30, జులై 2010, శుక్రవారం

రేడియో కళాకారులు - ఒక విజ్ఞప్తి
నాటక లేదా సినీ కళాకారులను చూస్తూ, వింటూ వినోదాన్ని పొందుతాము. సినీ కళాకారులైతే వారి నటనకు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో అనేక తళుకు బెళుకులను జోడించి మరింత ఆకర్షణీయంగా చేయగలరు.

రేడియో కళాకారులు, పూర్తి శబ్దం మీద మాత్రమె ఆధారపడుతూ అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేసి (మనకు టి వి పూనకాలు రాకముందు) ఎంతో ఆరోగ్యకరమైన వినోదాన్ని దశాబ్దాల పాటు అందచేసారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది కళాకారులు ఇటు ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి, అటు ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి వారి వారి ప్రావిణ్యాన్ని పూర్తి పాటవంతోరంగరించి చక్కటి కార్యక్రమాలతో వినోద విజ్ఞానాలను సమపాళ్ళల్లో అందచేసారు. అటువంటి కళాకారులగురించి రాబొయ్యే తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.

నాటక కళాకారుల గురించి వ్రాసేవారు, అనేక మంది ఉన్నారు. కొన్ని వార పత్రికల్లో ధారావాహికలుగా కూడావేశారు. ఇక సినిమా నటుల గురించి చెప్పనే అక్కర్లేదు, ఎందుకు అంటే వారి గురించి ఇంకాతెలుసుకోవాలిసినది ఏమైనా ఉన్నాదా అని ఆశ్చర్యపొయ్యేంతవరకు - నిజాలు, అబద్ధాలు, అభూత కల్పనలువ్రాసి వ్రాసి అలసిపోయ్యారు, వాళ్ళల్లో కొంతమంది తమకు తామే వ్రాసుకునే శక్తి గలవారు వ్రాసుకుని పుస్తకాలు కూడ ప్రచురించారు.

కాని,
రేడియో కళాకారుల గురించిన సమాచారం ఎవరికీ అంతగా తెలియదు.

ఆకాశవాణి వారి వెబ్ సైటు ఆశగా పరికిస్తే పూర్తి నిరాశా నిస్పృహలు చుట్టుముడతాయి. రేడియో కళాకారుల గురించిన సమాచారం వీసమేత్తైనా దొరకదు . ఇక లాభంలేదు! శ్రోతలమైన మనమే నడుం కట్టాలి. మనలోనే, అనేకమంది దగ్గర ఉన్న కొద్ది కొద్ది సమాచారాన్ని ఒకచోట పోగుచేసి, సమగ్ర రూపాన్ని ఇవ్వగలిగితే ఎంతైనా బాగుంటుంది.


రేడియో కళాకారుల గురించిన సమాచారం, ఫోటోలు, అలనాటి రికార్డింగులు ఉన్నవారు అందరితో బ్లాగు ద్వారా పంచుకోవాలని విజ్ఞప్తి. బ్లాగులు లేనివారు కూడ తమదగ్గర ఉన్న సమాచారాన్ని తెలియచేస్తే (vu3ktb@gmail.com) ఆ సమాచారాన్ని తప్పకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే పని వెను వెంటనే చేయగలను.

అలాగే, అలనాటి రేడియో కళాకారులు, వారి వారసులు కూడ ఈ ప్రయత్నంలో పాలుపంచుకుని తమ జ్ఞాపకాలను, పాత ఫోటోలను, నాటక/నాటిక ఇతర రికార్డింగులను అందరితో పంచుకుని, రేడియో కళాకారుల చరిత్ర తయారీలో సహాయపడమని వినయపూర్వక విజ్ఞప్తి.

..

3 వ్యాఖ్యలు:

 1. బ్లాగులలో అక్కడక్కడా రేడియో జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి. అయినా
  ఇక్కడ ఇంతవరకూ ఎవరూ ప్రతిస్పందించకపోవడం కొంత బాధగా ఉంది..

  ఇటీవల కౌముదిలో సుధామగారు తన అనుభవాలని పంచుకుంటున్నారు.

  కొన్ని పత్రికల్లో అప్పుడప్పుడూ అలనాటి రేడియో కళాకారుల పరిచయాలు,
  జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రచురించబడిన వ్యాసాలు..
  మొదలైనవి ఉన్నా దయచేసి అందరితో పంచుకోవాలని మనవి.

  హిందీ రేడియో కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఓ రెండు లంకెలు:

  http://in.groups.yahoo.com/group/vividhbharati/

  http://radionamaa.blogspot.com/

  ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Ranjani gaaroo. Thank you very much for your kind comment.

  Yes there is not a single comment from BLOGGERS. May be there is no Blogger interested in Radio Programme, as their age profile is late twenties or early thirties, who must quite ignorant about Radio programmes. For most of the people now, Radio means FM radio with Disc Jockeys making clamour and meaningless talk interspressed with songs that had gained cheap popularity with copied tunes.

  ONCE AGAIN A BIG THANK YOU RANJANI GAAROO FOR BEING THE FIRST PERSON TO KEEP YOUR COMMENT. MY THANKS TO YOU FOR THE GOOD RECORDINGS SHARED BY YOU, WHICH I AM PROCESSING AND SHALL WRITE ABOUT SHRI RAVURI BHARADVAJA GARU.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇది నిజం. అదొక గత వైభవం. నేను 1964 నుంచి రాజమండ్రీ లో వుంటున్నాను. జీవితంలో ఆ రోజుల్లో ఆనందం రేడియో యే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అందులో అన్ని కళలలోనూ రంగాలలోనూ అపరూపమైన కళాకారులుండే వారు. వోలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు అన్నవరపు వారు వైలన్ విద్వాంసులు దండమూడి రామమోహన రావు రారు మృదంగ విద్వాంసులు ఇలా ఎంత మందో. నాటక రంగం లో ఎంతో మంది! అందులో నాకు బాగానచ్చిన నండూరి సుబ్బారావుగారు ఆయన గణపతి నాటకం విన్నవాళ్ళు ఎవరు మరువలేరు. ఇవన్ని కాకుండ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక గంట పాతు రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం . అదొకటి మరువలేని అనుభవం సాధారణం గా చూసిన సినిమాలే వస్తుండేవి. ఆ డైలాగులు వింటూ సినిమా చూసినంత అనుభూతి పొండేవాళ్ళం. అదికాక రోజుకి మూడు సార్లు ఢిల్లీ కెంద్రం నుంచి వార్తలు ఆ వరతలు చదివేవారు కూడా బాగాజ్ఞాపకం అందిలో ఒకయన్ శ్రీ పెండ్యాల రంగనధరావు. ఇలాచెపుకు పోటే ఎన్నో మరువలెని అనిభూతులు తీపి జ్ఞాపకాలు.

  సారూ, మీరు ఈ బ్లాగులో ఈ విషయం ప్రస్తావించి నన్ను ఒకసారి గతం లోకి తీసుకు వెళ్ళారి. ధన్యవాదములు

  శివసుబ్రహ్మణ్యం

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.