23, డిసెంబర్ 2010, గురువారం

తెలుగు వార్తా చదువరులు (NEWS READERS)

ఒకప్పుడు రేడియో మాత్రమె ఒక సమాచార సాధనంగా ఉన్న అద్భుతమైన రోజులలో, ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ప్రజలలో ఒకరిగా స్థానం సంపాయించుకున్న వారు వార్తా చదువరులు (News Readers) . రేడియో మనుషులుగా ఎంతగానో ప్రాచుర్యం పొందినవారిలో న్యూస్ రీడర్లది ప్రధమ స్థానం. విధంగా తెలుగులో ఇటు ప్రాంతీయ కేంద్రాలైన విజయవాడ, హైదరాబాదు నుండి వచ్చే ప్రాంతీయ వార్తలు, అటు హస్తిన నుండి నుండి వచ్చే జాతీయ వార్తలు ప్రజలకు కావలిసిన విశేషాలను తెలియ చెప్పేవి.

వార్తలు చదివిన అనేకమంది న్యూస్ రీడర్ల గురించిన దొరికిన కొద్ది సమాచారం, ఫోటోలు, మన సుధామ (అల్లం వెంకటరావు) గారు పంపారు. వివరాలు మీకోసం:

రేడియోలో ఢిల్లీ వార్తలు చదవి ఆకాశవాణి శ్రోతలకు పరిచితులైన కొందరు:

శ్రీ అద్దంకి మన్నార్ : పుట్టింది:1934 విజయవాడలో అనౌన్సర్ గా చేరింది:1959, 1977నుండి 2 సంవత్సరాలు మాస్కోలోతెలుగు వార్తలు చదివారు
శ్రీ కొత్తపల్లి సుబ్రహ్మణ్యం: చేరింది:1954 ఫిబ్రవరి24.1956 నుండి 13 సంవత్సరాలు డిల్లీ న్యూస్ రీడర్ గా చేసి 1966 లో హైదరాబాద్ వచ్చారు
పన్యాల రంగనాధరావు:చేరింది:1943 నవంబర్/డిల్లీ న్యూస్ రీడర్/1962 లో హైదరాబాద్ .ఎన్..గా/మరణం:1987
శ్రీ.దుగ్గిరాల పూర్ణయ్య:జననం:15.4.1936.1964 లో న్యూస్ రీడర్ గా చేరారు ఢిల్లిలో.1994 ఏప్రిల్ లో రిటైరయ్యారు


శ్రీ కందుకూరి సూర్యనారాయణ జననం:29 జూలై 1936.1962 లో ఢిల్లీ వార్తావిభాగం లొచేరారు.మాస్కోలోనూ చేసారు. ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గారి కుమారుడు.



శ్రీ ఏడిద గోపాలరావు 1966 నుండి 1996 వరకూ ఢిల్లిలో వార్తలు చదివారు.మాస్కోలో 4 సంవత్సరాలు తెలుగు వార్తలు చదివారు.మంచి నటులు.గాంధీ వేషానికి పెట్టిందిపేరు
మామిళ్ళపల్లి రాజ్య లక్ష్మి:ఢిల్లీ న్యూస్ రీడర్ గా పనిచేసిరెటైరయ్యాక మదరాసులో స్థిరపడ్డారు
జోళిపాళ్యం మంగమ్మ:ఢిల్లీలో తొలి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్దులు.రిటైరు అయ్యారు.

పైన ఉదహరించిన వారందరూ ఢిల్లీ నుండి వార్తలు చదివితే, డి వెంకట్రామయ్యగారు హైదరాబాదు కేంద్రం నుండి తన కంచు కంఠంతో మనకు వార్తలను అందించి ప్రసిధ్ధులు ఐనారు. వారు తమ రేడియో జ్ఞాపకాల శీర్షికన మనకున్న ఏకైక మాస పత్రిక "రచన" లో అప్పటి విషయాలు అనేకం వ్రాసి తెలియచేస్తున్నారు

శ్రీ డి.వెంకట్రామయ్య:హైదరాబాద్ ప్రాంతీయ విభాగం లో ప్రముఖ న్యూస్ రీడర్.1963 నవంబర్ లో మొదట అనౌన్సర్.ఫ్రముఖ కథకులు. నాటకరచయిత.2010 రావిశాస్త్రి పురస్కార గ్రహీత. పంతులమ్మ సినిమా మాటల రచయిత.వార్తా పఠనానికి పేరుపొందారు


ఇలాగే తిరుమలశెట్టి శ్రీరాములు, సురమౌళి గార్ల ఫొటోలు కూడ ఎవరిదగ్గరన్నా ఉంటే పంపగలరు


(పైన వ్రాసిన శీర్షిక చూశారుగా. 'న్యూస్ రీడర్' ఆంగ్ల పదాలకు నాకు తట్టిన, విని భరించగలిగిన మాట "వార్తా చదువరులు"(ఇప్పటికే ఈ పదం అక్కడక్కడా వాడుకలో ఉన్నట్టుగా ఉదాహరణలు ఉన్నాయి). ఆంగ్ల పదాలు తెలుగీకరించినప్పుడు ఎబ్బెట్టుగానూ, నవ్వు పుట్టించేవిగాను, నాలాంటి వాడికి అర్ధం కాని పరిస్థితిలోనూ ఉండకూడదని నా అభిప్రాయం. గ్రాంధికం జోలికి పోకుండా సులువైన తేట తెలుగులో న్యూస్ రీడర్ అన్న మాటకు, "వార్తా చదువరులు" అన్న మాట కాకుండా, మరింకేదైనా ఒక మంచి తెలుగు పదాన్ని,ఇంతకంటే సొంపైన మాట సూచించమని పండితులకు విన్నపం.ఎందుకు అంటే వార్తా చదువరులు కూడ అంత బాగా అతకటంలేదని నా భావన )

3 కామెంట్‌లు:

  1. వార్తా చదువరులనే మాట కూడా అంతబాగా అతకనప్పటికీ మేలుగానే ఉంది. లేనిపోని డాంబికాలకు పోయి అర్థం కని కొత్త పదాలు పుట్టించడంకంటే ఇదే నయం!

    మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారి ఫొటో చూడగలిగాను. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. ఢిల్లీ నుంచి తొలినాళ్లలో కొంగరజగ్గయ్య గారు కూడా చదివారుటండీ.
    అలానే ప్రయాగ రామకృష్ణ గారు కూడా - చాలా కాలం పనిచేసారనుకుంటాను ..
    ఒక్క కంఠస్వరం తో కట్టీపడవేశే ప్రావీణ్యం ఇప్పుడు ఏ చదువరిలోనూ కాన రాదు. పైగా ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ తడబాటులే

    రిప్లయితొలగించండి
  3. @ఊకదంపుడు

    కొంగర జగ్గయ్యగారు కూడా వార్తా చదువరిగా పని చేశారు కాని, ఎన్నాళ్ళు ఎక్కడా పనిచేశారు వివరాలు లేవు. ఆ తరువాత ప్రయాగ రామకృష్ణ గారు విజయవాడ హైదరాబాదుల్లో పనిచెయ్యటం నాకు తెలుసు. కాని, ఢిల్లీలో కూడ పనిచేశారా?

    ఇప్పటి రేడియో కార్యక్రమాల నాణ్యత అంతంత మాత్రంగా ఉండబట్టే, పాత కార్యక్రమాలను తల్చుకుంటున్నాం. కొంతకాలానికి, అప్పటికి, ఈ నాటి కార్యక్రమాలు బాగుండవచ్చు!!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.