23, డిసెంబర్ 2010, గురువారం

మరో పసందైన పాట

ఆకాశవాణి లో వచ్చే పాటలన్నీ కూడ నీరసంగా ఉంటాయి అనుకోవటం పొరబాటే. చాలా హుషారైన పాటలు కూడ అప్పుడప్పుడూ ప్రజలకు వీనుల విందుగా వదులుతూ ఉండేవారు. అలా వచ్చిన పాటే "వయ్యారీ" అంటూ పల్లె పడుచును ఉద్దేసించి పాడబడినపాట.

పాటను పాడినవారు ప్రసిద్ధ ఆకాశవాణి గాయకుడు మల్లిక్ గారు అనుకుంటాను. గాయని ఎవరో తెలియటంలేదు. పాట వింటుంటే రోజంతా పొలం పనులు చేసి ఇంటికి వెళ్తున్నా కుర్ర రైతు జంట కళ్ళముందు కదులుతూ ఉంటుంది. ఇంక ఆలస్యం దేనికి విని ఆనందించండి.



పాటకు సంగీతం సమకూర్చిన వారెవరో తెలియదు. మల్లిక్ గారేనేమో! వినటానికి ఎంతో వినసొంపుగా, వింటున్నంతసేపూ హుషారుగా సాగే పాట ఇది.






****
***
*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.