2, జనవరి 2011, ఆదివారం

బ్రాండ్ మానియా - యాడ్ మాఫియా

ఎక్కడ చూసినా ప్రకటనలే ఇది కొను, అది కొను, మా బ్రాండ్ అంటే మా బ్రాండ్ అంటూ మనల్ని తికమక పెట్టి, మనకు పనికి వచ్చేదో , ఎక్కువసార్లు ఎందుకూ కొరగాని వస్తువులో, సర్వీసెస్ పేరిటో మన చేత అనవసరపు ఖర్చు చేయిస్తున్నాయి వ్యాపార ప్రకటనలు. వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే! అంతగా పాకిపోయ్యి కాలుష్య దశకు చేరుకున్నది వ్యాపార ప్రకటన పిచ్చి.

అవసరం ఉన్నా లేక పోయినా ప్రతి ఉత్పత్తిదారు, చివరకి మధ్య దళారులు కూడా ఎక్కడ పడితే అక్కడే ప్రకటనలను గుప్పించటం, ఒకటో రెండో గీతాలు గీసేసి వాటిని బ్రాండ్ అన్న పేరుతొ మనకు కలల్లో కూడా అవ్వే వచ్చేట్టుగా చెయ్యటం . ఏమన్నా అంటే "Top of Mind Awareness" ట, అంటే ఎల్లాప్పుడూ వాళ్ళ బ్రాండే మనకు గుర్తుకు రావాలని ప్రతివాడి తాపత్రయం.
చివరకు జరిగేది ఏమిటి. తామర తంపరలా పెరిగిపోయిన
వ్యాపార ప్రకటనలు, రోడ్ల మీద, రేడియోలో, టి విల్లో సరే సరి, డివైడర్ల మీద, పత్రికల్లో , మాగాజైన్లల్లో, రైలు పెట్టెల మీద, ఇలా ఎందెందు వెదికిన అందే కలదు ప్రకటనా గరళం. మనల్ని తోచుకోనివ్వకుండా వెంటాడి వెంటాడి ఏమైనా సరే వాళ్ళు చెప్పిన వస్తువుల్ని కోనేట్టుగా ప్రేరేరింప చెయ్యటమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశ్యం.

మనచేత
కాలుష్యాన్ని (శబ్ద, చిత్ర అంతకంటే ప్రమాదకరమైన మానసిక కాలుష్యం) మనకు తెలియకుండానే మన మస్తిష్కాల్లోకి మెల్లి మెల్లి గా (like slow poison) ఎక్కిస్తున్నది వ్యాపార ప్రకటనల మాఫియా.
మధ్య ఒక ప్రకటన టి విల్లో తెగ గుప్పిస్తున్నారు. అందులో ఒక బేవార్సు గాడు కార్లో దిగి పనికి రాని చెత్త డైలాగు వల్లిస్తూ, అక్కడే బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయిని తన సెల్ ఫోన్ లో ఫోటో తియ్యబోతాడు. ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు యాడ్ హీరో వచ్చి దీంట్లో తీసుకో అని తన దగ్గర ఉన్న సెల్ ఇవ్వబోతాడు. ఇది ఆ సెల్ ఫోన్ కొనమని చెప్పే వ్యాపార ప్రకటన తీరు. ఇటువంటి యాడ్ల వల్ల చిన్న పిల్లలకు విధమైన సందేశం వెళ్తున్నది అన్న జ్ఞానం అటు యాడ్ చేసినవాడికీ లేదు, ఇటు చూపించే టి వి వాళ్ళకూ లేదు . ఇది ప్రస్తుతం యాడ్ మాఫియా తీరు.





వెబ్ సైట్లల్లో "స్టంబ్లింగ్" చేస్తుంటే, విమియో వారి సైట్లో ఒక లఘు చిత్రం కనపడింది.16 నిమిషాల నిడివి ఉన్నఈ చిన్న కార్టూన్ చిత్రంలో కథలాంటిది ఉన్నది కాని, ఆ సినిమా తీసినవాళ్ళ ఉద్దేశ్యం, ఈ రోజున బ్రాండ్ పిచ్చిఎంత వేలంవెర్రి దశకు చేరిందో చూపటం లాగ ఉన్నది. ఈ వ్యాసం మొదట్లో ఉన్న బొమ్మ ఈ సినిమాలోదే. సినిమా జరుగుతున్నంతసేపూ రకరకాల బ్రాండ్స్ వాటిబొమ్మల మయం ఎక్కడా చూసినా. చివరకి ఈ ప్రకటనా కాలుష్యం వల్ల మానవ జాతి మానసిక ఆరోగ్యానికేప్రమాదం వాటిల్లేట్టుగా ఉన్నది.

పై సినిమా కాన్స్ సినిమా ఉత్సవంలో కూడ ప్రదర్శించారుట. ఈ సినిమా చూడాలంటే ఓపికగా బఫరింగ్ అయ్యేదాగా వేచి ఉండాలి.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది.







***
**
*

2 కామెంట్‌లు:

  1. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది------------not possible to any govt bcz they r the main source of party funds.

    రిప్లయితొలగించండి
  2. @astrojoyd

    అలా నిస్పృహ చెందితే ఎలాగండీ. మనకు కలిగిన బాధ గురించి చెప్పుకోవాలి. మనలాగా ఆలోచించే వారిని కూడగట్టుకోవాలి, ఇటువంటి సామాజిక జాడ్యానికి మందు పడేట్టుగా చూడాలి. ఏదైనా సమస్యగా ముందు మనం గుర్తిస్తే కదా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే ఆవకాశం ఉన్నది! అది సమస్యే కాదు అని (people with vested interests) ఎద్దేవా చెయ్యచ్చు కొంతమంది అవివేకులు, చేయ్యనీగాక. కాని మనకు నచ్చని వాటి గురించి మన నిరసన వ్యక్తం చెయ్యటానికి బ్లాగ్ బాగా పనికోస్తున్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.