ఆకాశవాణి కేద్రాలన్ని కూడ పొద్దున్నే వారి ట్యూనింగు సిగ్నల్ వేసిన తరువాత, మొట్టమొదటి ప్రసారం చేసేదిమనందరికీ ఎంతో పరిచయం ఉన్న వందేమాతరం. ఆ పాటను ఈ కింది ప్లేయర్లో వినవచ్చు.
ఈ పాట విన్నప్పుడల్లా చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళే రోజులే గుర్తుకు వస్తాయి, ముఖ్యంగా శీతాకాలపు ఉదయాన ఏడుగంటల వరకూ లైటు వేసుకోవాల్సి వచ్చిన పొగ మంచు రోజులే గుర్తుకు వస్తాయి. ఎంతో ప్రశాంతంగా హాయిగా పాడిన ఈ వందే మాతరం పాటలో భారత మాత మీది గౌరవం ప్రేమ వ్యక్తమవుతాయి. ఈమధ్య ఆయనవేరో అతి తెలివి ట్యూన్ చేసి ఊహూ అరుస్తూ పాడే పాట కన్నా ఈ పాట ఎంత బాగున్నది.
భారత ప్రభుత్వ వెబ్ సైటులో కూడా ఈ పాటే ఉన్నది. ఈ కింది లింకు నొక్కి, అక్కడ కూడా వినవచ్చు.
వందేమాతరం
వందేమాతరం పాటను సంస్కృత బెంగాలీ భాషల మిశ్రమంగా ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ రచించారు. పాటను రచించిన వెంటనే జాదూనాథ్ భట్టాచార్య సంగీతం సమకూర్చారు. ఈ పాటను మొట్టమొదటిసారిగా శ్రీ రవీంద్ర నాథ్ టాగూర్ 1896 లో కలకత్తా లో జరిగిన ఒక కాంగ్రెస్ సభలో పాడటం జరిగింది.
ఈ పాటను మనం పూర్తిగా కాకుండా కుదించబడి ఈ కింద ఇచ్చినంత వరకే అనేక కారణాల వలన పాడుకోవలసి వస్తున్నది.
वन्दे मातरम
सुजलाम सुफलाम

मलयज शीतलाम
सस्य श्यामलां
मातरम
वन्दे मातरम
सुभ्र ज्योत्स्ना
पुलकित यामिनीम
फुल्ला कुसुमित
ध्रुमदला शोभिनाम
सुहासीनीम
सुमधुर भाषिणीम
सुखदाम वरदाम
मातरम
वंदे मातरम
ఆకాశవాణిలో మనం రోజూ వినే ఈపాటను పాడిన గాయనీ గాయకులూ ఎవరో తెలియరావటంలేదు. తెలిసిన వారు చెప్పగలరు.****************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.