మృత్యులోయ ధారావాహికలో కూడ ఇద్దరు హీరోలు, ఒకరు రాజు కొడుకు మరొకరు మంత్రి కొడుకు. ఇద్దరూ వీరులే కాని, సహజంగా మంత్రి కుమారుడు తెలివితేటలతో రాణిస్తే, రాజు కొడుకు, వీరోచిత కార్యాలతోఆకర్షిస్తాడు. కథ మొత్తం ప్రయాణంలోనే నడుస్తుంది.
ఈ లక్షణాలన్నీ ఎవరి ధారావాహికలలో ఉంటాయి. మరింకెవరండీ , మన అభిమాన రచయిత శ్రీ దాసరిసుబ్రహ్మణ్యం గారి సీరియల్స్ లోనే కదా. ఇప్పుడు తెలిసిపోయిందా! బొమ్మరిల్లు ప్రారంభ ధారావాహిక ఎవరువ్రాశారో. మరెవరో కాదు దాసరి దాసరి సుబ్రహ్మణ్యం గారే . అప్పటికే ఆయన చందమామలో రాతి రథం వ్రాస్తున్నారు అనుకుంటాను. తానప్పటికే ఒక పత్రికలోవ్రాస్తూ ఉండటం , పైగా ఆపత్రికకు పోటీగా వస్తున్నపత్రికలో వ్రాయటం ఎలా? అందుకని రహస్యంగా వ్రాసారుట.
ఆయన తన ఉద్యోగ ధర్మాన్ని సవ్యంగా పాటించారా లేదా అన్నది కాదు ఇప్పుడు చర్చ. మనకు మరో చక్కటిధారావాహిక అందింది . అదే ఆనందం .
మరొక సంతోషించవలసిన విషయం ఏమంటే, దాసరి వారి మీద ప్రత్యెక సంచిక ప్రచురించిన మన "రచనశాయి" గారే దాసరి వారి కథలు, నవలలు అన్నీ కూడ (చందమామలో వచ్చిన ఆ డజను ధారావాహికలుతప్ప) పైన చెప్పిన మృత్యులోయ దారావాహికతో సహా ఒక సంపుటిగా తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయన దగ్గర నుండి వచ్చిన మెయిలుఈ కింద ఇవ్వటం జరిగింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానం ఉన్న వారందరూ, ఈ కార్యక్రమం లో పాలుపంచుకునే అవకాశం ఉన్నది. ఈ సంపుటి జనవరిలో ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నారు, పెద్దగాసమయం లేదు. కాబట్టి దాసరి అభిమానులందరూ స్పందిస్తారని ఆశిస్తున్నాము
Forwarded message -
Date: 2010/9/26
Subject: Dasari Subrahmanyam works - Publication
To: venu ch
Following is the consolidated appeal for possible display in your bolgs or informing other like minded people.
I am in the process of collecting all stories of Sri Dasari Subrahmanyam garu - to the extent possible - with an optimistic view of getting them printed in a book form with the financial assistance of like minded friends.
So far collected 31 stories.
Apart from the Anthology of Short Stories, it is now contemplated to publish "Agnimaala' (Novel) serialized in Yuva - Telugu Monthly during Jan - Dec, 1975 and his 13th Janapada Novel 'Mrutyuloya' published in Bommarillu also.
The Project is so designed to involve all the admirer's of Sri Dasari garu. Sri Vasireddy Narayana Rao garu volunteered for suitable assistance.
It is proposed to release all the three books on 27th January, 2011 (first anniversary of Sri Dasari) at Hyderabad.
Those who are interested may contribute minimum of Rs.1000/- but not exceeding Rs.3000/- each enabling others to participate in the Project. Cheques/DD's to be made in favour of 'VAHINI BOOK TRUST' payable at 'Hyderabad' and sent to :
Vahini Book Trust
1-9-286/2/P ; Vidyanagar
Hyderabad - 500 044
You may please inform the Project details to like minded people also.
with best wishes
sai
--
Y V S R S Talpa Sai
Editor - RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad - 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 - 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net
రచన శాయి గారు ఇంతటి సాహిత్యసేవ చేస్తున్నారంటె
రిప్లయితొలగించండిఅభినందనీయం. దాసరి సుబ్రహ్మణ్యం గారి కధలు,నవలలు
ఏర్చి కూర్చి పుస్తకాలుగా ప్రచురించడం ఆయన ఆభిమానులకు
శుభవార్త.ఆభిమానులందరూ చేయూత తప్పక అందిస్తారని
నమ్ముతున్నాను.
వాహ్! ఎంత చక్కటి శుభవార్త చెప్పారు శివా గారు.
రిప్లయితొలగించండిఈ పుస్తక సంకలనమే,మనం దాసరి సుబ్రమణ్యం గారికి ఇవ్వగలిగే నిజమైన నివాళి.
శివరాం గారూ,
రిప్లయితొలగించండిదాసరి గారు చందమామలో ఉద్యోగిగా ఉంటూనే ఇతర కథల పత్రికలకు కాస్త ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో బొమ్మరిల్లు పత్రికకు మృత్యులోయ సీరియల్‌ను రాసి పంపిన వైనం 'రచన' మాసపత్రిక జూన్ సంచికలో నాయని కృష్ణమూర్తిగారు హృద్యంగా రాశారు. చందమామలో ఆయన రాసిన 12 ధారావాహికలు చందమామ ఆన్లైన్ ఆర్కైవ్స్‌లో మాత్రమే దొరుగుతాయి. చందమామ అభిమానుల ఇళ్లల్లో కూడా బౌండ్ల రూపంలో ఉన్నాయనుకోండి. ఈ 12 సీరియల్స్ పుస్తకాలుగా ప్రింట్ కావడం అసాధ్యం. ఈ నేపథ్యంలో దాసరి గారి 13 వ సీరియల్ ముందుగా రచన శాయిగారి ప్రమేయంతో ప్రింట్ అవుతుండటం నిజంగా అందరూ సంతోషించవలసిన విషయం. దాసరి గారి కథల పుస్తకం ఇంద్రాణి పేరుతూ ఇటీవలే వచ్చింది. అలాగే ఆయన 1950 ప్రాంతంలో రాసిన పులిగోరు అపరాధ పరిశోధక చిన్న నవల కూడా ఇటీవలే స్వప్న పత్రిక ప్రచురణల తరపున వచ్చింది. దాన్ని కావాలంటే జిరాక్స్ చేసి పంపుతాను. రచన జనవరి సంచికకోసం ఎదురు చూద్దాము. రచన ప్రకటనను ముందుగా మీరే ప్రచురించి మంచి పని చేశారు. అభినందనలు.