22, డిసెంబర్ 2010, బుధవారం

వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగం

ఆకాశవాణి విజయవాడ కేద్రం అన్నా కేద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలన్నా నాకు ఎంతో అభిమానం, ఇష్టం. చిన్నప్పటినుండి, పెరిగి పెద్దై ఉద్యోగం వచ్చి విజయవాడ వదిలి ఇలా దేశం మీద బయలుదేరి అనేక నగరాలలో పట్టణాలలో పనిచేయటం మొదలు పెట్టేవరకూ ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు క్రమంతప్పకుండా వింటూనే ఉండేవాణ్ణి . 1970 లలో నాకు టేప్ రికార్డరు అందుబాటులోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు రికార్డు చేయటం జరిగింది. కాని ఒక పద్ధతి ప్రకారం వాటిని ఉంచటం కావలిసినప్పుడు వెతికితే దొరికేట్టుగా ఉంచటం, చిన్నతనం వల్ల, వాటి విలువ తెలియక చెయ్యలేదు.

కాని అలా చెయ్యకపోవటం చేత, కాసెట్లు ఎక్కడికీ పోలేదు భద్రంగానే ఉన్నాయి కాని. అప్పుడప్పుడూ మరింకేదో వెతుకుతుంటే కనపడి, అందులో ఉన్నవి వింటుంటే ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి.

అదే పద్ధతిలో ఒక టేపు చిట్ట చివరలో కింద ఇవ్వబడిన రికార్డింగు ఉన్నది . విని చూడండి. అందులో ఉన్నది ఆకాశవాణి విజయవాడ కేద్రం వారి వివిధభారతి కేద్రం రెండవ ప్రసారం ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలయ్యేవి. మొదలు పెట్టేప్పుడు చేసిన అనౌన్సరు చేసిన ప్రకటన. ప్రకటనచేస్తున్నవారు పేరు గుర్తుకు రావటంలేదు, పెరి కామేశ్వర రావుగారా? తెలియదు.




అప్పట్లో మా ఇంట్లో ఉన్న వాల్వు రేడియోలో వినే వాళ్ళం, రేడియో పాతది అయి పోవటం వల్ల అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన ధ్వనులు సొంతంగా వినిపించేది. ఇప్పటికీ ఓపిక ఉంది ఒక అరగంట దానిముందు కూచుంటే మెల్లిగా అన్ని వాల్వులు వెలిగి నెమ్మదిగా వేడెక్కి పాటలు వినిపించటం మొదలు పెడుతుంది. పై ప్రకటనలో చూడండి టైము చెప్పి ఒక గంట మోగించారు . అప్పట్లో అదో పెద్ద గొప్ప విషయం. ఇంకా ఎలెక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రాలేదు. ఒక్క ఢిల్లీ కేంద్రం వారే వార్తలకు బీప్ వాడేవారు. మిగిలిన కేంద్రాలన్నీ కూడా గంట కొట్టి టైము చెప్తూ ఉండేవారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.