18, సెప్టెంబర్ 2010, శనివారం

బాలవినోదం-బాలానందం విందాం...బాలల్లారా రారండోయ్

(బాలానందం చిన్న పిల్లల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించి పిల్లలకే కాదు పెద్దలను కూడా వినేట్టుగా తయారు చేసిన ఒకే ఒక రేడియో దంపతులు శ్రీ న్యాపతి రాఘవరావు, శ్రీమతి న్యాపతి కామేశ్వరి)
బాలానందం రేడియో చందమామ
=====================

మీడియా విషయంలో మాది సంధి తరం. నేను శివ గారి వంటి సీనియర్ల మాదిరిగా పూర్తిగా రేడియోనుఆస్వాదించలేకపోయినా...చిన్నప్పుడు బాలవినోదిని" విని చాలా నేర్చుకున్నాను. " బాలవినోదిని" విందాము...బాలల్లారా రారండో....అనే పాట వింటే ఎందుకో భలే అనిపించించేది. గాయకులూ మంచిఊపుతో అది పాడటం ఒక ఎత్తయితే...బాల వినోదిని లో కార్యక్రమాలు మరొక అద్భుతం. ప్యాకేజ్ చాలాబాగుండేది. అది ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు. టెలివిజన్ రొచ్చులో పడి రేడియో ను పట్టించుకోకుండా...నష్టపోయామని అనిపిస్తుంటుంది.

బాలానందం ల్ వచ్చిన మొద్దబ్బాయి పాటను ఈ కింది లింకు సహాయంతో వినవచ్చు

మొద్దబ్బాయి
(సౌజన్యం శ్రీ బుర్రా రాంచంద్ మరియు శ్రీ మాగంటి వంశీ)

నేను కొత్తగూడెం ఎఫ్.ఎం.లో కాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా కొద్ది కాలం పనిచేసాను. అక్కడి నాసిరకంఉద్యోగులు కూడా రేడియో పై నా ఆశక్తి నశించడానికి కారణం. బుర్ర లేని, తెలుగు సరిగా రాని వాళ్ళు కూడాచక్కని సౌకర్యాలు అనుభవించేవారు.

ఆదివారం నాడు గంట పాటు వచ్చే నాటికను మా ఇంట్లో అందరం నరాలు బిగబట్టి వినడం నాకు ఇంకా గుర్తు. ముఖ్యంగా మా అమ్మ దానిపై చర్చ జరిపి కాస్త బుర్ర పెరగడానికి ఉపకరించేవారు. ఇది కాక....క్రికెట్వ్యాఖ్యానం వినే భాగ్యం కూడా రేడియో వల్లనే దక్కింది.

'రేడియో అభిమాని' ని ఆరంభించిన శివ గారికి అభినందనలు. రేడియో రంగంలో వారు చేస్తున్న అద్భుత కృషికి హ్యాట్సాఫ్. Good Luck Shiva gaaru.
S.Ramu
A P మీడియా కబుర్లు

8 కామెంట్‌లు:

  1. ఆకాశవాణి అన్ని కేంద్రాలలోనూ బాలల కార్యక్రమాలు శని,ఆదివారాల్లో
    ప్రసారం అవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో ఆదివారాల్లో ప్రసారమయ్యే
    బాలల కార్యక్రమం సమయం తగ్గిపోయింది. అలాగే శ్రోతల్లోనూ బాలల
    కార్యక్రమం పట్ల ఆసక్తి తగ్గిపోతున్నదని చెప్పకతప్పదు. నేటికాలంలో
    టెలివిజను తళుకుబెళుకు కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనడం చాలా గొప్ప

    నగరాల్లో ఆకాశవాణి (బాలల) కార్యక్రమాలు వినే తీరిక బాలలకి
    అంతగా ఉండదు. మొబైళ్ల (FM) లో ఏవో పాటలు వింటూ కాలం
    గడిపేస్తారు కానీ మామూలు రేడియో వింటున్నవారు కనిపించరు..

    ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల బాలబాలికలతో రూపొందించే బాలవిహార్ వంటి
    కార్యక్రమాల పట్ల కొంత ఆసక్తి మాత్రం గ్రామీణ శ్రోతల్లో కనిపిస్తున్నది..

    రిప్లయితొలగించండి
  2. మనవాణిగారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. కాలాన్ని అనుసరంచి జరిగే మార్పులు అనివార్యం. ఈ బ్లాగు ఉద్దేశ్యం అలనాటి అపురూప కార్యక్రమాల గురించి తలుచుకోవటం, ఆయా కార్యక్రమాల వివరాల గురించి వ్రాయటం, వీలైతే ఆ ఆడియోలను సంపాయించి అందరికీ అందుబాటులోకి తేవటం. మీ దగ్గర రేడియో కళాకారుల ఫొటోలు, అప్పటి కార్యక్రమ ఆడియోలు ఉంటే దయచేసి మాకు తెలియచేయండి.

    రిప్లయితొలగించండి
  3. హైదరాబాద్ పిల్లల కార్యక్రమం పేరు ' బాల వినొదిని 'కాదు .' బాలవినోదం '. 'బాలానందం'
    చిన్నపిల్లల కార్యక్రమం కాగా బాలవినోదం పది పన్నెండేళ్ళ పైబడిన పీల్లలకు ప్రసారమయ్యెది.తొలుత మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమయ్యె పిల్లల కార్యక్రమాలు తరువాత పాలవెల్లి, ఆటవిడుపుపేర్లతొ ప్రసారమయ్యయి.విజయవాడ పిల్లల

    రిప్లయితొలగించండి
  4. సుధామ గారూ. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టుగా శీర్షికను సరిచేస్తున్నాను. నాకు హైదరాబాదు కార్యక్రమాలతో పెద్దగా పరిచయం లేదు. నేను ఎక్కువగా విన్నది కార్మీకుల కార్యక్రమం, ఆ తరువాత నవలా స్రవంతి. ఆ వ్యాసం వ్రాసిన రామూ గారికి తెలిసి ఉంటుందని అనుకున్నాను.

    మీ దగ్గర బాలానందం కార్యక్రమం మొదలయ్యేప్పుడు వచ్చే పాట ఉన్నదా. ఉంటే మైలుద్వారా పంపగలరా. ఒక సమగ్ర వ్యాసం వ్రాద్దామని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  5. బాలానంద సంఘం (హైదరాబాదు) వెబ్ సైట్ :
    (ఆంగ్లంలో) http://balanandam.co.in

    రిప్లయితొలగించండి
  6. మొద్దబ్బాయి లింక్ పనిచేయడం లేదు. గమనించగలరు

    రిప్లయితొలగించండి
  7. మీరిచ్చిన మొద్దబ్బాయి లింక్ http://www.maganti.org/audiofiles/air/songs/rburra/10.html ఇక్కడికి వెళ్తోంది. అంతవరకు పనిచేస్తోంది. అక్కడ ప్లేయర్ పనిచేయడంలేదు. మాగంటి వారి సైట్లో మళ్ళీ వెతుక్కోవాలేమో మరి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.