14, ఆగస్టు 2010, శనివారం

అబ్బ ఏమి హింస!


చాలా కాలం తరువాత అనుకోకుండా తేజా చానెల్ లో ఒక సినిమా వస్తుంటే ఆగి చూడటం మొదలు పెట్టాను. అది "సిద్ధం" సినిమా. కథనం బాగుంది. అలా చూస్తూ ఉన్నాను. కాని ఉన్నట్టుంది, పంటి కిందికి ఇంగువ ముక్కలాగా ఆ చానెల్ వాడు విరగబడి ప్రకటనలు దంచటం మొదలు పెట్టాడు. ఒక పావు గంట సినిమా మరొక పావుగంట ప్రకటనలు. ఆ ప్రకటనలు కూడా చాలా నేలబారువి. ఒక సినిమా చూద్దామని కూచుంటే,ఇంత హింస పెట్టాలా ప్రేక్షకుల్ని.

అదేదో సంఘం వాళ్ళు అప్పుడప్పుడూ గొడవ చేస్తూ ఉంటారు, జంతువుల పట్ల హింస మానండి అని. ఆ సంఘం వాళ్ళు ప్రేక్షకులని కనీసం జంతువులుగా భావించి ఈ చానెల్ వాళ్ళు ప్రకటనలతో పెట్టె హింస నుండి కాపాడితే బాగుండును.

ఆ తరువాత ఈ అడ్వర్టైసుమెంటు ఎజన్సీలకి, వాళ్లకి ప్రకటనలు ఇచ్చే మార్కెటింగు మానేజర్లకి మతీ సుతీ ఉన్నట్టులేదు. కనీసపు తెలివితేటలు కూడ లోపించాయని నా అనుమానం. లేకపోతె, మన చేతిలో రిమోటు ఉంది, కావలసినన్ని చానెళ్ళు. వీళ్ళ గోల ఇక్కడ అయ్యిందని మనకు నమ్మకం దొరికాకే మళ్ళి ఇక్కడకు వచ్చి సినిమాచూస్తాం.

తరువాత మరొక విషయం, ఈ ప్రకటన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇలా మాటికి ప్రకటనలు చూపిస్తే, అలా హింసపెట్టినందుకు వినియోగదారులు కోపంతో వాళ్ళ వస్తువులు కొనకూడని అనుకునే ప్రమాదమున్నది.












.


3 కామెంట్‌లు:

  1. You are absolutely right shiva garu.
    now-a-days Telugu TV channels are telecasting only 1.45 hours / 2 hours movie, out of 2.5 hours movie duration. thats why i stopped watching movies on TV. i always prefer to watch complete movie on DVD/VCD with out any advertisements.

    రిప్లయితొలగించండి
  2. RADHA KRISHNA KAPPAGANTU - అవును నిజంగా నిజం. సినిమా వేసేప్పుడు ఏ ఛానల్ వాళ్ళు విచక్షణ చూడటం లేదు. చిన్న పిల్లల సినిమా వేసేప్పుడు కూడా కండోమ్స్ , నేపేకిన్స్ ....,వేసినవే వేసి చావాబాదుతున్నారు. ప్రతిదానికి ఏదో ఒక సంరక్షణ సమితి ఉంది; చివరికి దొంగలకి కుడా ......
    మరి టీవీ వీక్షకులను రక్షించేది దేవుడేనా.....

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.