7, నవంబర్ 2010, ఆదివారం

రఘుపతి రాఘవ రాజారాం

రఘుపతి రాఘవ రాజారాం పాట మనకు సుపరిచితం. పాటను ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశపు పాప్ గ్రూప్ 'ఒసిబిస' 1981 లో భారత దేశానికి వచ్చి ఇక్కడ కచేరీలు (concerts) చేసినపుడు ఇక్కడ ప్రముఖ నగరాలలో పాటను వారి శైలిలో ఆఫ్రికన్ డ్రమ్స్ నేపధ్యంలో పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు. పాటను మీకోసం. కింది ప్లేయర్ లో హాయిగా వినండి.వచ్చీ రాని వారి ఉచ్చారణలో పాట వినటానికి సరదాగా ఉంటుంది. మనదైన ఈ చక్కటి పాటకు వాళ్ళు ఇచ్చిన ఉపోద్ఘాతం కూడ సముచితంగా ఉన్నది.

అప్పట్లో
భారత్ పర్యటన సందర్భంగా
ఒసిబిస (Osibisa) గ్రూప్ వారు విడుదల చేసిన ఎల్ పి రికార్డులోనిది పాట. స్టుడియోలో పాడినది పాట కాదు, కచేరీ జరుగుతుండగా లైవ్ రికార్డింగు, ఆ తరువాత ఆల్బంలో చేర్చబడినది. నిజానికి, ఆ ఎల్ పి కి ఒక పక్క మొత్తం ఈ పాటే ఉన్నది. వినే శ్రోతలచేత కూడ ఈ పాటను రక రకాలుగా పాడించి వాళ్ళు స్టేజీ మీద డాన్సు చేస్తూ అందరినీ మైమరిపించారని అప్పుడు ఆ కచేరీలు చూడగలిగిన వాళ్ళు చెప్పినట్టు గుర్తు. ఎప్పటి మాట!! మూడు దశాబ్దాలు ఐపోయింది (1981 లో) .

ఎల్ పీ లో ఒక్క పాటే అతి కష్టం మీద దొరికింది. ఎల్ పీ ఎక్కడా దొరకటం లేదు. ఎక్కడో ఒకచోట కలెక్షన్లోఉండి ఉండవచ్చు. దొరికితే అన్ని పాటలూ వింటే ఇంకా బాగుంటుంది.

*

2 వ్యాఖ్యలు:

  1. థాంక్స్ శివరామ్ గారు, ఈ పాట కోసం నేను చాల వెతికాను కాని ఆల్బం పేరు తెలియక పోవడం తో దొరకలేదు. నా చిన్ననాటి ఇష్టమైన పాట ఇది. నాన్నగారు ఎక్కువగా పెట్టేవారు అప్పుడు వినేవాడిని, ఇప్పుడు మీ దయవల్లా దొరికింది చాల సంతోషంగా వుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. థాంక్స్ శివరామ్ గారు, ఈ పాట కోసం నేను చాల వెతికాను కాని ఆల్బం పేరు తెలియక పోవడం తో దొరకలేదు. నా చిన్ననాటి ఇష్టమైన పాట ఇది. నాన్నగారు ఎక్కువగా పెట్టేవారు అప్పుడు వినేవాడిని, ఇప్పుడు మీ దయవల్లా దొరికింది చాల సంతోషంగా వుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుపగలరు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.