13, నవంబర్ 2010, శనివారం

మార్క్ ట్వైన్ ఆత్మ కథ

మార్క్ ట్వైన్ ఫోటో కర్టెసీ కొలంబియా న్యూస్ వార్తా పత్రిక

అమెరికాకు
చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత శ్రీ మార్క్ ట్వైన్. మనకు మార్క్ ట్వైన్ గానే తెలుసు ఆయన. కాని ఆయన అసలు పేరు శామ్యూల్ లాంఘోర్న్ క్లేమేన్స్. 74 సంవత్సరాలు జీవించి ఆయన ఏప్రిల్ 21. 1910 మరణించారు. ఆయన మరణించి వంద సంవత్సరాలు దాటింది. ఆయన రచించిన టాం సాయర్, హకల్బెరి ఫిన్, విచిత్ర వ్యక్తీ, రాజు పేద మొదలైనప్రముఖ నవలలు మనకు పరిచయమే.

మార్క్ ట్వైన్ హాస్య ప్రియుడు. ఆయన తన అవసాన దశలో ఆత్మ కథ వ్రాసుకోవటం మొదలుపెట్టారు. ఆత్మ కథను పూర్తిచేసి, ప్రచురించటానికి మటుకు ఒక ఆక్ష పెట్టారు. అదేమిటి అంటే, తన ఆత్మ కథను తాను మరణించిన వందసంవత్సరాలు ఐన తరువాతనే ప్రచురించాలని. అందుకు కారణం క్కూడా ఆయనే చెప్పారు, ఆత్మ కథ వెను వెంటనే ప్రచురించబడితే తాను తన నిర్మొహమాటంగా వ్రాయలేనని.

కాబట్టి
, ఇప్పుడు, సంవత్సరంలో సమయం వచ్చింది. ఆయన ఆత్మకథను ప్రచురించారు. ప్రచురించిన ఆత్మకథను బి బి సి రేడియో 4 వారు వారం వారం ప్రసారం చేసే "బుక్ ఆఫ్ ది వీక్" కార్యక్రమంలో చదివి వినిపించారు. ప్రస్తుతానికి ఐదు భాగాలు శ్రోతలకు వినిపించారు.

ఈ ఐదు భాగాలను వినటానికి ఈ కింది లింకు నొక్కి బి బి సి వారి ఐ ప్లేయర్ నొక్కి వినవచ్చు. కాకపొతే ఈ ఆడియో పుస్తకపు ఐదు భాగాలూ కొద్ది కాలం మాత్రమె ఆ ప్లేయర్లో లభ్యమవుతాయి. కాబట్టి తొందరగా వెంటనే వింటేనే, పైన చెప్పిన మార్క్ ట్వైన్ ఆత్మకథ వినగలుగుతారు.

మార్క్ ట్వైన్ ఆత్మకథ



(ఈ విషయం నిన్న చూశాను. ఇంటర్నెట్ కి కొంతకాలం దూరంగా ఉండాలన్న విషయం కూడ పక్కన పెట్టి ఈ నాలుగు మాటలూ వ్రాశాను)





1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.