2, జనవరి 2011, ఆదివారం

వివిధభారతి శ్రోతల సమూహం

SHRI PANDIT NARENDRA SARMA
(PHOTO COURTESY VIVIDH BHAARATI LISTNERS' CLUB)

ఆల్ ఇండియా రేడియో పూర్వపు పేరు? Indian State Broadcasting Service (ISBS) ఏప్రిల్ 1 1930లో ప్రారంభం. జూన్ 8, 1936న All India Radio (AIR) గా పేరు మార్చబడింది. 1956లో "ఆకాశవాణి" గా పేరు మార్చబడింది. ఆకాశవాణి అన్న పేరు సూచించిన వారు ప్రముఖ హిందీ కవి శ్రీ పండిట్ నరేద్ర శర్మ. ఆంగ్లంలో మాత్రం ఇప్పటికీ All India Radio గానే వ్యవహరిస్తున్నారు.


వివిధభారతి మనకు ఎంతగానో పరిచయం ఉన్న ఆకాశవాణి వారి వాణిజ్య ప్రసార విభాగం. ఈ స్టేషన్ దేశ వ్యాప్తంగా ఉన్నది. మనందరికీ ఎంతో ఇష్టమైన చాయా గీత్, మంచాహే గీత్, జైమాలా, మనోరంజన్, హవామహల్ కార్యక్రమాలు వారి ప్రత్యేకం. ఇలాంటి కార్యక్రమాలు విని ఆనందించేవారు కొందరు కలిసి ఒక యాహూ గ్రూప్ ను తయారు చేసుకున్నారు. అందులో చేరి వివిధభారతి కార్యక్రమాల గురించి అనేకానేక చర్చలు చేస్తున్నారు, ఫోటోలు, రికార్డింగులు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ఈ గ్రూపును కింది లింకు నొక్కి దర్శించవచ్చు. ఆసక్తి ఉంటే అందులో చేరి ఆయా చర్చలలో పాలు పంచుకోవచ్చు.









****************

1 కామెంట్‌:

  1. శివ గారూ !
    ఆకాశవాణి గురించి చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని వివరాలు మీ నుంచి ఆశిస్తూ.....

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.