అరవై మూడు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిందట. అందుకనే ఈ రోజు పండుగ. వీధి వీధినా పోటీలుపడి జెండా ఎగరవేతలు, జెండా వందనాలు వగైరా వగైరా. ఉన్న స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగ పరిచే వాళ్ళను ఆపగలిగే ధైర్యం, శక్తి అందరికీ రావాలని కోరుతూ,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఒకప్పుడు సినిమా అయిపోగానే జాతీయ పతాక ప్రదర్సన ఉండేది. ఆకాశవాణి కార్యక్రమాలు జాతీయ గీతాలాపనతో ఆపేవారు. ఈ చక్కటి ఆనవాయితీ దశాబ్దాల క్రితమే ఆపేయవలసి వచ్చింది. కారణం!!??
ఇప్పుడు కొన్ని కొన్ని సినిమా హాళ్ళల్లో, సినిమా మొదలు పెట్టటానికి ముందే జాతీయ జెండా ప్రదర్సన జరుగుతున్నది. ఆ జండా ప్రదర్శనకు ముందు ఒక స్లైడు వేస్తారు ఏమని? "అందరూ దయచేసి నుంచోండి" అని
సినిమా మొదట్లో జెండా ప్రదర్సన దేనికి, దానికి ముందు నుంచోండి బాబూ అని బతిమాలుడు దేనికి??
ఒక్క క్షణం ఆలోచించండి
కొద్దిగా సమయం వెచ్చించి, ఈ కింది వీడియోని వీక్షించండి.మనం అందరం ఈ వీడియోలో ఉన్న పెద్దమనిషి లాగ ఉండగలిగితే పైన వ్రాసినవి జరిగేవా?
జెండాను గౌరవిద్దాం
ఇలాంటి వీడియోలను తీసి అది చూపిస్తేగాని బాధ్యత గుర్తుకు రాని వారి సంఖ్య పూర్తిగా మాయమవ్వాలని, అలాంటి మరుపు ఎవరికీ ఎప్పటికీ కలుగకుండా ఉండాలని కోరుతూ మరొక్కసారి
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచాలా బాగుంది. బ్రతుకుతెరువు [బిజీ లైఫ్] పేరుతొ అది కల్పించిన దేశాన్నే విస్మరిస్తున్న వాళ్ళకి ఇది చాలా
రిప్లయితొలగించండిఅందరికి స్వతంత్ర శుభ కాంక్షలతో
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి- శిరాకదంబం