12, అక్టోబర్ 2010, మంగళవారం

ఆకాశ వాణితో నా అనుభవాలు

నేను తొలిసారి గా ఆకాశ వాణిలో అడుగు పెట్టినపుడు " మహిళా సమాజం " కార్యక్రమానికి శ్రీమతి న్యాపతి కామేశ్వరమ్మ గారు ఉండే వారు. అప్పుడు మేము ఆనంద నగర్ కాలని మహిళా సమాజం నుంచి " పట్టు చీర " నాటకం వేసాము. అప్పుడు నాకు పెద్ద వయసున్న స్త్రీ పాత్ర ఇచ్చారు. అంతా విన్నాక ఆవిడ " ఇంత చిన్న పిల్లకి అంత పెద్ద పాత్ర ఇచ్చారేమిటి ? " అని అడిగారు. అందుకు ఒకావిడ " చిన్న పిల్లేమిటి ? ఆవిడకి ముగ్గురు పిల్లలు " అంది అందుకు కామేశ్వరమ్మ గారు. " దానికేముంది " 20 ఏళ్లకే ముగ్గురు పిల్లలు ఉండ వచ్చును కదా ? " అని నిజంగా కూడా అంతే మరి. ఆ విధం గా నా తొలి అనుభవం గుర్తుండి పోయింది.

అప్పడికి ఎన్నోసార్లు రేడియోకి పత్రికలకి కధలు వ్యాసాలూ పంపడం అవి తిరిగి రావడం అలవాటై పోవడంతో ఆ రేడియో అనుభవం మధుర స్మ్రుతి గా మిగిలి పోయింది.
అప్పుడే తెలిసింది ఏమిటంటే " పిల్లల కార్య క్రమానికి [ బాలా నందం ] పిల్లలని " ఫ్రీ " గానే తీసుకుని వెళ్ళవచ్చని. ఆ కార్య క్రమం ఆవిడే నిర్వహించే వారు గనుక . సరే మెల్ల మెల్ల గా మా ముగ్గురు పిల్లలని తీసుకుని వెళ్ళేదాన్ని. ఒక పెద్ద వాడికి మాత్రమే ఐదు ఏళ్ళు గనుక చిన్న చిన్న కవితలు నేనే రాసి చెప్పించే దాన్ని. చిన్న వాడు కుడా అప్పుడప్పుడు చెప్పే వాడు. పాపకి సరిగా మాటలు రావు. నేను రాసినవి అనగానే ఆవిడకి బాగా నచ్చేది. .. ఉదా ; " అల్లరి చెల్లీ తినకే పల్లీ ...... చెప్పిన మాటా వినవె తల్లీ ........ దగ్గొస్తుం దేమళ్ళీ మళ్ళీ ........అల్లరి చెల్లి తినకే పల్లీ " ఇలా ఎవరు చెప్పనివి చెప్పించే దాన్ని. అలా అలా వారం వారం బాలా నందం ధర్మమా అని కొంచం కొంచం అందరు పరిచయం కావడంతో ఒకరోజు ఒక కధ " కొత్త పెళ్లి కొడుకు " తీసుకుని యువ వాణీ లొ ఇచ్చాను .అప్పుడు యువ వaణిలో దేవేళ్ళబాల కృష్ణ గారు ఉండేవారు. ఆయన వెంటనే చదివి రికార్డింగు చేయించారు. ఫాలాని రోజున వస్తుంది విను అని చెప్పారు.అంతేనా ? ఒక పది రోజుల తర్వాత పాతిక రూపాయలు ఎం .ఓ. వచ్చింది.
తర్వాత మెల్ల మెల్లగా " శారదా శ్రీని వాసన్ గారు , శ్యామలా దేవిగారు , వరలక్ష్మి గారు , వింజమూరిలక్ష్మి గారు అందరు పరిచయం అయ్యారు. వర లక్ష్మి గారు " కుటుంబ నియంత్రణ " గురించి బోలెడు కధలు రాయించారు. పైగా మనం కదని " టు ది స్టేషన్ డైరెక్టర్ " అని పంపిస్తే దాన్ని వారే పరిశీలించి ఏ విభాగానికి పనికి వస్తుందో [ అంటే హైదరాబాదు " ఏ " కా " బి " కా " ] నిర్ణ యిం ఛి మనకి కాన్ ట్రాక్ట్ పంపే వారు. " బి" లో "పాతిక " లేక "యాభయ్ " ఇచ్చే వారు . అలా పరిచయాలు పెరిగి పెరిగి " ఏ " బి " లలో కధలు వ్యాసాలూ కోకొల్లలుగా వచ్చాయి.
తర్వాత కొన్నాళ్ళకి కామేశ్వరమ్మ గారి తర్వాత " బాలానందం , మహిళా సమాజం " శారదా శ్రీని వాసన్ గారు నిర్వ హిం చే వారు. ఒకసారి " శ్రావణ శుక్ర వారం పేరంటానికి పిలిచాను . మాయింటికి రమ్మని కారు పంపించాను అప్పుడు శ్యామల గారు ,సీత గారు ,శారద గారు వచ్చి నన్ను ధన్యురాలిని చేసారు .బాల కృష్ణ గారు మా వారికి సన్ని హితులయ్యారు. అదే రోజుల్లో బాల కృష్ణ గారి ద్వారా నేను " బి" లో లలిత సంగీతం పాడే అదృష్టం బాల కృష్ణ గారి ద్వారా కలిగింది.
పిమ్మట కాలంతో పాటు అనేక మార్పులు.
యువ వాణికి "కలి వేలు " గారు వచ్చారు. " మహిళా సమాజం ,బాలా నందం " తురగా జానకి రాణి గారు , వచ్చారు. లక్ష్మి , అరుణా చలం గారు ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు వచ్చారు .ఇంకా చెప్పాలంటే నాతొ అరగంట కార్య క్రమానికి పాల్గొన్న వారు ఇప్పుడు స్టుడియోలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. [ అదే " సుధామ ] పోతుకుచి సాంబ శివరావు గారు మమ్మల్ని అరగంట ప్రోగ్రాం " బి .లొ ." " సుధామ , నేను , టి. గౌరీ శంకర్ .[ ఆయన ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్స్ టీలో ఉన్నత పదవి నలంకరించి ఉన్నారు } ఇంకా శ్రీ శైలం గారు ఇలా మేమంతా పాల్గోనీ వాళ్ళం . అది ఒక మధుర స్మ్రుతి .ఇలా అనుభ వాలు చక్కని జ్ఞాపకాలు కోకొల్లలు. .
ఒక సారి రికార్దిమ్ గుకి వెళ్లాను ఎదురుగా ఉన్న వ్యక్తిని " వర్మ గారు కావాలం డి " వారి రికార్డిం గు ఉంది అన్నాను " " అలాగా ? ఐతే నేనే ఆ వర్మ ని ? " అన్నారు అదొక తీపి జ్ఞాపకం.
తర్వాత " ఘోష్టి " కార్య క్రమాలు " గిడుగు లలితా , ఉన్నవ విజయ లక్ష్మి , నేను " పాల్గొనే వాళ్ళం. ఇలా చెప్పు కుం టు పొతే ఎన్నో ఎన్నెన్నో ? ఆ రోజుల్లోనే " జానకి రాణి గారు నన్ను " నువ్వు ధిల్లీ రాజేశ్వరి వా ? అని అడిగారు కాదన్నాను. ఊరూరికే కనబడు తున్నావ్ ? ఏమిటి సంగతి ?? అని ? " ఇలా ఫలాని వారి రికార్డిం గు అంటే సరే ఐతే వారి కార్య క్రమాలకే వెళ్ళు నేను ఇవ్వను . " అనేవారు రాను రాను ఇద్దరం ఫ్రండ్స్ అయిపోయాము.
ఇలా ఇంకా బోలెడు. అప్పడి కన్నా " ఇప్పుడు డబ్బు ఎక్కువ చేసారు.
ఇప్పుడు ఐదు వందలు ఇస్తున్నారు. మూడేళ్ళుగా నాకు స్టూడియో గురించి తెలియదు .ఇక పండా శమంతకమణి గారి వార్తలు వినసొంపు . శారదా శ్రీని వాసన్ గారి గళం అతి మధురం .ఇక " జీడి గుంట రామ చంద్ర మూర్తి గారు సదాసివ రావు గారు [ చుట్టాలు ] అభిమానంతో ఒక సారి వారిని దర్శిం చుకుని రావడం. ఇక రాను రాను " ఉషా రాణి, నాగ పద్మిని ,ప్రసన్న ఇలా కొత్త కొత్త వాళ్ళు. వచ్చారు.ఇక నండూరి కృష్ణ మాచారి గారను కుంటాను సరిగా గుర్తు లేదు ఎప్పుడు " డ్యూటీ ఆఫీసరుగా ఉండే వారు. స్టాంపులు పట్టు కెళ్లాలని నాకు తెలిసేది కాదు .పాపం విసుగు లేకుండా చిరు నవ్వుతో స్టాంపులు ఇచ్చేవారు. అప్పటి కార్య క్రమాల పేర్లు ఒక్కొక్కరి తో ఒక్కొక్క అనుభవం మరచి పోలేని మధుర మైన జ్ఞాపకాలు గా మిగిలి పోయాయి . నిజానికి అప్పుడు స్టూడియో బిల్డింగు పాతది ఉండేది .ఇప్పడు అన్నీ మార్పులే స్టూడియో లొ అడుగు పెట్టగానే వింత అనుభూతి. తెల్లని లైట్ల కాంతి చల్లని" ఏ.సి. " నిశ్శబ్దంగా తిరగే దేవ దూత ల్లాంటి డ్యూటీ ఆఫీసర్లు , అదొక ఇంద్ర లోకం లా అనిపించేది . నిజం గా ఇక్కడ అడుగిడా లంటే అదృష్టం ఉండాలి అనిపింస్తుంది. అందుకే ఈ ఆకాశవాణి అనుబంధం నా పూర్వ జన్మ సుకృతం .

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.