1, మే 2010, శనివారం

విశేష రచనల ‘రచన’ తాజా సంచిక!

‘రచన’ ఇంటింటి పత్రిక మే నెల సంచిక నిన్న మార్కెట్లో విడుదలైంది.

‘చందమామ’లో చిరస్మరణీయమైన జానపద ధారావాహికలను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృతి సంచిక ఇది.

సంపాదకుడు శాయి గారి మాటల్లో-


‘.... అభిమానుల ఆలోచనలన్నీ అక్షరరూపంలో వరదగోదారిలా కట్టలు తెంచుకుని ప్రవహించసాగేయి. వాటన్నింటినీ ఒక ‘మాయా సరోవరం’లోకి చేర్చే ప్రయత్నమే ఈ స‘చిత్ర’ ప్రత్యేక సంచిక’.ఈ విశేషాలు విహంగ వీక్షణంగా ఓసారి...


ముఖచిత్రమే పాఠకుల్ని విహంగ వీక్షణం చేయించే ‘చిత్రా ’ గీసిన అద్భుత వర్ణ చిత్రం! దానికి ‘అవతార్’ బొమ్మను జోడించి ఆర్టిస్టు అన్వర్ రూపుదిద్దిన ‘దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్వాలాద్వీపంలో హాలీవుడ్’!


దాసరి గారు రాసిన 12 జానపద ధారావాహికల పరిచయాలూ, విశ్లేషణా; మంత్రనగరి సరిహద్దులను దాటించి, అపూర్వ కథా వీధుల్లోకి ఉత్కంఠభరితంగా ప్రవేశపెట్టే చిత్రా బొమ్మలూ అన్నీ ఒకే చోటే కనిపిస్తాయి.


ఇవే కాదు...


* దాసరి గారి వ్యక్తిత్వంపై, ఆయన రచనలపై ప్రత్యేక వ్యాసాలూ, స్మృతులూ.

* డిసెంబరు 1964లో ‘యువ’లో దాసరి గారు రాసిన ‘అంతా కనికట్టు’ కథ.

* దాసరి సుబ్రహ్మణ్యం కథా సంపుటి ‘ఇంద్రాణి’కి 1955 ఏప్రిల్ లో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన పీఠిక.

* చందమామ ప్రేరణతో శాయి-చంద్ర గార్లు 42 ఏళ్ళ క్రితం రాసి, గీసిన ‘రాతి కత్తి’ బొమ్మల కామిక్ కథ!

* దాసరి గారు మిత్రులకు రాసిన ఐదు లేఖల ఫొటో కాపీలు యథాతథంగా‘ప్రముఖుల ఉత్తరాలు’ శీర్షికలో!

* ‘చిత్రా’ కాంతులూ, శంకర్ జ్ఞాపకాలూ.


* గళ్ళ నుడికట్టు ని ఇష్టపడే వారికి రెట్టింపు సంతోషం కలిగించే అదనపు ప్రత్యేక పజిలింగ్ పజిల్-‘మంత్ర తంత్ర వీరోచిత మాయా మర్కట దాగుడుమూతలు’!
పూర్తి చేసి పంపినవారికి ఓ అద్భుత జానపద నవల బహుమతి !


ఇంకా... మరెన్నో!


సాహితీ అభిమానులూ, చందమామ ప్రియులూ తమ మిత్రులకు కానుకగా ఇవ్వదగ్గ ఈ ప్రత్యేక సంచిక

వెల- రూ.50.

చిరునామా-

RACHANA Telugu Monthly 1-9-286/2/P Vidyanagar

Hyderabad – 500 044

ఈ -మెయిల్ : rachanapatrika@gmail.com

ఫోన్ : 040 – 2707 1500

మొబైల్ : + 99485 77517

వెబ్ సైట్ : www.rachana.net

చందమామ రాజు గారి ఈ బ్లాగు పోస్టు కూడా చూడండి!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.