విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన నవలల్లో "చెలియలకట్ట " ఒకటి. తన తండ్రి వ్రాసిన నవలను రేడియో కోసం ఒక గంట నాటకంగా తయారు చేశారు శ్రీ విశ్వనాథ పావని శాస్త్రి గారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారు ప్రసారం చేశారు.
ఈ నాటకం మొత్తం ఒక సాంప్రదాయక కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది . పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, వారి సంభాషణలు వింటుంటే ఈ నాటకం వ్రాసినది విశ్వనాథవారేనా అనిపిస్తుంది. నాటకం చివరలో ఒక పాత్ర చేత ఈ కిందివిధంగా చెప్పించి విశ్వనాథ వారు తన ముద్ర వెశారు:
"........శరీరాన్ని చూడకు తల్లీ.....ఆత్మను చూడు.....ప్రేమను.....చూడకమ్మా....ధర్మాన్ని చూడు.....సుఖాన్నిచూడకు....సంప్రదాయాన్ని చూడు....."
ఈ నాటక ప్రసారం శ్రీమతి ఎల్లంరాజు సరోజా నిర్మల గారి నిర్వహణలో జరిగింది. వారి సహాయకులుగా శ్రీ మడిపల్లి దక్షిణామూర్తిగారు వ్యవహరించారు.

పాత్రలు | పాత్రధారులు |
రత్నావళి | ఎ. వసంత లక్ష్మి |
సీతారామయ్య | వి భాను ప్రసాద్ |
రంగడు | అంబడిపూడి మురళీకృష్ణ |
సీతారామయ్య తల్లి | వి.రతన్ ప్రసాద్ |
రాజ్యలక్ష్మి | ఎల్ విజయ గౌరి |
రాజ్యలక్ష్మి తండ్రి | సి హెచ్ సత్యనారాయణ |
హరి | పి బి ప్రసాద్ |
నీలాంబరం | టి ఎం హరిబాబు |
ముకుందరావ్ | వి వేణుగోపాల రావ్ |
తత్వాలు | దాసరి ఆనంద్ |
ఈ నాటకాన్ని అందించిన రంజని గారికి కృతజ్ఞతలు
నాటకంలోని నటన కాని, శబ్ద సృష్టితో అక్కడి వాతావరణం, పరిసరాలను శ్రోతలు అనుభూతి చెందేట్టుగా చెయ్యటంలో ప్రాధాన్య చూపినట్టులేదు. నటన చాలా కృతకంగా ఉండి ఆసక్తిగా వినేట్టుగా చెయ్యలేక పోయిందని నా అభిప్రాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.