18, అక్టోబర్ 2010, సోమవారం

కిన్నెరసాని పాటలు విశ్వనాథ వారి గళంలో

(1969 లో ఒక గ్రందావిష్కరణ చేస్తున్న శ్రీ విశ్వనాథ)

మనం మన అభిమాన రచయితల గొంతులో వారి రచనలను వినే అదృష్టం చాలా తక్కువగలవారం . కొడవటిగంటి సీతప్ప కథలను ఆయన గొంతులోనే వినే అవకాశం లేదు, చలంగారి మ్యూజింగ్స్ ఆయన గొంతులోనే వినగలిగితే? ఎంతటి అద్భుతమైన కల!

నేను కొంత కాలంగా వెతుకుతున్న విశ్వనాథ వారి గళం క్రితం వారం హైదరాబాద్ వెళ్ళినప్పుడు దొరికింది. అక్కడ ఒక గంధర్వుడు ఉన్నాడు. గంధర్వుడు చూడటానికి చాలా సామాన్య వ్యక్తిలాగా కనిపిస్తాడు, ఎంతో స్నేహశీలి. ఎంతటి ఓర్పు, ఎంతటి ఆసక్తి ఆయనకు! ఆయన పేరు శ్రీ శ్యాంనారాయణ్ . ఆయన చేసేది సామాన్యమైన చిన్ని వ్యాపారం, కాని కాబినెట్ మంత్రిగారు ఆయన అప్పాయింట్మెంటు అడిగి మరీ వస్తారు ఆయన దగ్గరకు ( విషయం గురించి ఫొటోలతో సహా మరొక ప్రత్యెక వ్యాసం త్వరలో). నాకు అడగకుండా సహాయం చేసేవాళ్ళందరినీ గంధర్వులుగా భావించి గౌరవిస్తాను .

మళ్ళి విషయంలోకి వస్తే, మన శ్యాం నారాయణ్ గారి దగ్గర నాకు కావలిసిన ఆడియో దొరికింది. దొరికింది కదా అని దాచేసుకోవటం భావ్యం కాదుకదా. ఆడియో ఏమనుకున్నారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణగా గారు తన మానసపుత్రికగా భావించే కిన్నెరసాని పద్యాలను తాను ఆస్వాదిస్తూ శ్రోతలను అలరించటానికి ఆకాశవాణిలో ఎప్పుడు గానం చేసారో తెలియదు, మహానుభావులు రికార్డు చేసి ఉంచారో తెలియదు, ఈరోజున దొరికింది.

కింది ప్లేయర్ లో విని ఆనందించండి






ఈ గానాన్ని మీ బ్లాగుద్వారా లేదా వ్యాసంద్వారా ఇతరులకి వినిపించండి మరింతమందిని ఆనందపరచండి. కాని, మీకు దొరికిన స్థానాన్ని తీసి పారేస్తూ "ఇక్కడ" అని మాత్రం లింకు ఇవ్వకండి. చక్కగా బ్లాగు పేరు వ్రాసి లింకు ఇవ్వండి. అదొక చిన్న బ్లాగు మర్యాద.






*****************

11 కామెంట్‌లు:

  1. శివ గారు,
    మంచి ఫోటో పెట్టారు. మనోజ్ గారి collectionలో మరో ౩ విశ్వనాథ గారి photoలు చూసాను. Link ఇచ్చినందుకు మీకు, అవి మనతో పంచుకున్న మనోజ్ గారికి ధన్యవాదాలు.
    మీరు శ్యాం గారిని కలిసిన ఒక రోజు ముందే వారిని నేను కూడా కలిసాను. విన మరుగైన శబ్ద తరంగాలన్నీ అందరికీ అందుబాటులోకి తేవాలనే మంచి ఉద్దేశంతో ఈ project చేపట్టారు శ్యాంగారు. అందరికీ సాయపడే మనసు వారిది.

    రిప్లయితొలగించండి
  2. మీకు దొరికిన ఇటువంటి అరుదైన వాటిని మిగతా వారితో కుడా పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు. కవిరాజు గారి గళం వినడం అదృష్టంగా భావిస్తున్నాను....!

    రిప్లయితొలగించండి
  3. శివ గారూ,
    మీకు దొరికిన అమూల్యరత్నాన్ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు..ఈమాట వాళ్ళు కూడా ఈ టేపు పెట్టినట్టు గుర్తు....
    గురువుగారి శిష్యులలో ఒకరైన వెలిచాల కొండలరావు గారు విశ్వనాథ సాహిత్య పీఠం అని ఒక సంస్థని ప్రారంభించి నడుపుతున్నారు..గురువుగారు ప్రారంభించి ఆపేసిన "జయంతి" పత్రికని కూడా ఆయన నడుపుతున్నారు....కొన్నినెలల క్రింద వారి దగ్గరికి వెళ్ళి కలిశాను..వాళ్ళు ప్రచురించిన "విశ్వనాథ అసంకలిత సాహిత్యం" ఆరు సంపుటాలూ,"ముద్దు వడ్డన్లు" ఐదు సంపుటాలు,"మురిపాల ముచ్చట్లు" తెచ్చుకున్నాను...వారి దగ్గర గురువుగారి గళంలో ఉన్న ఉపన్యాసాలూ,విమర్శలూ చాలా ఉన్నాయి..వాటిని క్యాసెట్ల,సీడీల రూపంలో తీసుకుకురావాలి అనుకుంటున్నారు..సమయం పట్టొచ్చు అన్నారు...వేచి చూడాలి...

    రిప్లయితొలగించండి
  4. కౌటిల్యగారూ. మంచి విషయం చెప్పారు. ఇలా విశ్వనాథ వారి ప్రసంగాలను, గోష్టులను, ఇతర ఆడియోలను సి. డి లుగా ప్రచురించే ప్రయత్నం చేస్తున్నది ఎవరో దయచేసి వివరాలు తెలుపండి. అందరికీ తెలిస్తే వారికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఓపిక గలవారు వారికి తగిన సహయామూ చెయ్యవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. విశ్వనాధ సాహిత్య పీఠం :
    http://www.vishwanathasahityapeetham.com/new/index.html

    రిప్లయితొలగించండి
  6. కాలేజీ రోజుల్లో సాయంత్రాలు ఆరుబయలు పడుకొని రేడియో వినే అలవాటు వుండేది నాకు సాయంత్రాల పూట.ఆ రోజుల్లో విన్నాను ఈ కార్యక్రమం .విశ్వనాధ వారి ప్రతిభ వ్యుత్పత్తులు అంటే నాకు మొదటినుంచి చాలా గౌరవం. మరల ఒక సారి వారి గళం వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ పాట లింక్ ను నేను నా బ్లాగ్ లో వుంచాలనుకుంటున్నాను .కృతజ్ఞతలు శివరామ ప్రసాదు గారూ !

    రిప్లయితొలగించండి
  7. హనుమంతరావుగారూ! మీ బ్లాగులో నిరభ్యంతరంగా లింకు ఇవ్వండి. ఆ తరువాత మీరు ఆ రోజులలో రేడియోలో వచ్చే కార్యక్రమాలను రికార్డు చేసి ఉంటే వాటిని మీ బ్లాగుద్వారా అందరితో పంచుకోమని ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  8. అలా విశ్వనాధ గారి స్వరం వింటుంటే చల్లని చక్కని ప్రశాంతమైన ఒకప్పటి ప్రపంచలొ విహరిస్తున్నట్లుగా వున్నది. స్వర బంధనం చెసినవారికి అది అందించిన శివ గారికి కృతజ్ఞతలు.

    రాధాక్రిష్న,
    విజయవాడ.

    రిప్లయితొలగించండి
  9. విశ్వనాథ వార్ స్వరాన్ని అందించిన శివ గారికి కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  10. many thanks sir .. కానీ ఇందులో ప్లేయర్ లింక్ ఏమీ కనబడటం లేదు.. please help

    రిప్లయితొలగించండి
  11. మూర్తిగారూ మళ్ళీ లింకు ఇచ్చాను ఇప్పుడు కనపడుతుంది, విని ఆనందించండి.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.