1972-73 లో వచ్చిన ప్రత్యెక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కారణం నా బుద్ది తెలిసినాక చూసిన మొట్టమొదటి ఉద్యమం.
అప్పుడు నాకు బాగా గుర్తు. ప్రత్యెక అంధ్ర రాష్ట్రం కోసం ప్రజలందరూ ఉద్యమం చేస్తుండగా, మొట్టమొదటగా స్పందించినది సినీ నటుడు కృష్ణ. తన స్పందనను, ఉద్యమానికి తన మద్దతును తెలియచేస్తూ ఆంధ్ర పత్రికలో ప్రముఖంగా ప్రకటన చేయించారు. ఇది చూసి ప్రజలందరూ చాలా సంతోషించారు.
ఆ తరువాత అప్పటి అగ్ర తారలైన ఏ ఎన్ ఆర్-ఎన్ టీ ఆర్ రహస్య సమాలోచన జరపి వాళ్ళు కూడ ఉద్యమానికి తమ వత్తాసు పలికారు. ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు సినీ నటులందరూ ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి తమ మద్దతు తెలియచేస్తూ ప్రకటనలను గుప్పించారు.
కాని రాజకీయ నాయకుల స్వార్ధపూరిత చర్యల వలన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, సి ఆర్ పి దళాలను, సైన్యాన్ని దింపి ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచి వేసింది. పోలీసు/సి ఆర్ పి కాల్పుల్లో దాదాపు 400 ప్రజలు మరణించారు. కాని ఏమి లాభం లేకపోయింది. ఉద్యమం అణగారిపోయింది.
ఇప్పుడు అంతటి ఉద్యమం జరిగిన చోటునే సమైక్య నినాదం వినపడటం విచిత్రం-విషాదం
చాలా అమూల్యమైన సమాచారం అందించారు.
రిప్లయితొలగించండిప్రజల సామూహిక జ్ఞాపక శక్తి చాలా బలహీనమైనది అంటారు.
ఇలాంటి వార్తా క్లిప్పింగులు ఇప్పుడు చాలా అవసరం
మీకు లభ్యమైతే మరిన్ని పొందు పరచ గలరు.
ధన్యవాదాలతో
-Yadagiri Hyd
యాదగిరిగారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఒక మాట, యాదగిరి గారూ ఈ మాత్రం వ్యాఖ్య వ్రాయటానికి "అజ్ఞాత" గా వ్రాయాలా? సొంత పేరు, ప్రొఫైల్ పెట్టుకుని హాయిగా వ్రాయచ్చు కదా. సామాన్యంగా అజ్ఞాత వ్యాఖ్యలు నేను ప్రచురించను. మళ్ళి నలుగురికీ తెలియటానికి ఇది వ్రాస్తున్నాను.
బ్లాగుల్లో వస్తున్న అజ్ఞాత సంస్కృతిని అరికడదాం, సహకరించండి.
పైనున్న వ్యాఖ్య 'వల్లి' అన్నపేరుతో వ్రాసారు. ప్రొఫైల్ లేదు, వ్రాసిన వ్యాఖ్యకు పొంతన లేదు. ఆ కారణాన తొలగించబడినది.
రిప్లయితొలగించండి"అజ్ఞాత" పేరుతొ వ్రాసిన వ్యాఖ్య తొలగించబడినది. కారణం అప్రస్తుత ప్రసంగం.
రిప్లయితొలగించండినేను ఈ పోస్టులో వ్రాసిన విషయం పాత చరిత్ర చెప్పటానికి మాత్రమె కాక ఒక్క 40 సంవత్సరాల్లో మనుష్యుల దృక్పథాల్లో ఎంతటి మార్పు వస్తుందో ఎత్తి చూపటానికి.
రిప్లయితొలగించండిఇంగ్లీషు వాళ్ళు 1947 మనకు స్వతంత్రం ఇవ్వకుండా 1970 లలో కూడా వాళ్ళే ఉండి ఉంటే, ఇంకా ఉండి మీరే పరిపాలించండి అనేవాళ్ళేమో అనిపిస్తున్నది ప్రస్తుతం ఒకే ప్రాతంలో అప్పటి ఇప్పటి ప్రజల స్పందన చూస్తుంటే.
1973 లోనే ప్రత్యెక ఆంధ్ర వచ్చి ఉంటే ఆంధ్ర ప్రాంతం ఎంత బాగుపడేది! విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్టణం , గుంటూరు, కర్నూలు మొదలైన పట్టణాలు ఈ పాటికి మహా నగరాలు అయ్యేవి. ఇప్పటికైనా ఈ బలవంతపు సమైక్య వాదాన్ని వదిలి ఎవరి గోల వాళ్ళు పడటం ఆంధ్ర ప్రాతానికి ఎంతైనా మంచిది.
భారత్ ఒక దేశంగా ఉండగా మా ప్రాంతానికి మీరు రావద్దు అనలేరు ఎవ్వరూ. అలా అంటే గింటే అటువంటి దేశద్రోహులను నిర్దాక్షిణ్యంగా ఏరి పారెయ్యాలి.
==================================
పైన ఒక ప్రొఫైల్ లేని వ్యాఖ్య తొలగించబడినది
==================================
ఒక నూరు సంవత్సరాలకి పూర్వం ఆంధ్రుల రాజకీయ సాంస్కృతిక సామాజిక చైతన్యాలకి కేంద్ర బిందువు రాజమహేంద్రవరం. వాణిజ్యానికి కూడా కేంద్రపట్టణం రాజమండ్రీయేను. ఒక 50-60 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే - నా చిన్నతనం, అంతకి ఓ 20 సంవత్సరాల వెనకా - ఇదే సాంస్కృతిక రాజకీయ సామాజిక కార్యగారమంతా గుంటూరు బెజవాడ పట్టణాల్లో నడిచేది. అప్పట్లో ఎందరో తెలుగు వెలుగులు గుంటూరు కృష్ణా ఒంగోలు జిల్లాల నేపధ్యాల్లో తమ వాదాలని వినిపించారు. ఇలాగని ఏ ఇతర ప్రాంతాన్నీ కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఇటీవలి మన చరిత్ర చూసుకుంటే జరిగినదది.
రిప్లయితొలగించండిసుమారుగా 1985 మొదలుకుని, ముఖ్యంగా 95-2010 వరకూ నడిచిన కాలంలో, రాష్ట్రంలో సమస్తమైన కార్యావేశానికి హైదరాబాదు మినహా మరో వూరు నోచుకోనట్టైపోయింది. నేను పుట్టిపెరిగిన కోస్తా పట్టణాలన్నీ రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ అస్త్రసన్యాసం చేశాయా, లేక మాప్ లోంచే నిష్క్రమించాయా అన్నంత నిస్పృహ కలుగుతుందొక్కోసారి. హైదరాబాదు ఆర్ధికంగా కాన్సర్ లా ఎదిగాకా, కోస్తా జిల్లాల్లోని మధ్యతరగతి వారందరూ విద్యా ఉద్యోగాలకోసం పెద్దపెట్టున హైదరాబాద్ చేరుకుని దాన్ని తమ శాశ్వత నివాసం చేసుకున్నారు. ఫలితంగా విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల్లో అంతో ఇంతో ప్రతిభావంతులైనవాళ్ళందరూ కోస్తా పట్టణాల్లోంచి నిష్క్రమించారు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న తరహా పరిశ్రమలకి మాత్రమే ఆలవాలాలుగా మిగిలిపోయాయి కోస్తా జిల్లాలన్నీ.
కోస్తా ఆంధ్రలో ఉన్న ఔన్నత్యం ప్రభుత్వం చలవ వల్ల అనే తెలబాన్ నినాదం అసత్యం. నిజానికి హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధీ అంతంత మాత్రమని చెప్పాలి. కోస్తా జిల్లాల్లో కనబడే ఆర్ధికౌన్నత్యం నిజంగా చారిత్రకంగా అంతకు 3-4 వంధల సంవత్సరాలుగా జరుగుతున్న క్రమాభివృద్ధీ, అందులో చాలా వరకూ ప్రైవేట్ యాజమాన్యాల చేవ వల్ల వచ్చిందీను. ఇది గ్రహించని తెలబాన్ వాదులు ఉరిమి మంగలం మీద పడుతున్నారు.
మీరు ప్రస్తావించిన విషయానికొస్తే, అప్పుడైనా ఇప్పుడైనా ఆంధ్ర తెలంగాణాలు ప్రత్యేకాలుగా విడిపోవడం తెలుగు సాంస్కృతిక ప్రేమికులందరికీ ఓ మనోఘాతం. అంతే కాకుండా, జతీయ అంతర్జాతీయ రంగాల్లో తెలుగు వాళ్ళ ప్రతినిధ్యం అంతంత మాత్రం. భాషా పరంగా మనం అందరికన్నా మెజారిటీ అయినప్పటికీ, మన స్థానం ఇప్పుడూ హిందీ, అరవ, బెంగాలీ వారి కన్నా దిగువనేను. ఈ పరిస్థితిలో నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు అవసరమా? జెర్మనీని తూర్పు పడమటి దేశాల విభజనలాగున ప్రజాబాహుళ్యానికి అంతగా రుచించని కృత్రిమ భేదం. కానీ మీ వాదంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. 40 సంవత్సరాల నాడే ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడీ వుంటే అది దేశంలో అన్నింటికనా ముందున్న రాష్ట్రాల్లో ఒకటై వుండేదని నా అంచనా. నిజంగా మన బెజవాడ, మన గుంటూరు, మన వొంగోలు, మన కాకినాడ ఇత్యాది పట్టణాల్లో తెలుగు సంస్కృతిని ఇంతకన్నా వైభవంగా తీర్చుకోగలిగే వాళ్ళము. హైదరాబాద్ కన్నా దీటైన మరో రాష్ట్ర రాజధాని దేశంలో వుండి వుండేది.
- తాడేపల్లి హరికృష్ణ
భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా సరే దేశంలో మరే ప్రాంతానికైనా వెళ్ళి నివసించవచ్చు. అక్కడ విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు నడుపుకోవచ్చు. తమదైఅన సంస్కృతిని పాటించవచ్చు, అందుకు తగిన ప్రచారం జరుపుకోవచ్చు. ఈ ప్రకారంగానే ఎన్నో భాషా రాష్ట్రాల వారు గత వంద సంవత్సరాలుగా బొంబాయి, కలకత్తా,ఢిల్లీ, బెంగుళూరు, మద్రాసు నగరాలకి వలస వెళారు - వాటిని తమ శాశ్వత స్థానాలు చేసుకున్నారు. ఇదే రకమైన జాతీయ ప్రతిపత్తి అన్ని ప్రజాస్వామ్యాల్లోని పౌరులకీ తమ తమ దేశాల్లో వున్నాయి - 51 రాష్ట్రాలున్న అమెరికా నుండీ, ఆరే రాష్ట్రాలున్న ఆస్ట్రేలియా దాకా. మన దేశంలో కాశ్మీరు మినహాయిస్తే, మరో ప్రాంతం వారు వచ్చి వుండకూడదనే నిర్బంధ చట్టాలెక్కడా లేవు. ఇంత సామాన్యమైన విషయాన్ని ఉల్లంఘించి తెలబాన్ వారు కోస్తా ఆంధ్రులని వెళ్ళిపొమ్మని ఏ రాజ్యాంగ ప్రాతిపదికతో అడుగుతున్నారు? ఇలా అడగటం న్యాయవిరుద్దం, దాన్నే రెచ్చగొట్టే హావభావాలతో పునరుచ్చరిచడం దేశద్రోహం కింద జమకట్టాలి. ఈ కువాదాన్ని ఇదేమని నిలదీసిన పెద్ద పత్రికనీ, విలేఖరినీ, రాజకీయ నేతనీ ఇంకా చూడాల్సి వుంది.
రిప్లయితొలగించండి- తాడేపల్లి హరికృష్ణ
"అజ్ఞాత" లు అద్భుత అభిప్రాయాలు వెలిబుచ్చుతారా??!! ఫ్రాంక్ గా వ్రాస్తారా! అంతకంటే జోక్ మరోటి లేదు. పేరు చెప్పకుండా దాక్కుని ఎక్కడపడితే అక్కడ చెత్త వ్రాయటం తప్ప అజ్ఞాతలు చేసేది ఏమీ లేదు. అందుకనే ప్రజల కోరికపై అజ్ఞాత వ్యాఖ్యలు రాకుండా చేసాను.
రిప్లయితొలగించండిఇక ప్రొఫైల్ లేని వ్రాతలు. ఇది అజ్ఞాతను మించినది. చూట్టానికి పేరుతో వ్రాసినట్టు ఉండటం, చూస్తె ఎవరో తెలియదు. అందుకని ప్రోఫైల్ లేని వ్రాతలను కూడా తీసేస్తున్నాను. ఇకపై వారి పేరుతొ, ప్రోఫైల్ ఉన్న వ్యాఖ్యలే ప్రచురించబడతాయి.
మనకున్న వాక్ స్వాతంత్రాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాలి, అలా సవ్యంగా ఉపయోగించుకోవటం చేతవ్వాలి. అవాకులూ చవాకులూ వ్రాయటానికి 'అజ్ఞాత' ఏదో రకంగా అడ్డుపెట్టుకోవటం పద్ధతి కాదు.
@తాడేపల్లి హరికృష్ణ గారూ,
రిప్లయితొలగించండిమీ పేరుతొ ఒక ప్రొఫైల్ ఏర్పరుచుకుని మీ వ్యాఖ్యలు బ్లాగు వ్రాయటం మొదలు పెట్టండి.
ఇక మీరు చేసిన వ్యాఖ్య గురించి. తెలుగు మాట్లాడే వాళ్లకి రెండు రాష్ట్రాలు ఉన్నంత మాత్రాన తెలుగు సంస్కృతికి వచ్చే అడ్డేమిటి? హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి!! అన్నీ కలిపి ఒక్కటే రాష్ట్రం సాధ్యమా? మూడు కోట్లుగా ఉన్నప్పుడు ఒకే రాష్ట్రం సరే, ఇప్పుడు పది కోట్ల పై మాట. రెండు రాష్ట్రాలుగా ఏ ప్రాంత అభివృద్ది ఆ ప్రాంతం లో హాయిగా చేసుకోవచ్చు. వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. మొత్తం మొత్తం ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా హైదరాబాదులో మాత్రమె కేంద్రీకరించటం మంచి పనేమీ కాదు. ఆంధ్ర ప్రాంతంలోని అనేక ప్రాంతాల అభివృద్ది జరగకుండా ఆగిపోయింది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు చేస్తే ఆంధ్ర ప్రాతం ప్రగతికి చోటు చేసుకుంటుంది. అది లేకుండా, ఎమోషనల్గా మేమంతా ఒకటి మేమంతా ఒకటి అని పాట పాడుకుంటే ఉపయోగం లేదు.
Lets be practical and have our own Andhra State and ensure development in these Disctricts also.
శివ గారు,
రిప్లయితొలగించండివిషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
పది కోట్ల జనభా గలిగిన ప్రాంతాన్ని ఒకే రాష్ట్రంగా ఉంచాలని చెప్పడం రాజ్య విస్తరణ కాంక్ష తప్ప మరోటి కాదు. 10 లక్షల జనాభా కలిగిన రాష్ట్రాలు కూడా దేశంలో ఉండగా, పది కోట్ల జనాభాకు రెండు రాష్ట్రాలుండడంలో తప్పేముంది?
పైగా రెండు ప్రాతాల ప్రజలలో ఒకరిపై ఇంకొకరికి అపనమ్మకాలున్నాయి. పైన హరికృష్ణ గారు కలిసి ఉండడం వల్ల అభివృధ్ధిని కోల్పోయామని ఒకవైపు చెపుతూనే, రెండోవైపు కలిసే ఉండాలని కోరడం తర్కానికి అందని విషయం.
కలిసుండి కొట్టుకు చావడం కన్నా, విడిపోయి ఐకమత్యంగా ఉండడం తక్షణావసరం. విడిపోవడం వల్ల తెలుగు వారికి రెండు రాజధానులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీల్లో కనీసం ఒక్కటైనా కేంద్రంలో అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా కనీసం సగం ప్రాంతమైనా కేంద్రంలో ప్రభావం చూపి నిధులు పోంద గలుగుతుంది. అంతర్రాష్ట్రీయ వేదికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ గళం వినిపించ గలుగుతారు.
మాటిమాటికీ జర్మనీని సమైక్యతకు ఉదాహరణగా చూపాలనుకోవడం అఙ్ఞానం తప్ప మరోటి కాదు. జర్మనీ ఒక దేశంగా కలిసి ఉంది. కాని 80 లక్షల జనాభా ఐనా లేని జర్మనీలో 16 రాష్ట్రాలున్నాయి. వారందరు మాట్లాడేది జర్మను భాషే.
మీరన్నది నిజం. ఈ బలవంతపు సౌభ్రాతృత్వం అనవసరం. హైదరాబాదులో కోస్తాంధ్రుల పెట్టుబడులు, తద్వారా అభివృధ్ధి నిజమే అయినప్పటికీ ఒకవేళ ప్రత్యేక రాష్ట్రమేర్పడినట్లైతే ఆనతి కాలంలోనే దానిని తలదన్నే పట్టణాలూ, అభివృధ్ధీ కోస్తాంధ్రలో సాధ్యమే. ఇకనుంచైనా అభివృధ్ది ఒకచోట కెంద్రీకృతం కాకుండా చూసుకోవాల్సిన అవసం వుంది. ఆదినుండీ తెరాసనీ వారు వాడుతున్న పదజాలానీ గమనిస్తున్నట్లైతే వాళ్ళక్కడ కోస్తాంధ్రులను బ్రతకనిస్తారని భావించడం కష్టం.
రిప్లయితొలగించండి>> మీ పేరుతొ ఒక ప్రొఫైల్ ఏర్పరుచుకుని మీ వ్యాఖ్యలు బ్లాగు వ్రాయటం మొదలు పెట్టండి.
రిప్లయితొలగించండిశివరాం గారూ, నాకు అన్యాపదేశంగానూ అనామకంగానూ వ్యాఖ్యలు రాసుకునే అలవాటూ, అవసరమూ లేవు. అలాగని నా గురించి వివరంగా తెలుసుకోవలసిన అవసరమూ, ఆసక్తీ కూడా ఇక్కడి పఠితలకి లేవని నేను నమ్ముతున్నాను. నా పేరూ, ఊరూ, ఉద్యోగము, పదవీ, చదువూ నేరాసిన వ్యాఖ్యకి సాధికారికత తెచ్చిపెట్టేట్టైతే అలాగే రాసి వుందును. భవదీయుడు రక్తమాంసాలున్న ఒక సామాన్యుడు. అమెరికా నైరృతి భాగంలో ఒకానొక సాంకేతిక సంస్థలో సాంకేతిక ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల పట్ల ఆసక్తి మక్కువ కలవాడు. నాకు వీలున్నప్పుడు మీ సూచన పాటించి వేరే బ్లాగ్ రాస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. సందర్భ సహితంగా వున్నదని కాస్త పెద్ద వ్యాఖ్య రాశాను. అది మీ బ్లాగులో చేర్చడానికున్న అర్హతలేవో తెలీక. అయినా వేసుకున్నందుకు కృతజ్ఞుడను.
- తాడేపల్లి హరికృష్ణ
@హరికృష్ణ గారూ,
రిప్లయితొలగించండిబ్లాగులోకంలో తుంటరులు కొందరు చేరి అజ్ఞాతలుగా అవాకులూ చవాకులూ వ్రాస్తూ, ఎక్కడ ఏ చర్చ జరిగినా అందులోకి దూరి, ఆ చర్చను హాస్యాస్పదం చెయ్యటం జరుగుతున్నది. వీళ్ళకి సొంత అభిప్రాయాలు అంటూ ఏవీ ఉండవు. ఆవతల వాళ్ళు అన్నది కాదనటమే కాకుండా, ఆ బ్లాగు ఓనర్ ని, అక్కడ వ్యాఖ్యలు చేసే వాళ్ళను ఎంత మాటపడితే అంత మాటలు అనేయ్యటం. ఒకచోట వ్రాసిన వ్యాఖ్యకు వ్యతిరేక వ్యాఖ్య మరో బ్లాగులోకి వెళ్లి వ్రాసేసి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా అనుకుంటారు కాబోలు. అక్కర్లేని దురుసుతనం వీళ్ళ బ్రాండ్. అటువంటి తుంటరి వాళ్ళను కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉన్నదన్న విషయంలో మీరు నాతొ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను.
మీరు వ్రాసినది బాగా ఉండటం వల్లే ప్రచురించాను. అజ్ఞాతలను అరికట్టాలంటే , అందరూ ప్రొఫైల్లో వివరాలు వ్రాసుకున్నవారినే గుర్తించటం మొదలు పెట్టాలి. తమ ఊరు పేరు వ్రాసుకున్నవారు ( అక్కడ కూడా దొంగ పేర్ల వాళ్ళు కొందరు ఉన్నారు!!) నలుగురితో సవ్యంగా ఉంటారని ఆశ. ఆ క్రమం లోనే మీకు అలాగ సలహా ఇవ్వటం జరిగింది కాని i మిమ్మల్ని ఏదో ఎద్దేవా చేద్దామని కాదు గమనించగలరు .
ఈ బ్లాగులోనే నా వ్యక్తిగత మెయిలు చిరునామా ఉన్నది. మీతో మాట్లాడవలసిన విషయం ఒకటి ఉన్నది నాకు మెయిలు చెయ్యగలరు.
శివ గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు బాగుంది. కాని పేరు ప్రొఫైలుతో సహా పైన ఒక పెద్దమనిషి లాగా మాట్లాడిన వ్యక్తి ఎమని వ్రాసాడో ఈ లింకు నొక్కి చదవండి. విడిపొయి ఇకమత్యం అంటున్న పెద్ద మనిషికి కనీసం సాటి తెలుగు వారిపట్ల ఎంతొ గౌరవం వున్నదో చూడండి.
రిప్లయితొలగించండిhttp://cheekativelugulu.blogspot.com/2011/03/blog-post_04.html
@రాధాకృష్ణ
రిప్లయితొలగించండిప్రొఫైల్లో పేరు ఊరు వ్రాసుకున్నంత మాత్రాన ద్వేషం కక్కకూడదని లేదు. అలాంటి ద్వేషపూరిత బ్లాగులు అనేకం.
వ్రాసే వ్రాతలలో ఎవరి సంస్కారం వారు తమకు తెలియకుండానే (ఒక్కోసారి కావాలనే) ప్రదర్శిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఎవరైనా సరే సొంత పేరుతోనే వ్రాసి వారి వారి అభిప్రాయాలను తెలియచేసుకోవటం కనీస మర్యాద అని నా అభిమతం. ఊరుపేరు లేకుండా వ్రాయటం పిరికితనం.
@Hari
రిప్లయితొలగించండిYour response please. I have not so far read the post made by you but having read, I feel very very sad with your depiction and your views on your own fellow Citizens.
Earlier I read and made my comments on your article on use of Telugu but very much startled to read your present article for which link is given above.
Sorry for posting a comment not related to this post.
రిప్లయితొలగించండిI have read some of your posts and comments ( including the one on Mailavaram blog today). I think you have great ideas especially related to the protection of consumers ( The other one being boycotting Onions for a few days)
I think you need to share this kind of thoughts on a broader platform and enlighten the consumers.
Who knows, you could as well be the initiator of a "Consumer Revolt" against unfair merchants which is extremely helpful to the Indian society which is dangling in between the walls of Socialism, Communism, Capitalism and Consumerism - unable to decide which way to go.
We would be more than happy to publish such an article on Maalika Patrika and publicize it, if you are willing to write one. (Of course, something like Eenadu would be even better)
@Malakpet Rowdy
రిప్లయితొలగించండిThank you for your comment and appreciation. I would very much prefer to know your असली नाम. If you look around my e mail id is very much available in my blog.
Consumer revolt!!! Is it possible in our Country! Everyone of us individually very intelligent but collectively foolish beyond repair.
Everyone of us is foolishly individualistic to the extent not to follow any advice even when we know inwards that its for our good. We do not follow it for the simple reason, its not our thought but others.
Once I had given a Radio Speech on this matter from AIR., Vijayawada way back in 1989. But stoic silence greeted me.
I have no problem in writing but to what effect is my concern. You are welcome to send me the topic to write.
Ahh,
రిప్లయితొలగించండిI thought everyone on blogs knew my असली नाम. I am mistaken :)
This profile should clear up everything. I use that name because thats what I am known as, on the Internet for the last many many years. In fact more than half of the netizens outside the blogs cant recognize me, if I tell them my real name :))
Dont worry about the effect. We will try our best.
I can be reached on bharadwaja@yahoo.com - I shall send mail you too.
"Ahh" Good response. LOL.
రిప్లయితొలగించండిThe thing that impressed me most is your focus on the consumers in helping themselves out.
రిప్లయితొలగించండిUnlike the capitalists who exploit the consumers and unlike the communists who create demons out of the capitalists and create a rift between the merchants and the consumers ( thereby indirectly increasing the demand, helping the merchants ) your approach is different and talks about "Consumer Responsibility".
@Bhardwaj
రిప్లయితొలగించండిI strongly believe that no "ism" can help the humanity. All "isms' are just ploys to grab power and nothing else. Only individual and group of individuals can help himself/themselves.
"Everyone of us individually very intelligent but collectively foolish beyond repair"
రిప్లయితొలగించండి:-)
మీ బ్లాగులో ఎప్పుడూ కామెంటు పెట్టలేదు కానీ, మీరు వ్యక్తపరచే అభిప్రాయాలు, వ్యక్తపరచే విధానం అంటే నాకభిమానం.
పోతే పైన హరి గారికి ఓ ప్రశ్న. బానే చెప్పారు, మీతో ఏకీభవిస్తున్నానని, రెండు రాష్ట్రాలు విడిపోవాలని. హైదరాబాదు నేం చేయాలో, కన్వీనియంట్ గా వదిలేసారు, వారి కామెంట్ లో. వారి స్టాండ్ ఏంటో దాని మీద?
మీరు చెప్పిన సంవత్సరం అక్టోబర్ నెల నాకెప్పటికీ
రిప్లయితొలగించండిగుర్తుంటుంది ముల్కీ రూల్స్ వ్యతిరేకిస్తూ అన్ని విధ్యాలయాల
విధ్యార్థులూ సుదీర్ఘ్ంగా సమ్మె చేశాం.నేను నాలుగో క్లాస్ చదువుతున్నాను
మూడు సార్లు రిలే నిరాహారదీక్షలో కూర్చున్నాను.
మీరన్నట్టు ఆ రోజుల్లో అంత ఉద్రుతుంగా లేచిన ఆత్మాబిమానం,
చైతన్య వీచికా ఏమయ్యాయి
శివ గారు కృష్ణ ప్రకటన సరైన సమయానికి కనిపించింది నేను జర్నలిస్ట్ ను ఒక వ్యాసం రాయడానికి కృష్ణ ప్రకటన ఉపయోగించుకునే అనుమతి కోరుతున్నాను .అదేవిదంగా అప్పటి నటులు జై ఆంధ్ర ఉద్యమం పై చేసిన ప్రకటనలు గుర్తుంటే మీ బ్లాగ్ లో రాయగలరు
రిప్లయితొలగించండి@buddha murali
రిప్లయితొలగించండినా అనుమతితో పనే లేదు. నేను ప్రచురించిన కృష్ణ గారి ప్రకటన ఆయన ఆ రోజుల్లో విడుదల చేసినది. అది పబ్లిక్ ప్రకటన కాబట్టి ఎవరి అనుమతీ అక్కర్లేదనుకుంటాను. మిగిలిన నటులు కూడా దాదాపు ఇదే తరహాలో ప్రత్యెక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ ప్రకటనలు చెశారు.
ఇప్పుడు ఏ ఒక్క నటుడు అటు అవునంటంలేదు కాదని అనటంలేదు. మీరు వ్యాసం వ్రాసినాక బ్లాగు లోకానికి తెలియటానికి ఒక లింకు పంపండి.
@KumarN
రిప్లయితొలగించండిI too read your comments here and there and find them good. But whats your objection in having your full profile to be seen by everybody. There are about 500+ views in your profile but there is nothing there to know excepting your zodiac sign!!
@Hari
రిప్లయితొలగించండిNo response from you as yet. I do not wish to further remind you for fear of embarrassment.
Shiva gaaru,
రిప్లయితొలగించండిSorry for the late response. I have just seen the discussion about my post here.
I have written about 'సమైక్యాంధత' and nothing pro or against Andhraites if you read it well. I only accused few hand pick people who are dominating and even causing problems to Andhra people. Regarding blindness, I equally depicted both andhra and telangaanaa people as blind.
If you have any more queries on this, welcome to my blogpost where we can discuss in more detail.
@RADHAKRISHNA
రిప్లయితొలగించండిThe post was a satire on samaikyaandhra philosophy. Can you quote the part of the content you found objectionable on 'fellow citizens'?
@HARI.
రిప్లయితొలగించండిFor me your entire post was not in good taste.
Shiva garu,
రిప్లయితొలగించండిThanks for the comment.
I think you would understand that 'taste' and 'good' are not subjective in nature.
Which is why you are forced to delete a considerable number of comments.
Please don't publish this comment if you don't want to.
@Hari.
రిప్లయితొలగించండిYes I do agree opinions are personal. But when we write about a matter with an intention and if such intention is not served, what is the use?! By your writing something which you term as "satire" you have only made people who spew venom about Telangana cause to pump out more venom. Not only that you might have succeeded in alienating people who are quite sympathetic (from the other side of the fence) about separate Telangana cause. That's what I termed as "not in good taste".
హరి గారు,
రిప్లయితొలగించండిమీరు ఏమనుకొని వ్రాసుకున్నారో కాని అది మటుకు మీ "స-అంధతలో" వ్యక్తపరచలేకపోయారు. మీరు ఉద్దేశ పూర్వకంగా వ్రాసినట్లైతే మీ ఉద్దేశం ప్రకారం దేశంలోని ప్రజలెవ్వరూ మరోచోటకి వెళ్ళకూడదన్నట్లు వున్నది, లేదా మరెవరూ హైదరాబాదు రాకూడదని అనిపించేట్లు వున్నది. మరింత నేరౌగా ఒక ప్రాంత ప్రజలని ఉద్దేసించినదిగా కనపడుతోనే ఉన్నది. వ్యక్త పరచినతీరు ఒక ప్రాంత ప్రజలని అవమానించేదిగా వున్నది. అది ఇప్పటికీ మీకు ఎందుకు కనపడటలేదొ మీకే అర్ధం కావాలి. నేను కూడా సమైక్య ఆంద్రకి వ్యతిరేకమే, కలిసి వుండటం వలన కొన్ని దశబ్దాలుగా నష్టపోయామని ఇక్కడి ప్రజలకి కూడా వున్నది. అది ఎదో ఒక ప్రాంత ప్రజలమీద రుద్దటం లేదు. ఇదంతా రాజకీయ నాయకుల దుష్ట చతురత. దానికి ప్రభావితులై మనం వ్యవహరించకూడదనీ, ఒకళ్ళనొకళ్ళం అవమానించుకో కూడదని నా అభిప్రాయం. మీరు వ్రాసిన వ్యాసాలు లాంటివి విడిపోవటానికీ పనిచెయ్యవు, మరియు విడిపోయక కూడా ఐకమత్యంగా వుండాలంటానికీ దోహదపడవు.
Shiva gaaru,
రిప్లయితొలగించండిThanks for the advise.
I am not against Seemaandhra people but against the people who refuse to understand the just cause of Telangana.
May be I need to be more clear in my words in isolating the venom spewing snakes against Telangana.
హరిగారూ,
రిప్లయితొలగించండివిద్వేషాలు ఒకళ్ళమీద ఒకళ్ళు చిమ్ముకోవటం వల్ల ఒకళ్ళ నొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం వల్ల, ఇక్కదోకిచ్చిన అందరూ వెళ్ళిపొండి అనే వెర్రి మాటలు, మేము కాని వాళ్ళందరూ దోపిడీదార్లు, వలసదార్లు అనుకోవటం, అనటం పూర్తిగా భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదని నా స్థిర అభిప్రాయం. మనకు నచ్చని భావాన్నల్లా అజ్ఞానం అనటం, పక్క పక్కన ఉండాల్సిన వాళ్ళం ఇలా దుర్భాషలాడుకుని (హాస్యానికైనా సరే) రేప్పొద్దున్న మళ్ళి ముఖముఖాలు ఎలా చూసుకుందామని!
ఇప్పటివరకూ అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎక్కడా కూడా విడిపోదలుచుకున్నవాళ్ళు ఇలా దుర్భాషలె ఆయుధంగా వాడలేదు. అది తప్పని వాళ్లకు తెలిసి ఉండాలి.
కాబట్టి కనీసం చదువుకున్నాం అనుకునే వాళ్ళన్నా కొంత సంయమనం పాటించాలని నా ఉద్దేశ్యం.
స్వస్తి.
ముందుగా కృతఙ్తలు.... మీరు ఏమి అనుకోరు అని భావించి ఈ టపా ని నేను (FB)ఉపయొగించుకుంటాను(మీ బ్లాగ్ అడ్రస్స్ కూడా!).
రిప్లయితొలగించండికృష్ణ గారిలా స్పష్టత గల వాళ్ళు ఇప్పుడు లేరు!.ఈనాడు కూడా ఆనాటి విద్యావేత్తలు కాస్త గొంతు పెంచితే రాష్ట్రం యొక్క స్థితి మెరుగుపడుతుంది. ప్చ్ కానీ కాంగ్రేస్ మార్కు రాజకీయం తో ఎప్పటిలానే చిందర వందర చేసిపాడేస్తున్నారు!. మళ్ళీ స్తిరత్వం రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో!!!
నరసింహ గారూ. నాకు అభ్యంతరం లేదు. మీకు కావలిసిన చోట కోట్ చెయ్యండి.
రిప్లయితొలగించండి