7, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో అభిమానులకు శుభవార్త

అవును శుభవార్తే!

ఎన్నెన్ని రేడియో నాటికలు, రూపకాలు, పరిచయాలు, లలిత సంగీతం!

వినండి ఆనందించండి!

మీ దగ్గర ఉన్న రేడియో కార్యక్రమ రికార్డింగులను అందరితో పంచుకొండి

రేడియో మనకు దైనందిన కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు కాదు లెండి. ఒకప్పుడు అంటే, ఒక ముఫ్ఫై ఏళ్ళపైమాట. పొద్దున్నే భక్తీ రంజనితో నిద్ర లేచిన రోజులు మళ్ళి వస్తే బాగుండును అనిపించక మానదు. రేడియోలో వార్తలు వినని రోజున ఏదోగా అనిపించేది. రేడియోలో నాటికలు వచ్చే సమయం గుర్తు పెట్టుకుని, ఎక్కడున్నా సరే ఇంటికి పరుగు పరుగున వచ్చి, రేడియో ముందు కూచుని, నాటికను సాంతం విని ఎంతగానో ఆనందించిన రోజులు ఎంత గొప్పవి! అవ్వొక హాయి ఐన రోజులు. రేడియో తో ఒక చక్కటి సులువు ఉన్నది (టి.వికి లేనిది ). రేడియో వింటూ మనపని చేసుకోవచ్చు. దాని ముందే కూచుని మన పనులన్నీ మానుకునేట్టుగా చెయ్యదు పాపం రేడియో.

అలనాడు మనం విని ఆనందించిన రేడియో కార్యక్రమాలను మళ్ళి మనం వినగలిగితే! అంతకంటేనా! అవునుకొంతమంది
ఔత్సాహికులు పాత కార్యక్రమాలను పోగుచేసి, మనకు అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడో రేడియోలోవస్తున్నప్పుడు రికార్డు చేసుకుని, ఇన్నాళ్ళూ జాగ్రత్తగా దాచి. నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటూ తామొక్కళ్ళే విని ఆనందించటం కాకుండా, తమతో బాటుగా అనేక మంది తమలాంటి అభిమానులు వినటానికి వీలుగా వాళ్ళ వాళ్ళ బ్లాగుల్లోనూ, వెబ్ సైటుల్లోనూ ఉంచారు.

ఇక వివరాలలోకి వెడితే, చూడగానే ఏదో ఒక్క కుటుంబానికి సంబంధిచిన వెబ్ సైటులాగ పేరు కనిపించినా, లోపలకిఆడుగు పెట్టినవాళ్ళు, కొన్ని గంటలు తిరుగాడినా ఇంక ఇంకా చూడవలసినవి కనపడుతూనే ఉంటాయి. ఒక్కటా రెండాఎన్నెన్ని విషశేషాలు. అదే మాగంటి వంశీ గారి వెబ్ సైటు. . వెబ్ సైటును కింది లింకు నొక్కి చూడవచ్చు.

మాగంటి వంశీ గారి వెబ్ సైటు


మాగంటి.ఆర్గ్ వెబ్ సైటును నిర్వహిస్తున్నది
శ్రీ మాగంటి వంశీగారు. ఆయన అమెరికాలో ఉంటూ తెలుగు భాష , సంస్కృతి సంరక్షించటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన వెబ్ సైటులో ఉన్న విశేషాలలో కొన్ని:

ఆకాశవాణి కళాకారులు
విభాగంలో ఆనాడో ఆకాశవాణి లో పని చేసి మనకు వారి గళం ద్వారానే పరిచయం ఉన్న అనేక మంది కళాకారులను చూడవచ్చు.

ఆకాశవాణి నాటికలు:
విభాగంలో అలనాటి నాటికలను వినవచ్చు.

లలిత సంగీతం
ఇక్కడ దశాబ్దాల క్రితం రేడియోలో వినపడిన లలిత గీతాలను వినవచ్చు.

ఇలా వ్రాసుకుంటూ పొతే అనేకమైనవి ఉన్నాయి ఈ అద్భుతమైన వెబ్ సైటులో.

ఎందుకు ఇక ఆలశ్యం వెంటనే పైనున్న లింకులు నొక్కి ఆనందించండి

ఇలాగే మరొక అద్భుత వ్యక్తి శ్రీ కారంచేడు గోపాలం . ఈ రేడియో కార్యక్రమాల్లో ఎక్కువభాగం ఆయన కలేక్షన్లోనివే. వీరికి సొంతంగా ఒక బ్లాగు ఉన్నది. ఆయన బ్లాగు గురించి మరొక రోజున.

మరొక వ్యక్తి గురించి కూడ ఇక్కడ మనం చెప్పుకుని తీరాలి. వారు "రంజని" గారు. వీరి పూర్తిపేరు ఇతర వివరాలు తెలియవు. ఒక గంధర్వుడిలాగా ఈ వెబ్ ప్రపంచంలోనే పరిచయమయ్యి తన దగ్గర ఓపికగా రేడియో నుంచి రికార్డు చేసుకున్న చక్కటి ఇంటర్వ్యూలను అందచేసారు.

ఇదే విధంగా అలనాటి రేడియో కార్యక్రమాల గురించి వ్రాస్తున్నవారు, తమ దగ్గర అలనాటి రికార్డింగులు ఉన్నవారు అనేక మంది ఉండే ఉంటారు. అందరి దగ్గర ఉన్న అలనాటి ఆణిముత్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకు రాగలిగితే, సాంకేతిక విజ్ఞానం మనకు అందించిన చక్కటి కళారూపం రేడియో కార్యక్రమం, రాబోయే తరాలకు అందిచగలుగుతాం.

ఎవరి వద్దైనా అలనాటి రేడియో కార్యక్రమాలు ఉంటే దయచేసి తెలియచేయండి.

12 వ్యాఖ్యలు:

 1. చాలా ఆనందంగా వుందండి. ఎవరెవరి ఇంటర్వ్యూలు దొరికాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నా రేడియో స్టేషన్ గురించి చెప్పరూ ??

  అది

  a2zfm.co.cc

  a2ztelugu.info

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రేడియో లో వచ్చిన అలనాటి మంచి కార్యక్రమాలను శ్రోతలకు అందచేయటంలో కృషి చేస్తున్న మాగంటి వంశి, మీకు, ఇతర బ్లాగర్లకు అభినందనలు. అక్టొబర్ లో నేను భారతదేశం వస్తున్నాను. మీ కృషి కి ఉడతా భక్తిగా నా వంతు సహకారం అందివ్వగలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. విజయ వర్ధన్. ఒకసారి మాగంటి.ఆర్గ్ లోకి వెళ్ళి చూడండి ఎవరెవరి ఈంటర్వ్యూలు దొరికాయో తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ధన్యవాదాలు సి బి రావు గారూ. మీ భారతదేశ పునరాగమనానికి ఎదురు చూస్తూ ఉంటాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ. ప్రస్తుతానికి మా తపన పాత రేడియో కార్యక్రమాల సంరక్షణ గురించి. ఇంటర్నెట్ రేడియోల గురించి మంచి లింకు పంపారు. నా బ్లాగులో కుడిపక్కన చూడండి. ఇంటర్‌నెట్‌లో ఉన్న మంచి రేడియోలని పరిచయం చేస్తున్నాను. త్వరలో ఇంటర్‌నెట్ రేడియోల గురించి వ్రాద్దామని ప్లాన్ చేస్తున్నాను. మీరు మీ రేడియో ఎంబెడ్ కోడ్ పంపండి, ఆ వ్రాయబోయే వ్యాసంలో తప్పక ఉంచుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒక్క Radio అభిమానులకే కాక, తెలుగు సాహితీ సంస్క్రుతి ప్రియులు అందరూ సందర్శించ వలసిన అద్భుతమైన website ని blog లొకానికి పరిచయం చేసిన మీకు నా అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శివ గారు, మాగంటి వారి site అద్భుతం. వారి collection ఇంతకు ముందే చూసాను. "రంజని" గారి నుంచి మరిన్ని దొరికాయని అన్నారు కదా. ఆ వివరాలు ఏమైనా చెబుతారా?

  మీరు శ్రీ ముక్కామల గారి youtube channel చూసారా? వారి దగ్గర కూడా అద్భుతమైన video/audio collection వుంది.
  http://www.youtube.com/user/mukkamala1958

  ప్రత్యుత్తరంతొలగించు
 9. 23 నాటికలు - అందులోనూ విశ్వనాథ వారి చెలియలికట్ట, పానుగంటివారి కంఠాభరణం, వేదం వారి ప్రతాపరుద్రీయం, గురజాడ వారి కన్యాశుల్కం, చిలకమర్తివారి గణపతి మొదలైన నాటికలు

  6 రూపకాలు, ఈలపాట రఘురామయ్య గారి ఇంటర్వ్యూతో పాటుగా మరో 8 పరిచయ కార్యక్రమాలు - అడిగీ అడగగానే ఇలా ఎన్నో ఆణిముత్యాలు రేడియో అభిమానులకు అందించిన మీకు , గోపాలం గారికి, రంజని గారికి, నూకల ప్రభాకర్ గారికి - అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు....ఇంకా ఎంతో మంది ముందుకు వచ్చి తమ వద్ద ఉన్న ఆణిముత్యాలను పంచుకోవాలని ఆశిస్తూ....

  ఈ భాండాగారాన్ని బ్లాగ్ లోకానికి పరిచయం చేస్తూ, వార్త చేరవేసినందుకు మీకు మరిన్ని ధన్యవాదాలతో

  భవదీయుడు
  వంశీ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హరేఫలగారూ ధన్యవాదాలు. ఆ వెబ్సైటులో ఒక్క గణపతి చింతామణి తప్ప మిగిలినవి నేను ఇచ్చినవే. చింతామణి నాటిక రేడియో నాటిక కాదు.

  చింతామణి నాటిక మినహాయించి, మిగిలినవన్ని మాగంటి.ఆర్గ్ లో ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. వంశీగారూ. ఇలా అందరూ సేకరించి దశాబ్దాలపాటు తమ దగ్గర భధ్రపరచిన రికార్డింగులు రాబొయ్యే తరాల వారికి అందించటాని ఒక చక్కటి వేదికను ఏర్పరిచారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.