25, జనవరి 2011, మంగళవారం

ఒక అరుదైన సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం

కీర్తిశేషులు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం
(ఫోటో కర్టెసీ శ్రీ వేణు)
మనిషి మన మధ్య ఉన్నాన్నాళ్ళూ ఆయన విలువ తెలియదు. ఇది లోక సహజం. పై బొమ్మలో కనిపిస్తున్న వ్యక్తి "సామాన్యుడు కాదు" ఒక ప్రముఖ రచయిత. ఇవి నా మాటలు కాదు చందమామ కథల మీద రిసెర్చ్ చేసిన బాల సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి దాసరి వెంకటరమణ గారి (దాసరి గారికి బంధువు కాదు) మాటలు. ఆయన వ్రాసిన ఒక చక్కటి వ్యాసం రచన మాస పత్రికలో ప్రచురించారు . కింద వ్యాసం లో కొంతభాగం ఇవ్వబడింది, మిగిలిన భాగం ఆసక్తి ఉన్నవారు 'రచన' మాస పత్రికలో చదువుకోవచ్చు.
మరణానంతరందాసరి సుబ్రహ్మణ్యం గారి రచనలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నో పేర్లు ఎన్నెన్నో మారుపేర్లతో రచనలు చేసారు దాసరి సుబ్రహ్మణ్యం గారు. చందమామ పత్రిక లో దాదాపు ఐదున్నర దశాబ్దాలు పనిచేసారు. కాలంలోనే సాంఘిక కథలు, డిటెక్టివ్ కథలు, జానపద కథలు ఎన్నెన్నో వ్రాసారు. బొమ్మరిల్లు పత్రికలో మృత్యు లోయ ధారావాహిక ఆయనే వ్రాశారన్న విషయం మధ్యనే వెలుగులోకి వచ్చింది. వారి రచనలలో దొరికినంత వరకు ఒక సంపుటిగా తీసుకుని వచ్చే ప్రయత్నం రచన శాయి గారు చేబట్టారు. ఎంతో కృషి చేసి, ఎంతమందినో సంప్రదించి దాసరి గారి రచనలు, బొమ్మరిల్లులో వచ్చిన మృత్యులోయ సహా సంపాయించి సంపుటిని, దాసరి వారి మొదటి వర్ధంతి (జనవరి 27) సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ఇదే వారి ఆహ్వానం, సాహిత్య అభిమానులందరూ తప్పక హాజరవ్వాల్సిన ఒక అరుదైన కార్యక్రమం. హైదరాబాదు లో జరిగే కార్యక్రమానికి అక్కడ ఉన్న బ్లాగర్లు, ఇతర సాహిత్య అభిమానులు తప్పక హాజరౌతారని ఆశిస్తున్నాను.

తమ చిన్న తనంలో తమకు ఎంతగానో ఆనందాన్నిచ్చిన అనేక జానపద ధారావాహికల రచయిత ఎవరో చందమామ వారు బయటపెట్టకపోయినా, అజ్ఞాత రచయిత మీద అభిమానం పెంచుకుని గుండెల్లో దాచుకుని ఇప్పుడు నలభైల్లో, ఏభయ్యో పడిలో ఇంకా ఆపైన వయసు ఉన్నవారు అందరూ సమకూడి రచయిత వ్రాసిన రచనలన్నీ ఒక సంపుటిగా తీసుకు వస్తున్న ఒక అరుదైన సాహిత్య సంఘటన. ఇటువంటి అరుదైన గౌరవం మరే ఇతర రచయితకు లభించలేదు.

కథా సంపుటి తమ వ్యక్తిగత గ్రంధాలయంలో ఉంచుకుని మళ్ళి మళ్ళి చదువువుకుందామని అభిలషించే
వారికోసం వివరాలు కింద ఇవ్వబడినాయి.

సంపుటి లో మూడు భాగాలు

  1. దాసరి సుబ్రహ్మణ్య కథలు (39 కథలు)
  2. అగ్నిమాల నవల (యువ పత్రిక ధారావాహిక)
  3. మృత్యులోయ (బొమ్మరిల్లు ధారావాహిక)
మూడూ కలిపిన సంపుటి వెల రూ. 360
రూ.360 ఎం.ఒ./ డి.డి. ద్వారా ఇక్కడ ఇస్తున్న అడ్రసుకు పంపితే ఈ మూడు పుస్తకాలనూ రిజిస్టర్డ్ పోస్టులో అందుకోవచ్చు.
డి డి తీసుకోవాల్సిన పేరు వాహినీ బుక్ ట్రస్ట్
DD should be payable at Hyderabad.
పంపవలసిన చిరునామా

వాహినీ బుక్ ట్రస్ట్, 1-9-286/2/పి
విద్యానగర్, హైదరాబాద్- 500 044
ఫోన్ నంబర్ : 040-27071500.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.