2, ఏప్రిల్ 2011, శనివారం

ఎప్పటివో కార్టూన్లు - ఐనా ఇప్పటికీ సందర్భోచితమే!

రోజున ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు గారి బ్లాగ్ చూసినాక ఒకసారి పాత పత్రికలు తిరగేయ్యాలని అనిపించింది. అదృష్టవశాన అనుకున్న వెంటనే 1972-73 ప్రాతాల "యువ" పత్రిక దొరికింది. శిధిలావస్థలో ఉన్న పత్రికను తిరగేస్తుంటే కొన్ని అద్భుతమైన కార్టూన్లు కనిపించాయి. కార్టూన్లు వేసినాయన పేరు "ప్రభంజన్" .

అప్పుడెప్పుడో
వేసినా కార్టూన్లు, నాటి గొడవలకు, సమస్యలకు అద్దం పట్టేట్టుగా ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలు కదిలిపోయినా, మనం సాధించిన అద్భుత ప్రగతి జనాభా 121 కోట్లు చెయ్యటమేనా!! అంతకంటే మరేమీ లేదా?? అని కొంచెం బాధ కలిగింది. కాకపొతే, గత రెండు దశాబ్దాలలో చాలా మంచి మార్పులు వచ్చాయి, అభివృద్ది జరగటాని తగిన వాతావరణం కల్పించబడింది . కాని మంచి వాతావరణాన్ని కొన్ని చీడ పురుగులు దుర్వినియోగ పరుస్తున్నాయి. అదే మన కష్టం, బాధ ఇప్పుడు

ఇక నా సోది ఆపుతాను. "ప్రభంజన్" గారు వేసిన కార్టూన్లు చూడండి, ఈనాటికి కూడ ఎంత సందర్భోచితంగా ఉన్నాయో!!!!




చిన్ని వ్యాసం చూసిన వారెవరికైనా "ప్రభంజన్" గారి వివరాలు తెలిస్తే చెప్పగలరు. వారి గురించి "ప్రముఖ కార్టూనిస్టులు" శీర్షికన నేను వ్రాస్తున్న వ్యాస పరంపరలో తప్పనిసరిగా వ్రాయాలి.

==============================================
నేను బ్లాగు ద్వారా "ప్రభంజన్" గారి వివరాలు కోరగా ప్రముఖ సాహిత్య పత్రిక 'రచన' సంపాదకులు శ్రీ శాయి ఈ విధంగా తెలియచేసారు.

Prabhanjan - Anjan Babu worked in Eenaadu. He is nomore.

మరింత సమాచారం ఉన్నవారు దయచేసి, నాకు తెలియచేయగలరు. "ప్రభంజన్" గారి మీద ఒకసమగ్ర వ్యాసం వ్రాయటానికి సహకరిమ్చాగాలరని మనవి.

====================================

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.