14, జూన్ 2010, సోమవారం

చందమామలో అమరవాణి




మనకు తెలిసిన చందమామలో, 1970 జనవరిలో ఒక చక్కటి కొత్త శీర్షిక మొదలు పెట్టారు. అదేమిటి? పిల్లలకు మన శాస్త్రాలలోనూ, గ్రంధాలలోనూ, సంస్కృతంలో నిక్షిప్తమై ఉన్న చక్కటి ఉపదేశాలు "అమరవాణి" అన్న పేరుతొ ప్రతి నెల ఒక విషయం మీద కొన్ని శ్లోకాలు, శ్లోకాల కిందే తేట తెలుగులో వాటి అర్ధాలు పిల్లలకు సులభంగా అర్ధమయ్యే భాషలో ప్రచురించేవారు (తెలుగులోకి తర్జుమా పేరుతొ ఇనప గుగ్గిళ్ళ లాంటి మాటలు వాడటం అప్పటి చందమామ శైలి కానేకాదు) .

అమరవాణి శీర్షికకు బొమ్మవేసినది ప్రముఖ చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య గారు. ప్రతి నెల శ్లోకాల సేకరణ, వాటి అర్ధాలు తెలియచెప్పినది ప్రముఖ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు.


శీర్షికను మొదలుపెడుతూ సంపాదకీయ పుటలో విధంగా వ్రాసారు
వ్యాఖ్యలో ఒక చక్కటి మాట వ్రాసారు.
" నెల నుంచి "అమరవాణి" అనే శీర్షిక కింద ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలు , తాత్పర్య సహితంగా అందిస్తున్నాము. వీటిలో గొప్ప సత్యం ఉంటుంది. అందుచేత పాఠకులు కంఠస్తం చేసుకోవచ్చు."

ఎంత చక్కటి మాట! పిల్లలకు ఒక చక్కటి సలహా. చిన్నారి మనసులమీద ఒక మంచిమాట ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిసిన కుటుంబరావుగారు వ్రాసిన బంగారు మాటలు. చందమామలో మాటలు చదివి, మేము మా చిన్నప్పుడు (తొమ్మిదో తరగతిలో ఉన్నాము) , ఎన్నో శ్లోకాలు అర్ధాలతో సహా కంఠస్తం! స్నేహితుల మధ్య పోటీ, నెల చందమామలో వచ్చిన శ్లోకాలు ఎవరు ముందుగా పాడగలరు. ఎవరు సరిగ్గా అర్ధాన్ని గుర్తుంచుకుని చెప్పగలరు.

చందమామ పుణ్యమా అని ఎన్నెన్నో మంచిమాటలు, ఆలోచనలు తెలిసినాయి.



అమరవాణి శీర్షిక నుండి కొన్ని ఆణిముత్యాలు

  1. నిండు కుండ చప్పుడు చెయ్యదు సగం ఖాళీగా ఉన్న కుండ చప్పుడు చేస్తుంది. కులీనుడైన విద్వాంసుడు గర్వించడు. గుణహీనులేఎక్కువవదరుతారు.
  2. స్నేహానికి దూరం లేదు. కొండలమీది నెమళ్ళకూ, ఆకాశాన మేఘానికి స్నేహం."లక్ష" దూరాన ఉన్న సూర్యునికీ, నీటిలో ఉన్న పద్మాలకూ స్నేహం. దూరాన ఉన్న చంద్రుడు కవలలకు ఆప్తుడు
  3. అమృతం వంటి సంతోషాన్ని పొందుతూ శాంతమైన మనస్సుకల వారు సుఖవంతులు . ఇలాంటి సుఖం దురాశాపరులై నానా శ్రమలు పడేవారికి ఉండదు.
  4. దుర్జనులతో స్నేహమూ వైరమూ కూడా తగనివే. బొగ్గు కణికెలు పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లబడినవైనా చెయ్యి నల్లగా అవుతుంది.
  5. ఎవడు పని ప్రారంభిస్తూ దాని ఎక్కువ తక్కువలనూ, మంచి చెడ్డలనూ తెలుసుకోడో వాణ్ని మూఢుడు అంటారు.
  6. గర్వమూ, దురుసుగా మాట్లాడటమూ, మొండితనం, ఇతరులను చులకనగా చూడటం, ఎదుటివారిని హేళన చేయటం, ఐదూ మూర్ఖుల లక్షణాలు.

చాలా కాలం శీర్షికను ఒక ప్రత్యెక పుటలో మూడు శ్లోకాలతో నడిపారు. కాని కొంత కాలానికి శ్లోకాలు దొరకకో లేక మరే కారాణానో సెప్టెంబరు 1978 నుండి నెలకొక్క శ్లోకమే వేసేవారు, అదీ సంపాదకీయ పుటలో సంపాదకీయాన్నితగ్గించి వేసేవారు. ఏప్రిల్ 1989 నుండి శీర్షిక కనుమరుగయ్యింది.
ప్రస్తుతం పిల్లలకు ఇటువంటి బంగారు మాటలు చెప్పే శీర్షిక లేదు.


ఇప్పుడు చందమామ పత్రికలో శీర్షికను మళ్ళి మొదలుపడతారు అనుకోవటం పూర్తి దురాశే. ఎందుకుఅంటే, దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఫోటో వ్యాఖ్యల పోటీనే జూన్ 2010 తొలగించారు. ఇంకా, "అమరవాణి" మళ్ళి ప్రవేశపెడతారా. కల్ల! కలలోకూడా జరగనిది.


7 కామెంట్‌లు:

  1. ఈ శీర్షిక నాకు బాగా ఇష్టం. జీవితసత్యాలను చక్కటి భాషలో ఇచ్చేవారు. 1970 సంచిక సంపాదకీయ పేజీని ఇస్తూ దీని గురించి రాయటం బావుంది. శంకర్ వేసిన బొమ్మా, లోగో కూడా ఎంత బావున్నాయో కదా!

    రిప్లయితొలగించండి
  2. వేణూగారూ. ధన్యవాదాలు. ఈ శీర్షికకు బొమ్మ వేసినది వడ్డాది పాపయ్య గారు అనుకుంటున్నాను. అయినా సరిగ్గా తెలియటంలేదు. శంకర్ గారు వేశారో లేక పాపయ్య గారో. అందుకనే ఆ విషయం వ్రాయలేదు.

    రిప్లయితొలగించండి
  3. The illustration was by Vaddadi Papayya and the text was my father's.

    Kodavatiganti Rohiniprasad

    రిప్లయితొలగించండి
  4. shaminchali.telugulo type cheyatam chetakaledu. chansamama logolu anni sankar or chitra garlu vesinave. vaddadi paapaiah garu veyaledu. amaravani seershika naaku kooda chala ishtam.

    రిప్లయితొలగించండి
  5. రోహిణీప్రసాద్ గారూ. మీ సమాచారానికి ధన్యవాదాలు. నేనుకూడ ఆ శైలి చూసి వపా గారే అని అనుకున్నాను. కాని సంతకం లేదు అందుకని వ్రాయలేదు.

    మరొక్కసారి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  6. Ajnaatagaaroo. Please comment in your name please. This is a blog for Chandamama Fans and I do not know why you are not commenting with your name. No need for your hide and seek in my blog.

    Further, please see the information given by Shri Rohini Prasad garu which is clarifying that the picture is by Shri Vaddaadi Papayya garu and not by Sankar Garu. Because I too felt that it should by VAPA seeing the style of the picture.

    For typing in telugu you can very well use lekhini.org

    రిప్లయితొలగించండి
  7. ‘అమరవాణి’బొమ్మ చూడగానే శంకర్ వేసిన బొ్మ్మలా అనిపించింది కానీ, రోహిణీప్రసాద్ గారు చెప్పాక చూస్తే... అది వ.పా. బొమ్మలా కనపడుతోంది. :) లోగో చాలా చాలా అద్భుతంగా ఉంది.
    ఇంతకీ ఆ శ్లోకాలకు తాత్పర్యం రాసింది కొడవటిగంటి కుటుంబరావు గారన్నమాట. అందుకే అంత బావున్నాయి!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.