*******************************************************************************************************************************************************
డియర్ శ్రీ శాయి గారూ,
మీరు పంపిన, దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన ప్రత్యేక సంచిక -మే, 2010- వివరాల పీడీఎఫ్ ఫైల్అందింది. నిన్న సాయంత్రం నుంచి సిస్టమ్ నాకు అందుబాటులో లేదు. దీంతో వెంటనే మీకు మెయిల్పంపలేకపోయాను. ఇది ప్రశంస అనుకోండి. కృతజ్ఞత అనుకోండి. మీతో కొన్ని మాటలు పంచుకోవాలనిఉంది.
చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి చివరలో పోయాక ఆయనపై రచనప్రత్యేక సంచిక తీసుకురావాలనే ఆలోచనే మీకు రాకుండా ఉండి ఉంటే.. బాలసాహిత్యానికిసంబంధించినంతవరకూ ఓ గొప్ప తెలుగు పుస్తకం చరిత్రలో రికార్డుకు కూడా లేకుండా పోయేది. అందుకుచందమామ అభిమానులందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ ప్రకటన అందించిన ప్రేరణతో దాసరి గారిఅభిమానులు ఓరకంగా వీరావేశంతోనే పనిచేసి, పోటీలు పడి మరీ ఆయన రచనలపై, జీవితంపై తమకుతెలిసిన సమస్త సమాచారాన్ని ప్రోది చేసి పంపారు.
చందమామ వైభవోజ్వల స్వర్ణయుగానికి కారణభూతులైన మహనీయులలో దాసరి గారు ఒకరు. ఆయననుంచి 1980 వరకు విరామం లేకుండా చందమామ చరిత్రలోనే అజరామరమైన 12 ధారావాహికలను రాశారన్న విషయం కూడా దశాబ్దాల పాటు మరుగునపడింది. పత్రికకు తప్ప సిబ్బందికి, ఇన్ హౌస్ రచయితలకు ప్రాముఖ్యత కల్పించరాదన్న సంప్రదాయం చందమామది. ఈ పాలసీచందమామకు మేలు చేసినప్పటికీ చందమామ ధారావాహికల రచయిత ఎవరో ప్రపంచానికి తెలియకుండాచేసింది. కుటుంబరావుగారే చందమామలో పేరులేని ఎడిటర్గా దశాబ్దాలపాటు పనిచేశారనే విషయం చాలాకొద్దిమందికి మాత్రమే తెలుసు. 1954
ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు, ఇన్ని దశాబ్దాలకు... చందమామలో 54 ఏళ్లపాటు నిరవధికంగా పనిచేసిన ఓ గొప్పమనిషి జీవిత, కథాసాహిత్య వివరాలు రచన పత్రిక ద్వారా, కేవలం మీ ద్వారా ప్రపంచం ముందుకువస్తున్నాయి. సమస్త చందమామ అభిమానుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలుతెలుపుతున్నాను.
ప్రత్యేక సంచిక నిడివి పెరగడం, ఊహించిన దానికంటే సమాచారం ఎక్కువగా పోగుపడటం వంటి కారణాలతోరచన ఏప్రిల్ సంచిక ముద్రణను పక్కనపెట్టి కూడా మీరు దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం తీవ్ర కృషిచేశారు. ఒక నెల పత్రిక ముద్రణ నిలిచిపోయినా ఫర్వాలేదనే తెగింపే ఓ సాహసోపేత నిర్ణయం. 1998లోచందమామ తాత్కాలిక అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు తగిలిన దెబ్బనుంచి చందమామ ఇప్పటికీకోలుకోలేదు.
అందుకే మీ నిర్ణయం సాహసోపేతమైనది. దశాబ్దాలుగా తెలుగు వారి సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన, చేస్తున్నచందమామ పత్రికపై అబిమానం, మమకారం హృదయంలో నిలుపుకున్నారు కాబట్టే మీరు ఇంతతెగింపుకు సిద్ధపడ్డారు. చంపి -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లలో ప్రధమస్థానం మీదే అని గతంలోత్రివిక్రమ్ గారు ఓ సందర్బంలో అన్నారు. ఈ రకంగా కూడా అది నిజమైంది.
చందమామ చరిత్రకు తన ధారావాహికల ద్వారా మెరుగులు దిద్దిన గొప్ప మనిషికి 'రచన' పత్రిక ప్రత్యేకసంచిక నీరాజనం పలుకుతోంది. బహుశా దాసరి గారికి ఇంతకు మించిన నివాళి మరొకటి ఉంటుందనినేననుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన మొత్తం ఘనత మీదే అని మనస్పూర్తిగా చెబుతున్నా.
ప్రత్యేక సంచిక పది కాపీలను నేను రిజర్వ్ చేసుకున్నాను. మీకు ఎంఓ కూడా పంపాను. మే 2న ప్రత్యేకసంచిక విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.
ప్రపంచంలోని చందమామ ప్రేమికులందరి అభిమానం మీపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
రాజశేఖర రాజు
చందమామ
*******************************************************************************************************************************************************
శివరాం గారూ, అభినందనలు. చాలా మంచి పని చేసారు. మే 2వ తేదీన కూడా ఇలాగే దాసరి గారి పై ప్రత్యేక సంచిక గురించి ప్రకటన పోస్ట్ చేయండి. చందమామ అభిమానులకు రచన ప్రత్యేక సంచిక విడుదల రోజును మళ్లీ గుర్తు చేయవలసిన అవసరం ఉంది. మీ పోస్ట్‌లో దాసరి గారి దారావాహికల కాలక్రమణికలో సంవత్సరాలు కాస్త పైకీ కిందికీగా పోస్ట్ అయ్యాయి చూడండి. సరిచేయగలరు.
రిప్లయితొలగించండిమరోసారి అబినందనలు...
రాజు.
చందమామ
శివ గారూ !
రిప్లయితొలగించండిచాలా చాలా ఆనందం కలిగించారు. రచన శాయి గారికి, చందమామ రాజు గారికి, ముఖ్యంగా మంచి సమాచారమిచ్చిన మీకు కృతజ్ఞతలు.