19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఒక అభిమాని కోరిక

చందమామ అసోసియేటెడ్ ఏడిటర్ శ్రీ రాజశేఖర రాజుగారు తన రేడియో అభిమానాన్ని ఈ విధంగా మైలులో తెలియచేశారు. వారికి రేడియో సిలోన్ లో వచ్చిన తెలుగు కార్యక్రమాల మీద ఉన్న మక్కువ అద్భుతం

=============================================================
మీరు తప్పకుండా శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్‌లో తెలుగు విభాగంలో పనిచేసి లక్షలాది మంది శ్రోతలను 1960,70,80,90 దశకాల్లో మంత్రముగ్ధులను చేసిన మీనాక్షీ పొన్నుదొరై గారిపై కథనాన్ని, ఆమె వాయిస్‌ సేకరణను మర్చిపోవద్దండి.
ఆమెపై మీరే బ్లాగులో వ్యాసం రాసి ప్రచురిస్తే ఇతరులు అందుకుని సమాచారం పంచుకోగలరు. 1972 నుంచి 81 వరకు సిలోన్ రేడియో తెలుగు పాటల ప్రోగ్రామ్‌ను పల్లెలో ఉన్న ఏ వారమూ మిస్ కాకుండా విన్న అదృష్టం మాది అంటే నమ్మండి. ముఖ్యంగా పాత పాటల పట్ల మమకారంతో పాఠకులు రాసే ఉత్తరాలను కమనీయ కంఠంతో చదివి వినిపించడంలో మీనాక్షి అక్కయ్య గారు ఒక జాతి తపనను, మక్కువను తనదిగా భావించుకుని శ్రోతల వాణిని తన గొంతులో పలికించేవారు. మధ్యాహ్నం రెండున్నర అయిందంటే అప్పట్లో పల్లెల్లో రేడియోలన్నీ సిలోన్ రేడియో పాటలనే వినిపించేవి. జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకం సిలోన్ రేడియో పాటలు, మీనాక్షి అక్కయ్య గొంతు.

ఎలాగైనా సరే ఆమె స్వరాన్ని మీరు సేకరించండి.
=============================================================
మీనాక్షి పోన్నుదురై అంటే 1960 లు 1970 రేడియో ఉన్న తెలుగువారేవ్వరూ మరువలేరు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు, ఆవిడ మధుర స్వరం వినాల్సిందే. వచ్చీ రాని తెలుగులో ఆవిడ మాటలు, చక్కటి స్వరంతో ఆవిడ పాటల వివరాలు ఇవ్వటం ఎంతో బాగుండేది.

నావంతు కృషి నేను చేస్తున్నాను. ఈలోగా ఆవిడ గురించిన వివరాలు, ఫోటో అన్నిటికి మించి అప్పటి ఆవిడ గొంతు రికార్డు చేసుకున్న అదృష్టవంతులు ఎవరన్నా ఉంటే దయచేసి వివరాలు తెలుపగలరు.

2 కామెంట్‌లు:

  1. ^ వంశీగారు ఇచ్చిన లంకెలో ఓ హిందీ పాట - ఆ పాట ట్యూను
    మీనాక్షి పొన్నుదురై గారి కార్యక్రమానికి ఉండేదని - ఓ జ్ఞాపకమూ
    ఉన్నాయి.. కింది "నారిగాడి సోది" లంకెలనీ ఓసారి చూడండి !!

    English Translation :
    http://brijbaala.blogspot.com/2006/01/akasavani-visakhapatnam-kendram.html

    Telugu original pdf file :
    http://www.siliconandhra.org/monthly/2005/january05/jan2005_narigadisodi.pdf

    రిప్లయితొలగించండి
  2. ఇంటరునెట్ శోధనలో కనిపించినది :
    ( http://www.island.lk/2002/06/30/opinio05.html )

    Opinion
    Meenakshi Ponnudurai

    "You are my most steadfast friend," wrote Meenakshi Ponnudurai to me in her last polychromatic birthday card.

    Meenakshi was my mentor. In those memorable days, she used to be the official Telugu announcer at the Sri Lanka Broadcasting Corporation in Colombo, while I did my stint as official Kannada announcer. If Telugu were the honey, Kannada was the queen of spices - Kasthuri.

    On 22.07.2001, that last working day in her life, before she left Studio No. 9 at the SLBC, she reminded listeners of her tryst on the following day to speak on the matinee idol and great Thespian, Shivaji Ganeshan. Sadly, she never made it. At nine o’clock on the following morn, she peacefully passed on. In her mid-seventies.

    Meenakshi was well versed in Vedantic lore, and her listeners would sit with rapt attention listening to her interpretation of Yogas and Yagnas. Her delineation of Navarathri, Shivarathri, Thai Pongal and other Hindu festivals, which were here favourite subjects in which she dwelt often, would hold her fans and listeners spellbound. The archives at the Rupavahini Corporation and at SLBC will be posthumously resounding and resonating with her knowledge.

    I pray to God to shower her and her family with cornucopia.

    Mrs T. S. Sameer

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.