మన తెలుగు వారు గర్వించతగ్గ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు. ఆయన వేసే బొమ్మ ఎంత బాగుంటుందో, వ్రాసే కాప్షన్ కూడ అంత చక్కటి భాషలో, బొమ్మకు నప్పెట్టుగా ఉండి, మచి హాస్యంతో మేళవించి ఉంటుంది. ఆయన ఈ మిల్లినం లో మొదలవబోతున్న రెండవ దశకం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు పంపారు.
రాబొయ్యే సంవత్సరంలో ఆడబోయ్యే క్రికెట్ వరల్డ్ కప్ లో మన భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ, కొత్త సంవత్సరంలో అందరూ పచ్చగా ఉండాలని దీవిస్తూ ఆయన ఇచ్చిన చక్కటి కార్టూన్ శుభాకాంక్షలు. 2011 అంకెలను ఒక మనిషి నవ్వుతున్నట్టుగా మలచిన తీరు అద్భుతం .అమెరికాలోని మౌంట్ రష్మోర్ మీద చెక్కబడ్డ విగ్రహాల్లో జయదేవ్ గారిని ఉంచి సరదాగా చేసిన ఫొటో
జయదేవ్ గారు తయారు చేసిన కొన్ని కార్టూన్ పాత్రలను కూడ చూసి ఆనందించండి
ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి
జయదేవ్ గ్రీటింగ్ కార్టూన్ నేనూ అందుకున్నాను గానీ
రిప్లయితొలగించండిమీలా ఇలా ప్రజంట్ చేయలేకపోయాను. శివప్రసాద్ గారూ,
ప్రియ మితృలు జయదేవ్ గారి తరఫున, నా తరఫున
హృదయపూర్వక అభినందనలు అందుకోండి.
శివ గారూ !
రిప్లయితొలగించండిఅందమైన శుభాకాంక్షలు అందించిన జయదేవ్ గారికి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
ధరణీరాయ్ చౌదరి, సురేఖ అప్పారావు గారు, శిరాకదంబం రావుగారు,
రిప్లయితొలగించండిఆదరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
....................................
ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు తొలగించటం జరిగింది.
....................................