5, ఆగస్టు 2010, గురువారం

మరొక్క ప్రయత్నం - వాళ్ళని చూడండి!


రోజునే మిత్రులు రంజని గారు పంపిన లింకు సహాయంతో చక్కటి హిందీ బ్లాగు చూడగలిగాను. హిందీ మాత్రు భాషగలవారు, తమ భాషలో వచ్చే రేడియో కార్యక్రమాల గురించి ఒక ప్రత్యెక బ్లాగు ఎప్పుడో 2007 లోనే మొదలు పెట్టి కొన్ని వందల పోస్టులు వెశారు. ఎన్నెన్నో రికార్డింగులు, పరిచయాలు, పాత జ్ఞాపకాలు,ఇంకెన్నో. ఎంతో బాగుంది.

పైగా బ్లాగు ఎవరో ఒక్కరే నిర్వహించటం లేదు! ఇరవై మందికి పైగా కలిసి చక్కటి బ్లాగు నిర్వహించి
హిందీ రేడియో ప్రేమికులను అలరిస్తున్నారు.

మనం మన తెలుగు రేడియో కార్య క్రమాల గురంచి, రేడియో కళాకారుల గురంచి కలసి ఒక చోట వ్రాద్దామని
నా ఆకాంక్ష. విషయం మీద అభిరుచి, ఓపికగలవారు దయచేసి మీ వ్యాఖ్య ద్వారా తెలియచేయగలరు. కనీసం ఇద్దరు ముగ్గురు కలసి మొదలుపెడితే, ఒక ప్రారంభం అంటూ జరిగితే, రాను రాను ప్రయత్నం ఫలించి పెరిగి పెద్దదై, కాల క్రమేనా కనుమరుగవుతున్న రేడియో కళ, రేడియో కళాకారుల గురించి అందరికీ తెలియచేయగలం.

వాళ్ళని చూడండి ఎంత ముచ్చటగా హిందీ రేడియో కళాకారుల గురించి చక్కగా వ్రాసుకుంటున్నారో.
కింది లింకు నొక్కి మీరు బ్లాగును చూడవచ్చు.






==

1 కామెంట్‌:

  1. meeru RADIO vaari gurinchi vrasindi RADIO SATYAM. Enduku ante TV ABADDHAM ani ardham;...... eee rojullo TV SERIALS choostunna manaki ardham kaavatam ledu: kaani paata RADIO natakallo vinnappatiki CHOOSINA ANUBHUTI ippatiki vundi mari. Daanini ippativari kosam elaa blogullo vrayatam entainaa mechukodgga vishayam...RADHAKRISHNA,VIJAYAWADA.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.