17, అక్టోబర్ 2010, ఆదివారం

ఆహ్లదకర వాణి - ఆకాశవాణి

మనసు మీద ఏటువంటి దుష్ప్రభావం చూపని, కళ్ళకు, చెవులకు హాని కలిగించని, ఒక సౌకర్యవంతమైన సాధనం రేడియో.ఈ కేబుల్ టీవి మహమ్మరి మన మీద దాడి చెయ్యని, ఆ రొజుల్లొ, ఆకాశవాణి అందించిన ఆ ఆహ్లదకరమైన కార్యక్రమాల విషేషాలు, నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా.

వారంతపు వినోదం అనగానే, మన అందరకు గుర్తుకు వచ్చేది, ఆది వారం మద్యాహాన్నం 3 గంటలకు ప్రసారం అయ్యె నాటకం. మంచి కదాంశంతొ , ఒక గంట పాటు మన అందిరిని అలరించేది. ముఖ్యంగా , జాతీయ నాటక వారోత్సవాలు జరిగినప్పుదు, దేశ వ్యాప్తంగా వున్న, వివిధ ఆకాశవాణి కేంద్రాల నుంచి, వైవిద్యమైన నాటకాల ప్రసారం అయ్యేవి.ఇంక రేడియో వార్తలు అనగానే, ఉదయం 7 గంటలకు ప్రసారం అయ్యే వార్తలు మరుపురానివి. ఇప్పటి 24 గంటల వార్త చానెల్స్ వలే , ప్రతీ పనికిమాలిన విషయాన్ని సంచలన వార్తగా ప్రసారం చెయకుండా, జాతీయ, అంతర్జాతీయ వార్తలను, కేవలం 10 నిముషాలలో మన అందరికీ అందించేవారు.ఇంక మద్యాహాన్నం 1.30 ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్తలు కూడ, రాష్ట్రీయ వార్తలను, ఏటువంటి పక్షపాతం లెకుండా, మనకు అందించేది.

తూఫానులు, వరదలు ఎప్పుడు వచ్చిన ఆ రొజుల్లో అందరికీ రెడియోనే ఆధారం. వర్షా కాలంలొ కరెంటు పొయిన రాత్రి, రెడియో ముందే కుర్చుని, పెద్దలందురు, ఈ తూఫాన్ ఏప్పుడు తగ్గుతుందో అని, రెడియో లొ వాతావరణ విషేషాలను శ్రద్దగా వినే వారు.

రేడియో మన దిన చర్య లొ ఒక భాగం. ఉదయం 7 గంటలకు జాతీయ వార్తల వింటూ, ఉపహారం చెయడం, రేడియో సినీమ పాటలు వింటూ, ఉదయం 9 గంటలౌకు పాఠశాలకు కు వెళ్ళడం, మళ్ళీ మద్యాహాన్నం పాఠశాల నుంచి వచ్చి , 1.30 కి భొజనం చేస్తూ, ప్రాంతీయ వార్తలను వినడం,
మళ్ళీ రాత్రి నిద్ర పొయో ముందు , వివిధ భారతి కేంద్రం లొ అలనాటి సినీమాలలో మధుర గీతాలని వినడం, ఏల మర్చిపోగలము.

ఉదయం 8.30 గంటలుకు ప్రసారం అయ్యే, కర్ణాటక సంగీత కార్య క్రమంలొ, వివిధ రకాల వాద్య సంగీతం, కర్ణాటక సంగీత నెర్చుకోవాలీ అనుకునెవారికి, సంగీత పాఠాల కార్యక్రమాలు, ఏంత ఆహ్లద కరంగా వుండెవొ. మధ్యహాన్నం 2 గంటలకు, సిలోన్ రెడియో కేంద్రం లొ, ప్రసారం అయ్యే తెలుగు కార్యక్రమాలు కూడ మనసుని దొచుకొనేవి.


ఇంక ఆది వారం ఉదయం 8 గంటలకు, 80 వ దశకం చివరలొ, ఆకాశవాణి, పిల్లల కోసం, ప్రసారం చేసిన, 30 నిముషాల సైన్స్ కార్యక్రమం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ధారావాహికలొ, భూమి పుట్టుక నుంచి, గ్రహాల స్తితిగతులు, ప్రపంచ వ్యాప్తం గా వివిధ నాగరికతల ఆవిర్భావం ఏలా జరిగిందోలాంటి ఎన్నొ వైజ్ఞానిక ఆంశాలను సామన్యులు కూడ అర్దం అయ్యెవిధంగా ప్రసారం చేసిన ఆకాశవాణి కృషి నిజంగా అభినందనీయం .

దయ చెసి ,ఈ సైన్స్ ధారావాహిక రేడియో కార్యక్రమాల రీకార్డింగ్ ఎవరి వద్ద నైనా వుంటే , ఈ బ్లాగు ద్వారా పంచుకోగలరని ఆశిస్తున్నాను.


ఈ రేడియో అనుభవాలు శ్రీ కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారివి. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చందమామకు అభిమాని. ఆయన రేడియో అభిమాని కూడ అని తెలిసినతరువాత ఆయన రేడియో జ్ఞపకాలను అందరితో పంచుకోమని అడగ్గానే వ్రాసి పంపారు, కృతజ్ఞతలు,



1 కామెంట్‌:

  1. నాకు బాగా గుర్తు, ఆదివారాల్లో, మధాన్నం నాటిక , బాలానందం కార్యక్రమం, సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చేవి. బాలానందం ఎక్కడున్నా రేడియో దగ్గరకొచ్చి క్రమం తప్పకుండ విని ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు ఈ క్రింది పాట బాగా గుర్తు.

    పప్పా పాట పాడనా మమ్మీ మాటాడన

    చెల్లి కథ చెప్పనా

    అమ్మ నాన్న పల్లవి అన్న చెల్లి చరణాలు

    ఆ పాటకు నేనే రాగాన్ని దీని పేరే అనురాగం

    ఇప్పటికి ఆ ట్యూన్ తో సహా వినపడుతున్నట్టే ఉంది. మీ పోస్ట్ తిరిగి అ జ్ఞ్యాపకలను గుర్తు చేసింది. ఆ పాట ఎక్కడన్నా ఉంటె , వినాలనుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.