=======================================
ఇప్పటికీ అలనాటి తమ పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను చదువరులకు అందిస్తున్న ఏకైక పత్రిక చందమామ. మరే ఇతర పత్రికకూ వారి పాత ప్రతులకు డిమాండూ లేదు, అలా తమ పత్రిక పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను తమ వెబ్ సైట్లలో ఉంచే నిబద్ధతా లేదు.
=======================================
(ఈ ఆనందం 2006 డిసెంబరు నాటిది)
"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!"
ఈ చిన్ని వ్యాసం త్రివిక్రమ్ గారి బ్లాగ్ నుండి పున:ప్రచురణ
ప్రస్తుతానికి చందమామ సాఫ్ట్ కాపీలు చందమామ వారి వెబ్ సైటులో(క్లిక్ చెయ్యండి) తప్ప, (అతి తక్కువ రిజల్యూషన్ లో) మరెక్కడా అందుబాటులో లేవు. ఎక్కడన్నా ఎవరన్నా మంచి రిజల్యూషన్ లో ఉన్న పి డి ఎఫ్ ఫైళ్ళు వెబ్ సైట్లల్లో ఉంచితే చందమామ వారు వెతికి వెతికి వేటాడి అవి తీసేయిస్తున్నారు. అప్పట్లో యు లిబ్ నుండి డౌన్లోడ్ చేసుకోగలిగిన వారు అదృష్టవంతులు!! ఇప్పటికీ అలనాటి తమ పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను చదువరులకు అందిస్తున్న ఏకైక పత్రిక చందమామ. మరే ఇతర పత్రికకూ వారి పాత ప్రతులకు డిమాండూ లేదు, అలా తమ పత్రిక పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను తమ వెబ్ సైట్లలో ఉంచే నిబద్ధతా లేదు.
(ఈ ఆనందం 2006 డిసెంబరు నాటిది)
"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!"
అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే. వాళ్ళు తెలిపారు. ఇవి మార్కెట్లోకి వస్తే పాత చందమామలకోసం హైదరాబాదులోని పాతపుస్తకాల షాపుల్లో వెదకడం; హిందూ లో, ఇంటర్నెట్లో ప్రకటనలివ్వడం లాంటి అవస్థలు తప్పుతాయి. :) ఇది నిజంగానే మొన్న ౧౬వ తేదీ హిందూలో వచ్చిన ఒక ప్రకటన (పేజీ అడుగున ఉంది):
Chandamama
Interested in old/very old Chandamama (Telugu) magazines. If any body interested to gift/sell at reasonable price, contact K.S.Kumar, Ph.98666-96564.
(పాత చందమామలు ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయాయట. వాళ్ళ ఆఫీసులో ప్రతి సంచికా ఒకటో రెండో ప్రతులు మాత్రమే ఉన్నట్లున్నాయి. అందుకే అవి కావాలనుకున్నవాళ్ళకు ఇన్ని తిప్పలు.)
ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త:
సీడీల్లో 'చందమామ'
ముందుకొచ్చిన తితిదే
ఇప్పటికే లక్ష పేజీల నిక్షిప్తం (60 యేళ్ల కాలంలో వచ్చిన తెలుగు చందమామలు దాదాపు 45 వేల పేజీలు ఉండవచ్చు)
చెన్నై - న్యూస్‌టుడే
తెలుగు వారి అభిమాన పుస్తకం.. ఆ కథల మాధుర్యానికి మురిసిపోని తెలుగు వారంటూ ఉండరు.. కేవలం ఒక్క తెలుగు వారినే కాకుండా 13 భాషల్లో అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. ఇప్పుడు ఆ పుస్తకాలను డిజిటలైజ్ చేసి కంప్యూటర్లు, సీడీల్లో నిక్షిప్తం చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. తిరుపతిలోని ఎస్వీ డిజిటల్ గ్రంథాలయంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. 13 భాషల్లో ఉన్న మూడు లక్షల పుస్తకాలను పూర్తిగా సీడీల్లోకి నిక్షిప్తం చేస్తామని ఆ గ్రంథాలయ డైరక్టర్ భూమన్ చెప్పారు. చెన్నైలో శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే లక్ష పేజీలను సీడీల్లో నిక్షిప్తం చేశామన్నారు. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామన్నారు. చందమామ పత్రికలో వచ్చే కథలు ఎంతో విలువైనవని చెప్పారు. ఈ కథల కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రముఖ ఛానెళ్లు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో హనుమాన్ కథను సీడీల్లో నిక్షిప్తం చేయడానికి అనుమతిస్తే రూ. ఏడు కోట్లు చెల్లిస్తామని డిస్నీ ఛానెల్ చందమామ యాజమాన్యాన్ని కోరిందని.. వారు అందుకు తిరస్కరించి తమ విశిష్టతను చాటారని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.