29, ఆగస్టు 2010, ఆదివారం

అద్భుత సేకరణ::శభాష్ శ్యాం నారాయణ్

(శ్యాం నారాయణ్ గారి చిత్ర సౌజన్యం ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 22 08 2010)

హాబీలలో అనేక రకాలు. కొందరు స్టాంపులు సేకరిస్తే, మరి కొందరు పాత పత్రికలు సేకరిస్తారు. మన శ్యాం నారాయణ్ గారు పాత పాటలు, సినిమాలు ఒక ఉద్యమం లాగ సేకరిస్తారు. ఆయనేమీ పెద్ద సాహితీ వేత్తా కాదు, ఆల్ ఇండియా రేడియోలో పనీ చెయ్యటంలేదు. ఒక సామాన్య వ్యాపార వేత్త. హైదరాబాదులో ఫొటో ఫ్రేముల వ్యాపారం. తన వ్యాపారపు పనులు చూసుకుంటూనే, ఓపికగా ఎన్నెన్నో పాటలు, చిత్రాలు, ఆడియో పుస్తకాలు, సినిమాలు సేకరించటం అంటే మాటలు కాదు. ఆయనకు ఆ పాటల మీద, సినిమాల మీద ఉన్న ఆసక్తి అటువంటిది. అలా సేకరించటమే కాదు, ఆ సేకరించిన వాటిని ఒక పధ్ధతి ప్రకారం పదిల పరచటం, అవసరమైనప్పుడు వెను వెంటనే ఎక్కడ ఉన్నదో పట్టి బయటకు లాగి ఆసక్తి ఉన్నవారికి వినిపించటం, చూపించటం. అద్బుతం.

ఈ అరుదైన అద్భుత వ్యక్తి గురించి 22 08 2010 ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించటం ముదావహం. ఆ వ్యాసం వ్రాసిన సరోజా ప్రసాద్ గారు అభినందనీయులు.

పేపర్లు అప్పుడప్పుడూ సామాన్య ప్రజలలో ఉన్న ఇటువంటి అసాధారణ వ్యక్తుల గురించి వ్రాస్తూ, మరింత మందికి స్పూర్తి కలిగించెదరు గాక.

చందమామ పత్రిక రాజశేఖర రాజుగారు, తన బ్లాగులో సామాన్యంగా, వారి పత్రిక గురించే వ్రాస్తుంటారు. కాని, ఈ అసమాన్య వ్యక్తి శంకర్ నారాయణ్ గురించి వారికి రచన శాయిగారు పేపర్ కట్టింవు పంపగానే, తన "చందమామ చరిత్ర" బ్లాగులో ప్రముఖంగా మరియు విపులంగా వ్రాశారు. ఈ కింది లింకు నొక్కి చదువ వచ్చు.

శ్యాం నారాయణ్ ను అడిగితె పోలా
(ఈ లింకు పని చెయ్యటం లేదు) Updated on 5th June, 2023



ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో శ్యాం నారాయణ్ గారి మీద
వచ్చిన వ్యాసాన్ని ఈ కింది బొమ్మలను క్లిక్ చేసి చదువ వచ్చు. (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం సౌజన్యం).

శభాష్ శ్యాం నారాయణ్
శభాష్ సరోజా ప్రసాద్
శభాష్ ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం




.

3 కామెంట్‌లు:

  1. శివరాం గారూ,
    మళ్లీ చాలా కాలానికి కలుస్తున్నాం.
    మెరుపు వేగంతో శ్యామ్ నారాయణ్ గారి కథనాన్ని పట్టి పోస్ట్ చేశారు. బ్లాగు.కామ్ లో ఇమేజ్‌లు అప్‌లోడ్ చేసే సౌకర్యం లేకపోవడంతో రచన శాయి గారు పంపిన ఆంధ్రజ్యోతి గత ఆదివారపు కథనం స్కాన్డ్ ఇమేజీలను నా బ్లాగులో పెట్టలేకపోయాను. నా బ్లాగు చూసిన వెంటనే శ్యామ్ నారాయణ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో 20 వేలు, 30 వేల తెలుగు పాటలను సంగీతాభిమానులైన కొందరు గ్రూపులుగా ఏర్పడి గ్రామ ఫోన్ రికార్డులు, క్యాసెట్‌ల రూపంలో సేకరించారట.

    గత వారంరోజులుగా నారాయణ్ గారికి ఇలాంటి వారెందరో ఫోన్లు చేస్తూనే ఉన్నారట. క్యాసెట్‌లు, రికార్డుల రూపంకంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తే వందల వేల పాటలను సులువుగా డీవీడీలకు ఎక్కించడం ద్వారా, ఇతర సాంకేతిక రూపాలలో అవసరమైన వారికి పంపిణీ చేయవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు అని శ్యామ్ గారి అభిప్రాయం. ఆయన వద్ద ఇంతవరకు 3 వేల తెలుగు పాటలు ఉన్నాయట. వ్యక్తిగత సేకరణలో ఉంటున్న వారిని ఈమెయిల్స్ రూపంలో సంప్రదిస్తూ అందరి పనిని కో అర్డినేట్ చేస్తూ పోతే సమాచార పంపిణీకు సులువుగా ఉంటుందని ఆయన అభిప్రాయం. పైగా సంగీతాభిమానులైన ప్రముఖులు ఆయనను కలుస్తూ, సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు కనుక భవిష్యత్తులో తన పని మరింత సులువు కావచ్చు.

    మీ గురించి కూడా బ్లాగులో పొందుపర్చాను కనుక తనతో మీరు, మీతో ఆయన పరిచయం లోకి వచ్చినప్పుడు మరింత మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. మీ సాహిత్య అభిమాని బ్లాగులో ఆయన గురించి ఇప్పుడే ప్రచురించిన పోస్టులో పొరపాటున ఒకటి రెండు చోట్ల ఆయన పేరును శంకర్ నారాయణ్ గారిగా ప్రస్తావించారు. ఈ ఒక్క మార్పు చేయండి. మిగతా పరిచయం చాలా బాగుంది. మీ బ్లాగు లింకును కూడా నాబ్లాగులో పోస్ట్ చేస్తున్నాను.

    మీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నిస్తే రెండు మూడు సార్లు లైన్లు కుదరటం లేదు. దీంతో కామెంట్ పెడుతున్నాను.
    ఆయన జీమెయిల్ ఐడీకి తప్పక ఈమెయిల్ పంపగలరు..
    syamnarayana.t@gmail.com

    ఉంటాను

    రాజు.

    రిప్లయితొలగించండి
  2. Dear Rajugaaroo,

    Thank you for pointing out the mistake in the name committed by me. I have since rectified.

    When you phoned I think I was fast asleep, which is a bad habit for me on Sundays.

    రిప్లయితొలగించండి
  3. Dear Sir! I can't resist from appreciating you on such a beautiful post.
    and I am sorry to post a comment on an issue already closed about 'అఙాత' below:
    అఙాత గురించి అంతగా ఎందుకు వాదించుకుంటున్నారో నాకర్ధం కాలేదు సర్.
    ఎందుకంటే, ఎవరి కామెంటయినా మీ మోడరేషన్ తరువాతనే పబ్లిష్ అవుతుందికదా - అలాంటప్పుడు అఙాతల కామెంట్లు పబ్లిష్ చేయకుండా ఉండొచ్చు కదా?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.