ఆకాశవాణి విజయవాడ కేద్రం అన్నా ఆ కేద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలన్నా నాకు ఎంతో అభిమానం, ఇష్టం. చిన్నప్పటినుండి, పెరిగి పెద్దై ఉద్యోగం వచ్చి విజయవాడ వదిలి ఇలా దేశం మీద బయలుదేరి అనేక నగరాలలో పట్టణాలలో పనిచేయటం మొదలు పెట్టేవరకూ ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు క్రమంతప్పకుండా వింటూనే ఉండేవాణ్ణి . 1970 లలో నాకు టేప్ రికార్డరు అందుబాటులోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు రికార్డు చేయటం జరిగింది. కాని ఒక పద్ధతి ప్రకారం వాటిని ఉంచటం కావలిసినప్పుడు వెతికితే దొరికేట్టుగా ఉంచటం, చిన్నతనం వల్ల, వాటి విలువ తెలియక చెయ్యలేదు.
కాని అలా చెయ్యకపోవటం చేత, కాసెట్లు ఎక్కడికీ పోలేదు భద్రంగానే ఉన్నాయి కాని. అప్పుడప్పుడూ మరింకేదో వెతుకుతుంటే కనపడి, అందులో ఉన్నవి వింటుంటే ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి.
అదే పద్ధతిలో ఒక టేపు చిట్ట చివరలో ఈ కింద ఇవ్వబడిన రికార్డింగు ఉన్నది . విని చూడండి. అందులో ఉన్నది ఆకాశవాణి విజయవాడ కేద్రం వారి వివిధభారతి కేద్రం రెండవ ప్రసారం ప్రతి రోజూ మధ్యాహ్నంపన్నెండు గంటలకు మొదలయ్యేవి. ఆ మొదలు పెట్టేప్పుడు చేసిన అనౌన్సరు చేసిన ప్రకటన. ప్రకటనచేస్తున్నవారు పేరు గుర్తుకు రావటంలేదు, పెరి కామేశ్వర రావుగారా? తెలియదు.

అప్పట్లో మా ఇంట్లో ఉన్న వాల్వు రేడియోలో వినే వాళ్ళం, రేడియో పాతది అయి పోవటం వల్ల అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన ధ్వనులు సొంతంగా వినిపించేది. ఇప్పటికీ ఓపిక ఉంది ఒక అరగంట దానిముందు కూచుంటే మెల్లిగా అన్ని వాల్వులు వెలిగి నెమ్మదిగా వేడెక్కి పాటలు వినిపించటం మొదలు పెడుతుంది. పై ప్రకటనలో చూడండి టైము చెప్పి ఒక గంట మోగించారు . అప్పట్లో అదో పెద్ద గొప్ప విషయం. ఇంకా ఎలెక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రాలేదు. ఒక్క ఢిల్లీ కేంద్రం వారే వార్తలకు బీప్ వాడేవారు. మిగిలిన కేంద్రాలన్నీ కూడా ఈ గంట కొట్టి టైము చెప్తూ ఉండేవారు.
Now is it possible to listen Akasavani vijawada/hyderabad live radio through internet?
రిప్లయితొలగించండిGood question Lakshman garoo. Anybody who is interested shall definitely pose this question. However, unfortunately, in Akashavani bureaucracy, there is no such thing as innovating with little cost. I have written an Open Letter to Akashavani sometime back in my blog. Read the letter with the help of the following link:
రిప్లయితొలగించండిhttp://saahitya-abhimaani.blogspot.com/2010/10/blog-post_03.html
If possibly please write just a post card to All India Radio Station, Vijayawada or Hyderabad asking them to bring their broadcasts onto Internet so that thousands can listen worldwide.