అవ్వొక రోజులు........ఆ సంగీతం, ఆ సాహిత్యం, పాట పాడే పద్ధతిలో ఉన్న సొగసు, మళ్ళి రమ్మన్నా వస్తాయా!! వస్తే ఎంత బాగుండును.
ఇప్పటి తరానికి, సాలూరి రాజేశ్వర రావుగారి పేరు తెలియటం అంటూ జరిగితే, ఆ తెలియటం ఒక సంగీత దర్శకునిగానే. ఆయన ఒక అద్భుతమైన గాయకుడని తెలిసే ఆవకాశం కొంత ప్రయత్నం చేస్తే గాని తెలియని విషయం. 1940-1950 లలో ఆయన పాడిన లలిత గీతాలు బహుళ ప్రాచుర్యం పొందినాయి.
1980 లలో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక గాన కచేరీలో పాడిన కొన్ని పాటలు ఇంటర్నెట్ వెతుకులాటలో దొరికినాయి. దొరకటమే కాదు మనకు కావలిసిన పాటలను ఒక ప్లే లిస్టు చేసుకుని అందరితో పంచుకోవటానికి మన బ్లాగులో ప్రచురించే ఆవకాశం టాలీ నేషన్.కాం అందచేసారు.
ఆ వెబ్ సైటువారు అందచేసిన అద్భుత ఆవకాశం అందిపుచ్చుకుని, రాజేశ్వరరావుగారి పాటలు ఒక ఐదు, ప్లేయర్లో పొందుపరచటం జరిగింది. హాయిగా విని ఆనందించండి.
.

ఈ పాటలలో నాకు బాగా నచ్చిన పాట, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "పాడమని నన్నడగవలెనా" అద్భుతంగా పాడి వినిపించారు రాజేశ్వర రావుగారు.
ఇటువంటి అద్భుతమైన గాయకుని పాటలను అందుబాటులోకి తేవటమే కాకుండా, బ్లాగులో ప్రచురించటానికి చక్కటి వీలు కల్పించిన టాలీ నేషన్.కాం వెబ్ సైటువారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.
ఇదే విధంగా రాజేశ్వర రావుగారు, బాలసరస్వతిగారు కలిసి పాడిన పాటలు కూడ దొరికితే లలితా సంగీత ప్రియులకు పండగే
.
ఎంత మంచి లింకిచ్చారు సార్!!
రిప్లయితొలగించండిశివ గారు, ఈ మధ్యనే గ్రామఫోను రికార్డు గాయకులు అని ఒక పుస్తకం (CDతో సహా) వచ్చింది. నేను కొనుక్కున్నా. దాంట్లో రాజేశ్వరరావు గారివి కూడా వున్నాయి.
రిప్లయితొలగించండి