21, ఏప్రిల్ 2011, గురువారం

పురాణ బొమ్మలే కాదు!!

అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు ఒక్క పురాణ బొమ్మలు వెయ్యటానికే పరిమితం అవ్వలేదు సందర్భోచితంగా చందమామ ముఖ చిత్రాలుగా అప్పటి దేశ సమస్యలను పిల్లలకు తెలిసేట్టుగా చక్కగా చిత్రీకరించారు.

1962
దీపావళికి పాపయ్య గారు వేసిన చిత్రం చూడండి. అప్పుడే కమ్యూనిస్ట్ చైనా మన దేశం మీదకు దురాక్రమణ చేసింది. విషయాన్ని పరోక్షంగా చూపిస్తూ చిన్న పిల్ల వాణ్ని సైనిక దుస్తుల్లో చూపి దేశానికి సైనిక పాటవం ఎంతో అవసరం అని పిల్లలకు స్పురించేలా చక్కగా వేశారు.


అలాగే
జనవరి 1963 సంచిక చివరి పుట చిత్రంగా అద్భుతమైన బొమ్మ వేశారు. బారతీయుల దేశ భక్తి చూసి బిత్తరబోతున్న చైనాను కాళ్ళ జెర్రి లాగ , డ్రాగన్ లాగ వేశారు. అప్పట్లో ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వటం కూడా చక్కగా చూపారు బొమ్మలో, చూడండి.




1 కామెంట్‌:

  1. శ్రీ శివరామప్రసాద్ గారు, సంధర్భానుసారంగా వడ్డాది దీపావళి చందమామకు గీసిన
    వర్ణచిత్రాలను చూపించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.