24, జూన్ 2010, గురువారం

హిమాలయాల్లో సినిమా!!


రెండు మూడు రోజుల క్రితం, బ్రిటిష్ లైబ్రరీలో ఒక సరి కొత్త డివిడి కనబడింది. అది ఒక పాత సినిమా డివిడి. సినిమా మైఖేల్ పొవెల్, ఏమ్రిక్ ప్రెస్ బుర్గేర్ జంట దర్సకత్వంలో 1947 సంవత్సరంలో విడుదలైన సినిమా "BLACK NARCISSUS". సినిమాలో ముఖ్య పాత్రలు ధరించిన నటీ నటులు, డెబ్రోవ కెర్, డేవిడ్ ఫరార్ మరియు ఫ్లోర రాబ్సన్. ఈసినిమాకి 1947 లో ఉత్తమ చాయాగ్రాహకునిగా జాక్ కార్డిఫ్ బహుమతి పొందాడు. అలాగే డెబ్రోవ కెర్ ఉత్తమ నటి అవార్డు పొందింది. మరోకాయనకి కూడ ఆస్కార్ వచ్చినది ఈ సినిమాకే. ఆ ఆవార్డు ఆయన కళాదర్శకత్వానికి.

డివిడి వెనుక అట్టమీద ఉన్న వివరాలు చదువుతూ ఉండగా మరొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. కథ మొత్తం హిమాలయాల్లో స్తాపించిన క్రైస్తవ మిషనరీలో జరుగుతుంది అని. భారత దేశంలో తీయబడిన సినిమా అందులో ఫోటోగ్రఫీకి ఆస్కార్ వచ్చింది అని డివిడి తెచ్చుకుని సాంతం ఆస్వాదిస్తూ చూసాను. సినిమా కథ మొత్తం మూడు పాత్రలమధ్య ఘర్షణగా తిరుగుతుంది. క్లైమాక్సులో ఒక పాత్ర మరొక పాత్రను చంపెయ్యబోయి తానే కిందపడి మరణిస్తుంది. క్రైస్తవ మిషనరీలు వారి దేశానికి తిరిగి వెళ్ళిపోతారు.

సినిమాలో అన్నిటికన్నా నచ్చినది ఫోటోగ్రఫీ. చక్కటి లైటింగు. సినిమా మొత్తం చూసినాక, అదే డివిడిలో ఉన్న ఇతర వివరాలు నా కంటబడ్డాయి. వాటిలో చాయాగ్రాకుడు జాక్ కార్డిఫ్ తో చక్కటి ఇంటర్వ్యూ ఉన్నది. యన చెప్పిన విషయాలు విని ఎంతగానో ఆశ్చర్యపోయాను. సినిమా తియ్యటానికి ముందు దర్శకులిద్దరూ ఎంతగానో చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారుట, సినిమా మొత్తం ఇండియా వెళ్ళకుండా స్టూడియోలో తీద్దామని

నేను మన దేశంలో తీసిన సినిమా అని ముచ్చటపడి తెచ్చుకున్నది, నిజంగా ఒక్క ఫ్రేము కూడ భారత దేశంలో తీయలేదట. ఒక్క సారి కింది దృశ్యాలను చూడండి.


ఇవన్నీ కూడ హిమాలయాల్లో తీసినవి కాదు. లండన్ లో ఉన్న పైన్ఉడ్ స్టూడియోల్లో వేసిన సెట్టింగులెనట. పైనున్న బొమ్మలో కిందకి చూస్తె కళ్ళు తిరిగిపోయేటం ఎత్తు అనిపిస్తున్నది కేవలం ఆరు అడుగుల ఎత్తు మీద నుంచి తీసినది. ఈ విషయం తెలియకుండా సినిమా చూస్తున్నంత సేపూ, హిమాలయాల్లో ఉన్న భావనే కలుగుతుంది, చలిగాలులు, చక్కటి దృశ్యాలు, ఎత్తైన కొండలు, మలుపులు తిరుగుతూ పోయే దారులు, పోనీలమీద రైడింగులు ఇలా ఎన్నో.

సినిమా మొత్తం తన అద్భతమైన ఛాయాగ్రాహక నైపుణ్యాన్ని చూపిస్తూ దృశ్య కావ్యాన్ని రచించిన చాయాగ్రాహకుడు జాక్ కార్డిఫ్ ధన్యుడు. ఆపైన సెట్టింగులు వేసిన కళా దర్శకుడు ఆల్ఫ్రెడ్ జంగ్ కూడఅభినందనీయుడు. ఈయనకి కూడ సంవత్సరానికి ఆస్కార్ వచ్చింది.













*

2 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.