ఈ రోజున నాకు ఒక ఆలోచన వచ్చింది అలనాటి పత్రికల్లో వచ్చిన కథలు, కవితలు, గేయాలు, గేయ కథలుఎవరెవరు వ్రాసి ఉంటారో చూసి, వారిలో ఆ తరువాత పేరు ప్రఖ్యాతులు సంపాయించిన వారి రచనలు వెతకాలిఅని. మనకు అందుబాటులో పాత సంచికలు ఉంచిన ఏకైక తెలుగు పత్రిక "చందమామ" . పాత సంచికలు వెతుకుతుంటే ఆశ్చర్యం, చలం కృష్ణ శాస్త్రి , శ్రీ శ్రీ రచనలు మొట్టమొదటి సంవత్సరాలలోనే కనిపించినాయి .
చందమామ మొట్ట మొదటి సంచిక 1947 జులై సంచిక చూస్తె "చలం-దీక్షితులు" అన్న జంట పేరుతొ ఈ కింది గేయం కనపడింది. అది కూడా చందమామ మొదటి సంచిక మొదటి పుటలో.
చలం గారి స్నేహితుడు దీక్షితులు గారు. చలం గారికి అరుణాచలం పరిచయం చేసినది దీక్షితులు గారే. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి ఈ గేయం అల్లారా.
అదే సంచికలో పక్క పుటలు చూస్తె కృష్ణ శాస్త్రిగారు రచించిన "ఉడుత పాటలు".
ఇలా పాత చందమామలను తిరగేస్తుంటే 1949 డిసెంబరు సంచికలో ఒక రచయిత పేరు చూసి ఆగిపోయ్యాను. ఆ రచయిత పేరు శ్రీ శ్రీ . అక్కడ ప్రచురించబడినది గేయ కథ. ఆ కథ పేరు "సీనూ భానూ". ఈ గేయ కథను ఈ కింది బొమ్మలను నొక్కి చదువుకోవచ్చు.
మనకు తెలిసిన చలం, కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ గార్లు అప్పట్లో చందమామకు రచనలు చేసి ఇచ్చారా! లేక మరింకెవరివన్నానా ఈ పేర్లు? తరువాత్తరువాత ఎంతో ప్రాచుర్యం పొందిన రచయితల పేరు పోలి ఉన్నాయా.
మిగిలిన ఇద్దరి సంగతి తెలియదు కాని, చలం గారు అప్పటికే చాలా పేరొందిన రచయిత. కొత్తగా మొదలు పెట్టిన బాలల పత్రికకు దీక్షితులు గారితో కలిసి సరదాగా ఒక బుల్లి పాట రాసి ఇచ్చి ఉంటారా. సరే కృష్ణ శాస్రి గారు శ్రీ శ్రీ సినిమాల్లో ఉన్నారు (వీళ్ళిద్దరూ అప్పటికే సినీ రంగంలో ఉన్నారా? ఇదొక సందేహం!) చక్రపాణి గారు, నాగిరెడ్డి గార్లు అడిగితె వారి రచనలను పిల్లలకు అర్ధమయ్యే భాషలో, శైలిలో చందమామ కోసం ఈ రచనలు చేసారా.
చందమామ కథలు-బాల సాహిత్యం మీద పరిశోధన చేస్తున్న శ్రీ దాసరి వెంకట రమణ గారే ఈ సమస్య నివృత్తి చెయ్యాలి. ఇంకా మరింకేవరికన్నా తెలిసి ఉంటే చెప్పగలరు.
మరి కొన్ని మహా మహుల రచనలు మరొక రోజున. సమయాభావం వల్ల ఒకే రోజున ఈ పని చెయ్యలేని పరిస్థితి.
=============================================
శ్రీ దాసరి వెంకట రమణ గారు చదమామ పత్రిక, అందులో వచ్చిన కథల మీద పరిశోధన చేస్తున్న వారు ఆయన ఈ చిన్ని వ్యాసం చదివి స్పందించి తెలియని విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన వివరణాత్మక వ్యాఖ్య ఈ కింద ఇవ్వబడింది.

ఆ రచనలు వారివే అందులో ఎలాంటి సందేహం లేదు.
చందమామకు పూర్వం నుండి ప్రచురించ బడుతున్న ‘బాల’ (ప్రారంభం ఆగస్ట్-1945) లో శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు, రమణ, నార్ల వెంకటేశ్వరరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, నండూరి రామమోహనరావు, బుచ్చిబాబు, తాపీ ధర్మారావు, మునిమాణిక్యం వంటి మహామహుల రచనలు ప్రచురించ బడినవి. శ్రీ రచన శాయి గారు తాను సంపుటీకరించిన, ‘బాల’ విహంగ వీక్షణ సంపుటిలోని ముందుమాట లో ఇలా అంటారు.
పెద్ద రచయితల బాల రచనలు:
తెలుగు సాహితీ లోకంలో నిష్ణాతులైన రచయిత లెందరో ‘బాల’లో పిల్లలకోసం రచనలు చేశారు. వారి స్థాయి ఎంతటి గొప్పదయినా ‘బాల’లో వారి రచనలు పిల్లల స్థాయిలో ఉండడం విశేషం.
యువ బుక్స్ బేనర్లో బి.ఎన్.కే. ప్రెస్ లో చలం గారి పుస్తకాలు ప్రచురించారు. ఆ పరిచయంతో ఆయనతో చందమామ తోలి సంచికలో గేయం రాయించి వుండవచ్చు.
ఉడుత పాటలు శీర్షికన కృష్ణశాస్త్రి గారు చందమామలో కొన్ని గేయాలు రాశారు.
‘బాల’ లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుమారుడు బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి) గారి రచనలు వస్తే, చందమామలో ఆయన తండ్రి గారితో గేయాలు రాయించి వుండవచ్చు.
చలం:దీక్షితుల జంట రాసినట్లే శ్రీశ్రీ:ఆరుద్ర జంటతో ఆగస్ట్1948 ‘బాల’లో ఒక గేయం వచ్చింది.
అది చూడండి.
జేజే
మేలుకలుగు గావుత
తెలుగు నాడుకి
గెలుపుకలుగు గావుత
తెలుగు వాడికి
గురుజాడ, కందుకూరి,
కొమర్రాజు, గిడుగు
తెలుగువారి వేలుగుదారి
తెలివెన్నెల గొడుగు
గోదావరి, కృష్ణవేణి,
పెన్ననదుల నిండి
పైరుపండ, కడుపునిండ
అందరికీ తిండి
ఈ గేయాన్ని శ్రీశ్రీ రాసి వుండవచ్చు. లేదా ఆరుద్ర రాసి వుండవచ్చు. ఇద్దరి పేర్లు ప్రకటించడానికి ప్రత్యెక కారణాలేమైనా వుండవచ్చు.
చందమామలో జనవరి 1948 సంచిక నుండి గేయ కథలు రాస్తున్న కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నర్సయ్య గారు తేది 10-11-1949 మరణించినారు. డిసెంబర్ 1949 సంచికలో శ్రీశ్రీ గారి సీనూ-భానూ గేయకథ వేశారు . ఆ తర్వాత అయిదారు సంచికల వరకు సముద్రుడు, ఆలపాటి సుబ్బారావు, కవిరావు వంటి వారు గేయ కథలు రాసి నప్పటికి జూన్ 1950 సంచిక నుండి చాలా కాలం పాటు ఆ గేయ కథలను బైరాగి రాశారు.(బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి – చక్రపాణి గారి అన్న ఆలూరి వెంకట్రాయుడి గారి కుమారుడు. మొదటినుండి చందమామ హిందీ సంచిక చూసుకునే వారు.)
శ్రీశ్రీ మాటలు,పాటలు రాసినా మొదటి సినిమా ఆహుతి (నీల్ ఔర్ నందా అనే హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్) 1950 లో వచ్చింది.
దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటలు, పాటలు రాసినా మొదటి సినిమా బి.ఎన్. రెడ్డి గారి మల్లీశ్వరి1951లో వచ్చింది.
చందమామ కు సంబంధించి ఒక అరుదైన\ ఆశ్చర్యకరమైన విషయం చెప్పి నా వ్యాఖ్య ను ముగిస్తాను. చందమామ మొదటి సంచికలో నేటి ప్రముఖ రచయిత శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు పొట్టి పిచిక కథ పేరున ఒక కథ రాశారు. నాకు తెలిసి నంత వరకు చందమామ మొదటి సంచిక తయారిలో పాలు పంచుకున్న వారిలో జీవించి వున్నది వారొక్కరే. (శ్రీ విశ్వనాథరెడ్డి గారికి అప్పుడు మూడేళ్ళు. ఆర్టిస్ట్ శంకర్ గారు అప్పటికి చందమామలో చేరలేదు.) అలా కాకుండా ఎవరైనా జీవించి వున్నట్లు గా ఎవరికైనా తెలిసి వుంటే బ్లాగు ముఖంగా తెలియ చేయ గలరు.

చందమామలో తొలి సంచికల్లో రచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్తల్లో చలం, దీక్షితులు, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి గార్లతో పాటు బైరాగి కూడా ఉన్నారు! ‘ఒలిచిన చోకలేట్లు ఒళ్ళో పెట్టుకొని, కరిగిన ఐస్ క్రీం చేత్తో పట్టుకొని’ రమ్మంటూ చలం- దీక్షితులు గార్లు చందమామను ఆహ్వానించిన తీరు ఎంత అందంగా ఉందో కదా!
రిప్లయితొలగించండిచాలా విలువైన సరదా సమాచారం ఇచ్చారు సాహిత్యాభిమాని గారూ!
రిప్లయితొలగించండిధన్యవాదాలు!
surprising
రిప్లయితొలగించండి@astrojoyd
రిప్లయితొలగించండిYes surprising, but true.
Venu and Rao,
Thank you.
'శివ' గారికి నమస్కారం!
రిప్లయితొలగించండిసుదీర్ఘమైన నా స్పందన వ్యాఖ్య ను తాయారు చేసి ప్రీవ్యూ నొక్కాను. ఆ వెంటనే 'మమ్మల్ని క్షమించండి మేము మీ అభ్యర్థనను పూర్తి చేయలేక పోయాము' అనే సమాదానం వచ్చింది. ఏమైందో తెలియదు....నా వ్యాఖ్య మాయమైంది. బహుశా వ్యాఖ్య పరిమాణం ఎంత వుండాలో నాకు తెలియక పోవడం వలన ఈ అనర్థం జరిగి వుండవచ్చు.దానిని మళ్ళీ తాయారు చేసి మీకు మెయిలు చేస్తాను.
శివ గారికి నమస్కారం!
రిప్లయితొలగించండిఆ రచనలు వారివే అందులో ఎలాంటి సందేహం లేదు.
చందమామకు పూర్వం నుండి ప్రచురించ బడుతున్న ‘బాల’ (ప్రారంభం ఆగస్ట్-1945) లో శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు, రమణ, నార్ల వెంకటేశ్వరరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, నండూరి రామమోహనరావు, బుచ్చిబాబు, తాపీ ధర్మారావు, మునిమాణిక్యం వంటి మహామహుల రచనలు ప్రచురించ బడినవి. శ్రీ రచన శాయి గారు తాను సంపుటీకరించిన, ‘బాల’ విహంగ వీక్షణ సంపుటిలోని ముందుమాట లో ఇలా అంటారు.
పెద్ద రచయితల బాల రచనలు:
తెలుగు సాహితీ లోకంలో నిష్ణాతులైన రచయిత లెందరో ‘బాల’లో పిల్లలకోసం రచనలు చేశారు. వారి స్థాయి ఎంతటి గొప్పదయినా ‘బాల’లో వారి రచనలు పిల్లల స్థాయిలో ఉండడం విశేషం.
యువ బుక్స్ బేనర్లో బి.ఎన్.కే. ప్రెస్ లో చలం గారి పుస్తకాలు ప్రచురించారు. ఆ పరిచయంతో ఆయనతో చందమామ తోలి సంచికలో గేయం రాయించి వుండవచ్చు.
ఉడుత పాటలు శీర్షికన కృష్ణశాస్త్రి గారు చందమామలో కొన్ని గేయాలు రాశారు.
‘బాల’ లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుమారుడు బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి) గారి రచనలు వస్తే, చందమామలో ఆయన తండ్రి గారితో గేయాలు రాయించి వుండవచ్చు.
చలం:దీక్షితుల జంట రాసినట్లే శ్రీశ్రీ:ఆరుద్ర జంటతో ఆగస్ట్1948 ‘బాల’లో ఒక గేయం వచ్చింది.
అది చూడండి.
జేజే
మేలుకలుగు గావుత
తెలుగు నాడుకి
గెలుపుకలుగు గావుత
తెలుగు వాడికి
గురుజాడ, కందుకూరి,
కొమర్రాజు, గిడుగు
తెలుగువారి వేలుగుదారి
తెలివెన్నెల గొడుగు
గోదావరి, కృష్ణవేణి,
పెన్ననదుల నిండి
పైరుపండ, కడుపునిండ
అందరికీ తిండి
ఈ గేయాన్ని శ్రీశ్రీ రాసి వుండవచ్చు. లేదా ఆరుద్ర రాసి వుండవచ్చు. ఇద్దరి పేర్లు ప్రకటించడానికి ప్రత్యెక కారణాలేమైనా వుండవచ్చు.
చందమామలో జనవరి 1948 సంచిక నుండి గేయ కథలు రాస్తున్న కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నర్సయ్య గారు తేది 10-11-1949 మరణించినారు. డిసెంబర్ 1949 సంచికలో శ్రీశ్రీ గారి సీనూ-భానూ గేయకథ వేశారు . ఆ తర్వాత అయిదారు సంచికల వరకు సముద్రుడు, ఆలపాటి సుబ్బారావు, కవిరావు వంటి వారు గేయ కథలు రాసి నప్పటికి జూన్ 1950 సంచిక నుండి చాలా కాలం పాటు ఆ గేయ కథలను బైరాగి రాశారు.(బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి – చక్రపాణి గారి అన్న ఆలూరి వెంకట్రాయుడి గారి కుమారుడు. మొదటినుండి చందమామ హిందీ సంచిక చూసుకునే వారు.)
శ్రీశ్రీ మాటలు,పాటలు రాసినా మొదటి సినిమా ఆహుతి (నీల్ ఔర్ నందా అనే హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్) 1950 లో వచ్చింది.
దేవులపల్లి కృష్ణశాస్త్రి మాటలు, పాటలు రాసినా మొదటి సినిమా బి.ఎన్. రెడ్డి గారి మల్లీశ్వరి1951లో వచ్చింది.
చందమామ కు సంబంధించి ఒక అరుదైన\ ఆశ్చర్యకరమైన విషయం చెప్పి నా వ్యాఖ్య ను ముగిస్తాను. చందమామ మొదటి సంచికలో నేటి ప్రముఖ రచయిత శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు పొట్టి పిచిక కథ పేరున ఒక కథ రాశారు. నాకు తెలిసి నంత వరకు చందమామ మొదటి సంచిక తయారిలో పాలు పంచుకున్న వారిలో జీవించి వున్నది వారొక్కరే. (శ్రీ విశ్వనాథరెడ్డి గారికి అప్పుడు మూడేళ్ళు. ఆర్టిస్ట్ శంకర్ గారు అప్పటికి చందమామలో చేరలేదు.) అలా కాకుండా ఎవరైనా జీవించి వున్నట్లు గా ఎవరికైనా తెలిసి వుంటే బ్లాగు ముఖంగా తెలియ చేయ గలరు.
అవసరాల రామకృష్ణారావు గారి మరో రచన (చిన్న గేయం ) మరుసటి నెల ఆగస్టు చందమామలో కూడా వచ్చింది. ‘గొలుసు మాట’ దాని టైటిల్.
రిప్లయితొలగించండినిన్న లగాయతు దాదాపుగా అన్నీ వ్యాసాలిక్కడవి చదివానండి. మీ అందరి శ్రద్ద, కృషికి కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిదాసరి వెంకటరమణ గారికి లేదూ వారి సమీప మిత్రులకైనా తెలియోచ్చేమోనని ఒక మాట అడగాలని. [పుస్తకం డాట్ నెట్ వారిని అడిగినా మీ ద్వారాగా కూడా ప్రయత్నించాలనీ]
బాలసాహిత్యం గురించి వెదుకుతూ దాదాపు ఏడాదిన్నర క్రితం చదివానీ వ్యాసం "స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు" - హెచ్. బ్రహ్మానంద http://www.apallround.com/loadart.php?id=2008010067 ఈ వ్యాసం లో చివరి మాటగా తెలిపిన "బాలసాహిత్యం, ఒక్క డా. వెలగా వెంకటప్పయ్యగారు, ఒక్క డా.ఎం.కె. దేవకిగారు తప్ప ఈ రంగంలో విశేషమైన కృషి చేసినవారే కనిపించటం లేదు." ను బట్టి వారిరువురి పైనా మరి కొంత సమాచారం ఇక్కడి సాహిత్య ప్రియులెవరైనా చెప్పగలరేమన్నీను.