చిన్నతనంలో అంటే 1970 లలో వాయిస్ ఆఫ్ అమెరికా, బి బి సి వినటం ఆ విశేషాలు కాలీజీలో స్నేహితులకు చెప్పటం ఒక గొప్పగా ఉండేది. అప్పుడు విన్న కార్యక్రమాల్లో రెండు ఈ మధ్య కాసేట్లలో బయటపడ్డాయి. వాటిని వెంటనే mp3 గా మార్చాను. ఈ ఆడియో క్లిప్ లలో ఎడిసన్ కనిపెట్టిన గ్రామఫోన్, ఎలెక్ట్రిక్ లైటు గురించిన విశేషాలు ఉన్నాయి. కార్యక్రమంలో మనకు వినపడే గొంతులు ఎల్లెన్ సిల్వేర్మన్ మరియు పాట్ గేట్స్ అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వాయిస్ ఆఫ్ అమెరికా అనౌన్సర్స్ . మధ్యలో ఎడిసన్ గొంతు కూడ వినవచ్చు. ఎడిసన్ ఫోటో కర్టెసీ మల్టిసర్ఫర్.కాం
మరొక విశేషం కూడ ఉన్నది ఈ క్లిప్పింగులో . మొట్టమొదటి గ్రామోఫోన్ రికార్డింగు ఐన ఎడిసన్ గొంతు ఉన్నది. ఈ కింది ప్లేయర్ నొక్కి వినండి.అలాగే బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాక్లిన్ డెలనార్ రూజ్వెల్ట్ ప్రకటించిన నాలుగు స్వాతంత్రాలు ఆయన గొంతులోనే వినవచ్చు. ఈ నాలుగు స్వాతంత్రాల గురించి రెండో ప్రపంచ యుధ్ధంలోకి అమెరికా ప్రవేసించక ముందు రూజ్వెల్ట్ చెప్పిన మాటలవి. ఈ కింది ప్లెయర్లో వినండి.
ఈ రికార్డింగులో, రూజ్వెల్ట్ గొంతుతో బాటుగా, వాయిస్ ఆఫ్ అమెరికా అనౌన్సర్ ఎల్లెన్ సిల్వర్‌మాన్ గొంతు కూడ వినవచ్చు. ఈయన ఒక్క శనివారాలు, ఆదివారాలు మాత్రమే వచ్చేవాడు, కాని చక్కటి కార్యక్రమాలు రూపొదించేవాడు. ఈయనతోబాటుగా అప్పుడప్పుడు పాట్ గేట్స్ కూడ అనే మహిళా అనౌన్సర్ కూడ పాల్గొనేవారు. . మిగిలినరోజులలో ఫిల్ ఇర్విన్, పాట్ గేట్స్ రోజువిడిచి రోజు వచ్చేవారు. ఇవన్ని 1970 లలోని మాటలు. అవ్వొక రోజులూ!!
అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న వాయిస్ ఆఫ్ అమెరికా ఎనౌన్సర్స్ ఫిల్ ఇర్విన్ (ఎడమ) మరియు పట్రిసియ గేట్స్ (మధ్య) కుడి పక్కన ఉన్న ఎనౌన్సర్ పేరు సరిగ్గా తెలియదు. పై ఫోటో కూడా ఈ కింది లింకు ఇచ్చిన వెబ్ సైటువారు అందించినదే.
కేరళకు చెందిన అభిమాని శ్రీ Harry S. Anchan, అప్పట్లో వాయిస్ ఆఫ్ అమెరికా కార్యక్రమాల్లో వినిపించిన కొన్ని పాటలను వెబ్ లో ఉంచారు. ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.
SONGS PLAYED IN VOA DURING 1970S
అక్కడ ఉంచిన పాత ఇంగ్లీషు పాటలు విని ఆనందించండి.
.
మంచి ఆడియోలు వినిపించారు నెనర్లు
రిప్లయితొలగించండి