14, జూన్ 2010, సోమవారం

అమరవాణి శీర్షిక




మనకు తెలిసిన చందమామలో, 1970 జనవరిలో ఒక చక్కటి కొత్త శీర్షిక మొదలు పెట్టారు. అదేమిటి? పిల్లలకు మన శాస్త్రాలలోనూ, గ్రంధాలలోనూ, సంస్కృతంలో నిక్షిప్తమై ఉన్న చక్కటి ఉపదేశాలు "అమరవాణి" అన్న పేరుతొ ప్రతి నెల ఒక విషయం మీద కొన్ని శ్లోకాలు, శ్లోకాల కిందే తేట తెలుగులో వాటి అర్ధాలు పిల్లలకు సులభంగా అర్ధమయ్యే భాషలో ప్రచురించేవారు (తెలుగులోకి తర్జుమా పేరుతొ ఇనప గుగ్గిళ్ళ లాంటి మాటలు వాడటం అప్పటి చందమామ శైలి కానేకాదు) .

శీర్షికను మొదలుపెడుతూ సంపాదకీయ పుటలో విధంగా వ్రాసారు

వ్యాఖ్యలో ఒక చక్కటి మాట వ్రాసారు.

" నెల నుంచి "అమరవాణి" అనే శీర్షిక కింద ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాలు , తాత్పర్య సహితంగా అందిస్తున్నాము. వీటిలో గొప్ప సత్యం ఉంటుంది. అందుచేత పాఠకులు కంఠస్తం చేసుకోవచ్చు."

ఎంత చక్కటి మాట! పిల్లలకు ఒక చక్కటి సలహా. చిన్నారి మనసులమీద ఒక మంచిమాట ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిసిన వారు వ్రాసిన బంగారు మాటలు. చందమామలో మాటలు చదివి, మేము మా చిన్నప్పుడు (తొమ్మిదో తరగతిలో ఉన్నాము) , ఎన్నెన్ని శ్లోకాలు అర్ధాలతో సహా కంఠస్తం చేసామొ గుర్తులేదు. స్నేహితుల మధ్య పోటీ. నెల చందమామలో వచ్చిన శ్లోకాలు ఎవరు ముందుగా పాడగలరు. ఎవరు సరిగ్గా అర్ధాన్ని గుర్తుంచుకుని చెప్పగలరు.

చందమామ పుణ్యమా అని ఎన్నెన్నో మంచిమాటలు, ఆలోచనలు తెలిసినాయి.


అమరవాణి శీర్షిక నుండి కొన్ని ఆణిముత్యాలు

  1. నిండు కుండ చప్పుడు చెయ్యదు సగం ఖాళీగా ఉన్న కుండ చప్పుడు చేస్తుంది. కులీనుడైన విద్వాంసుడు గర్వించడు. గుణహీనులేఎక్కువవదరుతారు.
  2. స్నేహానికి దూరం లేదు. కొండలమీది నెమళ్ళకూ, ఆకాశాన మేఘానికి స్నేహం."లక్ష" దూరాన ఉన్న సూర్యునికీ, నీటిలో ఉన్న పద్మాలకూ స్నేహం. దూరాన ఉన్న చంద్రుడు కవలలకు ఆప్తుడు
  3. అమృతం వంటి సంతోషాన్ని పొందుతూ శాంతమైన మనస్సుకల వారు సుఖవంతులు . ఇలాంటి సుఖం దురాశాపరులై నానా శ్రమలు పడేవారికి ఉండదు.
  4. దుర్జనులతో స్నేహమూ వైరమూ కూడా తగనివే. బొగ్గు కణికెలు పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లబడినవైనా చెయ్యి నల్లగా అవుతుంది.
  5. ఎవడు పని ప్రారంభిస్తూ దాని ఎక్కువ తక్కువలనూ, మంచి చేద్దలనూ తెలుసుకోడో వాణ్ని మూఢుడు అంటారు.
  6. గర్వమూ, దురుసుగా మాట్లాడటమూ, మొండితనం, ఇతరులను చులకనగా చూడటం, ఎదుటివారిని హేళన చేయటం, ఐదూ మూర్ఖుల లక్షణాలు.

చాలా కాలం శీర్షికను ఒక ప్రత్యెక పుటలో మూడు శ్లోకాలతో నడిపారు. కాని కొంత కాలానికి శ్లోకాలు దొరకకో లేకమరే కారాణానో సెప్టెంబరు 1978 నుండి నెలకొక్క శ్లోకమే వేసేవారు, అదీ సంపాదకీయ పుటలో సంపాదకీయాన్నితగ్గించి వేసేవారు. ఏప్రిల్ 1989 నుండి శీర్షిక కనుమరుగయ్యింది.
ప్రస్తుతం పిల్లలకు ఇటువంటి బంగారు మాటలు చెప్పే శీర్షిక లేదు.

ఇప్పుడు చందమామ పత్రికలో శీర్షికను మళ్ళి మొదలుపడతారు అనుకోవటం పూర్తి దురాశే. ఎందుకుఅంటే, దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఫోటో వ్యాఖ్యల పోటీనే జూన్ 2010 తొలగించారు. ఇంకా, "అమరవాణి" మళ్ళి ప్రవేశపెడతారా. కల్ల! కలలోకూడా జరగనిది.

3 కామెంట్‌లు:

  1. శివగారూ,
    మీరు ప్రచురించిన అమరవాణి సూక్తులు, ఆ పైన జోడించిన చందమామ బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. తప్పిపోయిన పిల్లవాడిని వెదుక్కుంటున్న వారిలాగా చందమామ కోల్పోతున్న శీర్షికలను మీరు మళ్లీ మళ్లీ పాఠకులకు గుర్తు చేస్తూన్నారు.చందమామ 30 ఏళ్లు చందమామ లాగే బతికింది. ఆ స్వర్ణయుగం మళ్లీ రావాలని మనందరికీ ఉంటుంది.. కానీ.. 80ల మధ్య నుంచే చందమామ ప్రాభవం కోల్పోతూ వచ్చిందని మర్చిపోకూడదు. దీనికి కారణాలు ఎన్నో.. విశ్వంగారితో సహా చాలామందే దీనికి జవాబు చెప్పవలసి ఉంది. బహుముఖ వినోద సాధనాలు పిల్లలకు, పెద్దలకు అందుబాటులోకి వచ్చేసిన కాలంలో కూడా తెలుగు చందమామ 30 వేల పైబడిన కాపీలతో పాఠకులను ఎలాగోలా ఆకర్షిస్తుండమే గొప్ప అనుకోవాలేమో. ఒకటి మాత్రం నిజం. పోయిన బంగారు కాలం మళ్లీ రాదు. ముగ్గురు సంపాదకవర్గ సభ్యులు చందమామలో అక్షరాక్షరాన్ని శిల్పంలా చెక్కిన చరిత్ర మరోసారి రాదు. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించాలి.

    రిప్లయితొలగించండి
  2. Rajugaaroo,

    Whatever I am writing here are my nostalgic memories but when present Chandamama needlessly drops excellent features, I cannot but make a comment on that as it saddens me.

    రిప్లయితొలగించండి
  3. Siva garu,

    I'm pleasantly, beautifully, happily, unexpectedly surprised to see your blog on Chandamama, my favourite magazine. I could search and read a few stories for my little son from two other blogs but could never even dream that I could get the old, good stories I read in my childhood. My son and myself will come again and again to read together and enjoy.

    I've not yet gone through the details of this blo...when, why and how it began. Just felt like commenting before entering.

    For a long time I've been thinking of visiting your blog. Delayed very badly.

    Regards.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.