ఆకాశవాణివారు, తమ నిలయ విద్వాంసులచేత, ఔత్సాహికులచేత, ఆపైన సుప్రసిధ్ధ (సినీగాయకులతో సహా) గాయనీ గాయకులచేత వందలాది పాటలు పాడించి శ్రోతలకు అందించారు. ఈ మాసపు పాట అని ఒక కార్యక్రమం రూపొందించి నెలకొకటి చొప్పున మంచి పాటలు కూడా అందించేవారు. నా దగ్గర కాసెట్లల్లో దొరికిన పాటలను బ్లాగులో ప్రచురించే క్రమంలో ఈ రోజున మరొక పాట అందచేస్తున్నాను. ఈ పాట "రాజా సాగర రాజా". పాడిన గాయనీమణి ఎవరో తెలియటం లేదు. ఈ పాట ఒకసారి వింటే ఆరోజల్లా వెంటాడుతుంది. కొన్ని పాటలు అలా హాంటింగ్ మెలొడీస్ గా మనల్ని ఆనందపరుస్తాయి. గాయనీమణి గొంతు చాలా విలక్షణంగా ఉన్నది. బాల సరస్వతిగారేమో అనుకుంటున్నాను. కాని కాకపోవచ్చు. ఈ కింది ప్లెయర్ ద్వారా ఈ పాటను విని ఆనందించండి.
ఈ పాటలో మొదటి ఆలాపన అవ్వంగానే తబలా మెట్లు చాలా బాగున్నాయి. పాట మొత్తం తబలా,వయోలిన్ వాయిద్యాల నేపధ్యం చాలా చక్కగా ఉన్నది. సంగీతం ఎవరు సమకూర్చారో, సాహిత్యం ఎవరిదో తెలియదు. రేడియో నుంచి రికార్డు చేసిన రోజుల్లో (పాతిక ముఫ్ఫై సంవత్సరాల క్రితం) వివరాలు అన్ని క్రోడీకరించటం అంతగా తెలియదు. ఇప్పుడు ఆ వివరాలు ఎవరన్నా చెప్తేగాని తెలియవు!
ఆకాశవాణి వారు కనీసం వారి కేంద్రాల్లో ప్రసారం అయ్యిన "ఈ మాసపు పాట" కార్యక్రమంలో ఇంతవరకు వచ్చిన పాటలన్ని ఒక డి వి డిలో ప్రచురించి, వ్రాసిన రచయిత, సంగీతం సమకూర్చిన వారు, గాయనీ గాయకులు, వాయిద్యాలను పలికించినవారు, రికార్డుచేసిన టెక్నీషియన్ల వివరాలు, వారి గుర్తులను ప్రచురిస్తే లలిత సంగీత ప్రియులు వందల సంఖ్యల్లో ఉన్నారు. హాయిగా కొనుక్కుని విని ఆనందిస్తారు. మరీ ఆశ ఎక్కువ అయ్యిందనుముంటాను. ఎంత పాజిటివ్ గా ఆలోచించిన ఈ విషయంలో ఇంత ఆశ పనికిరాదేమో!!
సరే శ్రోతలమైన మనమే పూనుకోవాలి. ఎవరిదగ్గరైనా ఆకాశవాణి వారి పాటలు/నాటికలు ఇతర కార్యక్రమాలు ఉంటే దయచేసి అందరితో పంచుకోమని విన్నపం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.