మినహా చందమామ బ్లాగు కథనాలు చరిత్రలో కలిసిపోయినట్లే. నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్‌లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది. పోనివ్వండి జీవితంలో ఇదీ ఓక చేదు అనుబవం అనుకుంటాను. తీవ్రమైన వేదనలో ఉండి మీకు ఈ సమాచారం పంపుతున్నాను. ఏమీ అనుకోకండి.

April 15, 2010 12:43 PM

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చందమామ గారు,
పైన శివగారు ఇచ్చిన మంచిసమాచారాన్ని ఆస్వాదించేలోపు కింద మీ వ్యాఖ్య చదివి కడుపురగిలిపోయింది,సదరు బ్లాగు డాట్ కాం వాడిమీద,మీరు పోగొట్టుకున్న సమాచారాన్ని తిరిగిపొందే అవకాశమే లేదంటారా?
మీ బ్లాగులో కామెంట్లు రాసానో లేదో నాకు గుర్తులేదు కానీ క్రమంగా చదివేవాడిని.ఈ విషయాన్ని తెలుగుబ్లాగర్ల గుంపులో కూడా పోస్టుచేసి అక్కడ మనవాళ్లందరి సలహాలు,సూచనలూ తీసుకుందాం.మీకు జరిగిన దారుణమైన అన్యాయం భవిష్యత్తులో మరెవరికీ జరగకుండా ఊండే విధంగా చర్యలు తీసుకోవాలి మనం.


శివ said...

జరిగిన షయం ఏమంటే, రాజుగారు నిర్వహించే "చందమామ చరిత్ర" బ్లాగు హఠాత్తుగా కనపడటం మానేసింది. ఈ వ్యాఖ్య చదివిన మిత్రులు, దయచేసి మీకు వర్డ్ ప్రెస్స్ విధానలు తెలిసి ఉంటె, ఇలా ఎందుకు జరిగిందో తెలుపగలరు.

రాజుగారూ, విచారించకండి. జరిగిపోయినదాన్ని మనం ఏమీ చెయ్యలేం. మీ "చందమామలు" బ్లాగు చందమామ చరిత్రకు దర్పణంగా ఉండి మాలాంటి అభిమానులకు ఎన్నో విషయాలు తెలియచేసింది. మీరు వెంటనే వర్డ్ ప్రెస్స్ వాళ్ళకి ఒక మైలు ఇవ్వండి. ఇలా ఎందుకు జరిగిందో. పూర్తి వివరాలు పొందు పరచండి. నెను ఇక్కడ ఒక ప్రత్యేక వ్యాసంగా ప్రచురిస్తాను, మన తోటి బ్లాగర్లందరినీ కూడ కోరదాము వాళ్ళు కూడ ఈ వర్డ్.కాం వాళ్ళకు మైలు ఇచ్చి మీ బ్లాగును పునరుద్ధరించమని. ఎందుకంటె ఇవ్వాళ మీ బ్లాగుకు అయ్యింది రేపు మరొకరికి అవ్వచ్చు. ఇంత కష్టపడి తయారు చేసుకున్న బ్లాగు మాయమైపోతే ఎవరికైనా బాధే కదా. నేను అనుకోవటం, బ్లాగ్.కాం వాళ్ళకి కూడ బాక్ అప్ ఉండే ఉంటుంది, ఆ బాకప్ నుండి మీ బ్లాగు ఫైళ్ళను బయటకు లాగి మీకు పంపమని అడుగుదాం. ముందు వాళ్ళకు తక్షణమే మైలు పంపండి, నాకు కాపీ పంపండి. ఈలోగా నెట్లో ఇలా జరిగితే ఏమి చెయ్యాలి అన్న విషయానికి ఎమన్నా క్లూ ఉందేమో చూస్తాను .

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

పై వాఖ్యలు చూశాక నాదో సందేహం. బ్లాగు కనపడకుండా పోయింది బ్లాగు.కామ్ నుంచా లేదా వర్డ్‌ప్రెస్.కాం నుంచా? ఒక వేళ వర్డ్‌ప్రెస్.కాం లో అయితే చెప్పండి నేను కూడా నా టపాలు భద్రపరుచుకుంటాను.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

ఇంతకు మునుపు వ్యాఖ్య రాసేసినాక ప్రయత్నించాను. ఇది వర్డ్‌ప్రెస్.కాం వాళ్ళ సమస్య కాదు. వర్డ్‌ప్రెస్ వాళ్ళు బ్లాగులు/వెబ్‌సైటులు సృష్టించడానికి ఒక సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని విడుదల చేస్తారు. దాన్ని వర్డ్‌ప్రెస్.ఆర్గ్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లాగు.కాం వాళ్ళు ఇలాంటి సాఫ్ట్‌వేర్ ను తీసుకుని బ్లాగు.కాం సృష్టించుకున్నారు. ఇప్పుడు సమస్య కేవలం చందమామ చరిత్ర బ్లాగుదే కాదు. మొత్తం బ్లాగు.కాం సైటే పనిచేయడం లేదు. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైటు అడ్మినిస్ట్రేషన్ సరిగా తెలియనివారు పొరపాటున డెలీట్ దిస్ బ్లాగ్ లాంటి కమాండ్స్ రన్ చేయడం వల్ల ఏదో సమస్య వచ్చినట్లుంది. కానీ ఒక్కోసారి ఏదైనా కాన్ఫిగరేషన్ సమస్య వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. డేటాబేస్ లో ఉంటే మాత్రం కొన్ని స్క్రిప్ట్ ల ద్వారా కంటెంటును తిరిగి పొందవచ్చు. ఏమైనా బ్లాగు.కాం వాళ్ళు సమస్య ఎక్కడుందో చెబితే దాన్ని బట్టి మిగతా ప్రయత్నాలు చేద్దాం. సాధ్యమైనంతవరకు రాజు గారి కంటెంటు తిరిగి దొరుకుతుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే డెలీట్ అయిపోయిన కంటెంటును తిరిగి తీసుకువచ్చే ఎన్నో ఉపకరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

14 వ్యాఖ్యలు:

 1. ఫావ్ ఐకాన్ చూస్తేనేమో "జల్లెడ" వారిది ఉండేది రాజు గారి బ్లాగుకు.....జల్లెడ చావా కిరణ్ ని నొక్కితే మూగబోయిన సరిగమలు వినిపిస్తాయేమో చూడండి....అసలు రాజుగారి బ్లాగుకు, కిరణ్ కు సంబంధం లేకపోతే చేసేదేమీ లేదు కానీ...అయినా ఇలా చటుక్కున మాయమైపోవటం మటుకు బాధాకరం! త్వరగా ఎవరన్నా ఆ తంత్రులు తిరిగి కూర్చి, సంగీతం పలికించండి బాబూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బ్లాగు.కాం వారిని సంప్రదిస్తే ఈ కింది సమాధానం లభించింది.
  "రాజశేఖర రాజు గారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. కాని వారి రచనలు భద్రం గానే ఉన్నాయి. బ్లాగు.కాం హోస్టింగు వారు లోడు ఎక్కువయిందని తాత్కాలికంగా డాటాబేసును లాక్ చేశారు. దానిని తిరిగి తెరిపించడానికి ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే వారి బ్లాగులోకి వారు లాగిన్ అవ్వగలరు."
  ఇది సువార్త. బ్లాగు కు బాకప్ అవసరం ఇలాంటి సంఘటనలవలన విదితమౌతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. 1 . వెబ్సైటులో ఇచ్చిన విధంగా, ఒక్క wpsite మాత్రమే DELETE చేస్తే బ్లాగులు తిరిగి పొందటానికి అవకాశం ఉంది.
  2 సాధారణంగా అన్ని హోస్టింగ్ సైట్ ల వారు ఎంత లేదన్న నెలకి ఒక్కసారి backup తీస్తారు. కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే పాతవి దొరకచ్చు.
  పైన రవిగారు అన్నట్లు blaagu.com వారు చొరవ తీస్కోని చెయ్యాలి.
  ౩. సాధారణంగా కొందరు ఔత్సాహిక చదువరులు ఈమెయిలు /ఫీడ్స్ subscribe చేస్కుంటారు - అటువంటి వారి దగ్గర మీ పాత పోస్టులు ఉండచు.

  వర్డుప్రెస్సు మరియు బ్లాగర్ - రెండిట్లోనూ మనం బ్లాగు రాయంగానే మనకి ఈమెయిలు చేస్కొనే సదుపాయం ఉంది.
  సొంతం ఒక వెబ్సైటు నడుపుతున్న అనుభవం తో చెప్తున్నానండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Thank you very much Vamsi garu, Rao garu and JB garu.

  More thanks to Shri CB Rao for taking the initiative to contact the Blog.Com and getting a very optimistic response from them,which I am sure would give some solace to Rajugaru and also all of us.

  CB Rao garu can you please inform how to contact Blog.Com

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బ్లాగు.కాం వారిని ఈ చిరునామాలో సంప్రదించండి.
  jaalayya at gmail.com

  -cbrao
  Mountain View, CA.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మయ్య, థాంక్స్ రావు గారూ! చందమామ మళ్ళీ ప్రకాశిస్తుందన్నమాట! ఇప్పుడే రాజు గారికి మెయిల్ చేస్తే అది కూడా వెళ్ళకుండా సమ్మె చేసింది. ఇదేం విచిత్రమో!ఎన్నో విలువైన వ్యాసాలు, ఫొటోలు,సమాచారం అన్నీ మాయమైపోవలసిందేనా అని ఎంతో బాధపడుతున్న సమయంలో మంచి సమాచారం చెప్పారు.

  థాంక్యూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒకవేళ blaagu.com నుండి మాయమైనా కూడా Google cache నుంచి రాబట్టవచ్చు. ఇందాకే దాదపు అన్ని టపాలు (July 2009 నుంచి) google cache లో చూసాను. కావాలంటే నేను copy చేస్తాను. కాని blaagu.com భరోసా ఇచ్చారు కాబట్టి పర్వాలేదనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. CB Rao ji, once again thanks to you for providing contact mail address.

  Vijayavardhan, thank you for your offer. Can you kindly copy the available material which can be salvaged and send it to Rajugaru by mail.

  Sujatagaru, yes, I am quite happy to see CB Rao gaari comment. Lets be quite positive that very shortly, blog of Shri Raju would come back again.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. గత రెండురోజులుగా నా -చందమామ- బ్లాగు కనిపించకుండా పోయిందన్న వార్తపై స్పందనలకు, పరామర్శలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చందమామ బ్లాగు పోయిందనే వార్త వినగానే స్పందించిన వారు శివరాంగారు. మనతెలుగుచందమామ బ్లాగులో నా వ్యాఖ్య చదివి బ్లాగు.కాం వారిని సంప్రదించి, తెలుగు బ్లాగర్ల సముదాయంలో ఈ వార్త పెట్టి నా బ్లాగు సురక్షితంగా ఉందనే వార్తను బ్లాగు.కాం జాలయ్య గారి ద్వారా వినిపించిన వారు ఇనగంటి రవిచంద్రగారు. విషయం తెలియగానే ప్రయత్నించి Google cache నుంచి నా బ్లాగ్ సమాచారాన్ని -బొమ్మలు మినహా- పైళ్ల రూపంలో రాబట్టి పంపిన విజయ్ వర్థన్ గారు, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ బ్లాగు.కాం వారికి ఈ విషయం తెలియజేసి వారినుంచి సమాచారం అందించిన పెద్దలు సీబీరావు గారు.. సహానుభూతి తెలుపుతూ సత్వర స్పందనలు పంపిన సర్వశ్రీ రాజేంద్ర కుమార్, సుజాత, వంశీ, జెబీ గార్లకు అందరికీ కృతజ్ఞతలు. డేటాను భద్రపర్చుకోవడంలో నా తాత్సారానికి గాను మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను క్షమాపణలు.
  రాజు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శ్రీ విజయవర్ధన్ గారికి వేవేల కృతజ్ఞతలు. చందమామ బ్లాగు -blaagu.com/chandamamalu- ఉన్నట్లుండి పనిచేయక పోవడంతో కలవరపడ్డాను. 8 నెలల శ్రమ పూర్తిగా పోయిందేమో అనుకుని బాధపడ్డాను. కానీ చందమామ అభిమాని ఇనగంటి రవిచంద్ర గారు నిన్న తెలుగు బ్లాగర్ల గ్రూప్ లో ఈ సమస్యను పోస్టే చేయడంతో బ్లాగు.కామ్ ప్రతినిథి జాలయ్యగారు నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, డేటా ఓవర్ లోడ్ కావడంతో బ్లాగ్ హోస్ట్ వారు తాత్కాలికంగా నిలిపి ఉంచారని, త్వరలో అన్ని బ్లాగులూ తిరిగి అందుబాటులోకి వస్తాయని సందేశం పంపారు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి. జాలయ్య గారి మాటలు నిజమై మళ్లీ చందమామ బ్లాగు పనిచేస్తుందనే ఆశిస్తున్నాను.

  ఈరోజు మరింత మంచివార్త మీ నుంచి విన్నాను. "Google cache నుంచి రాబట్టిన blog posts (text మాత్రమే. photos cache చేయరు) జతచేసాను." అని మీరు పంపిన చందమామ బ్లాగు కంటెంట్‌ను ఫైల్ రూపంలో తీసుకున్నాను. కోల్పోయిన పెన్నిధిని మీరు తిరిగి అందించారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు.

  (నిన్ననే ఇనగంటి రవిచంద్ర గారు తన మార్గంలో బ్లాగు.కామ్ వారిని సంప్రదించి నా -చందమామ బ్లాగు- భద్రంగానే ఉందన్న సమాచారం తెలియి జేసారు. దాన్ని నా వ్యక్తిగత మెయిల్ నుంచి మనతెలుగుచందమామ బ్లాగులో వెంటనే తెలియపర్చలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి దాకా సిస్టమ్ ‌కు అందుబాటులో లేకపోవడమే కారణం.)

  ఈ మంచి వార్తను అందరికీ తెలియజేస్తున్నాను. బ్లాగు.కామ్ తిరిగి పనిచేయగానే చందమామ బ్లాగులోని పోస్టులు అన్నీ బ్యాకప్ చేయడానికి శివరాం ప్రసాద్ గారు సిద్దంగా ఉన్నారు. ఈ దెబ్బకు ఆయన కూడా తన సాహిత్య అభిమాని బ్లాగు sahitya-abhimani.blogspot.com- , మన తెలుగు చందమామ బ్లాగు -manateluguchandama.blogspot.com- లను కూడా పూర్తిగా బ్యాకప్ తీసుకున్నట్లు తెలిపారు.

  బ్లాగు మొత్తాన్ని ఒకేసారి బ్యాకప్ చేసుకునే సులభమార్గం ఉంటే ఆయననుంచి తెలుసుకోవాలి. మీకూ తెలిసి ఉంటే అందరికీ తెలియజేయండి. ఈ సమస్యకు ఇదే శాశ్వత పరిష్కారం కదా. నా వెబ్ దునియా బ్లాగులోని అన్ని పోస్టులను గతంలో హెచ్‌టీఎమ్‌ఎల్ రూపంలో సేవ్ చేసుకున్నాను. కానీ చందమామ బ్లాగు విషయంలో కాస్త ఏమారాను. అందుకే ఇంత కలవరం. అయినా చెప్పా పెట్టకుండా, కనీసం నోటీసు కూడా లేకుండా ఇలా మొత్తం బ్లాగులన్నింటినీ హోస్ట్‌లు అడ్డగించి వేస్తే ఎంత ఇబ్బంది పడతారో వారికీ తెలీదా? ఇలా ఎవరయినా ఎప్పుడైనా చేయగలరు కాబట్టి అందరూ తమ తమ జాగ్రత్తలో ఉంటేనే చాలా మంచిదనిపిస్తుంది.

  కథనాలకు జోడించిన చిత్రాలు పోయినా దాదాపుగా మొత్తం కంటెంట్ గాలించి ఫైల్లో పంపారు. ఇది నాకు చాలా మంచి వార్త. థ్యాంక్యూ.

  సమస్య తెలియగానే తన వంతు సహాయం అందించిన శివరాం గారికి, రవిచంద్రగారికి, మీకూ, స్పందించిన రాజేంద్ర కుమార్, సుజాత గార్లకు, సీబీ రావు గారికి, వంశీగారికి, జెబీ గారికి నా బ్లాగు ఎక్కడికీ పోలేదని, భద్రంగా ఉందని నిన్ననే హామీ ఇచ్చిన జాలయ్య గారికీ, ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.
  raju

  ప్రత్యుత్తరంతొలగించు
 11. గమనిక: నా blaagu.com/chandamamalu బ్లాగు కనబడకుండా పోయిన విషయాన్ని మనతెలుగుచందమామ.బ్లాగ్‌స్పాట్.కామ్‌ లో శివరాం గారికి పోస్ట్ రూపంలో పంపిన వ్యాఖ్యలో "ఎంత ఘోరమైన సంస్థ బ్లాగ్ సైట్‌లో నేను బ్లాగ్ రూపొందించుకున్నానా అని ఇప్పుడనిపిస్తోంది." అంటూ నోరు జారి రాశాను.

  http://manateluguchandamama.blogspot.com/2010/04/blog-post.html#comments

  8 నెలల శ్రమ, అరుదైన సమాచారం పోయిందే అనే బాధ, ఉద్రిక్త క్షణాల్లో ఈ దూషణ వ్యాఖ్య చేశాను. ఈ సమస్యకు పరిష్కారం ఉండదేమో అనే బీతితో విచక్షణ మరిచిన క్షణంలో నేను చేసిన, చేయకూడని వ్యాఖ్య ఇది. నిన్న కూడా ఇనగంటి రవిచంద్ర గారికి కూడా మెయిల్ చేస్తూ నా టంగ్ స్లిప్ గురించి బాధపడ్డాను. పొరపాటు జరిగిపోయింది కాబట్టి దాన్ని క్షమాపణతోటే సవరించుకుంటున్నాను. నా వ్యాఖ్యను సీరియస్‌గా తీసుకోవద్దని జాలయ్యగారిని - అభ్యర్థిస్తున్నాను. వారికి ఈ విషయమై మెయిల్ కూడా పంపుతున్నాను.

  ఈ ఘటన దాదాపుగా మనందరికీ మేలుకొలుపులాగే ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. తాము విలువైనదిగా భావిస్తున్న సమాచారాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత వ్యక్తుల, సంస్థల స్వంత బాధ్యతే అనేదే ఆ మేలు కొలుపు. పని ఒత్తిళ్లలో కూరుకుపోయి సమాచార భద్రతను మర్చిపోవద్దనే ఈ ఘటన పాఠం నేర్పుతోంది కదా.

  రాజశేఖర రాజు
  చందమామ
  blaagu.com/chandamamalu -ఇది త్వరలోనే పనిచేయవచ్చు-

  ప్రత్యుత్తరంతొలగించు
 12. సార్,
  నేను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యింది కదా...
  రాము

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Yes you are able to open the blog now. But you are opening it "now". The blog disappeared for some days causing lot of anxiety to Shri Raju Garu.

  After this post was made and lots of other bloggers came to help and make a contact the Blogspot.com etc. the blog was restored.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.