2, ఏప్రిల్ 2011, శనివారం

తెలుగు కార్టూన్ బ్లాగ్ ప్రారంభం

మొన్నామధ్యన ఒక రోజున అందరికీ ఒక "టీజర్" ఇదే బ్లాగులో ప్రచురించాను. ఒక ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ మన బ్లాగ్ లోకంలోకి రాబోతున్నారు అని. మీరు చూసే ఉంటారు. చూడకపోయినా పరవాలేదు! ఇప్పుడు అన్ని వివరాలు అందిస్తున్నాను.


ఇప్పటికి కొన్ని వేల కార్టూన్లు వేసిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాద్ గారు 'బాబు' పేరుతొ ఎంతో ప్రసిద్ది చెందారు. వారు కేంద్ర ప్రభుత్వంలో దశాబ్దాలపాటు ఉద్యోగ ధర్మం నిర్వర్తించి, ప్రస్తుతం రిటైర్ అయ్యి విజయవాడలో స్వగృహంలో లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

నాకు ఆయనతో పరిచయం నాటిది కాదు. ఇది కొంచెం నవ్వొచ్చే మాటే! ఎందుకు అంటే, నా చిన్నప్పటి నుండి ఆయన కార్టూన్లు చూస్తూ ఉన్నాను కాబట్టి,
సహజంగా ఆయన నాకు తెలుసు. కాని ఆయనకు మటుకు నేను గత మూడు నాలుగేళ్ల నుండి మాత్రమె తెలుసు.

కాని నేను టైపు నేర్చుకునే రోజుల్లో అంటే 1972-73 సంవత్సరాల్లో (మా మంచి మాష్టారు వ్యాసం చూడండి) మా మాష్టారు భగవాన్ దాస్ గారి దగ్గరకు "బాబు" వస్తూ ఉండేవారు. ఆయనే "బాబు" అని నేను పత్రికలో పడిన ఆయన ఫోటో వల్లన గుర్తుపట్టేసాను. కాని మాట్లాడాలంటే భయం (అప్పుడు నాకు 14-15 ఏళ్ళు). తరువాత్తరువాత కొన్నేళ్ళు గడిచినాక నేనంటూ వ్యాసాలు వ్రాస్తూ, మనకున్న ప్రముఖ కార్టూనిస్టులు అందరి గురించీ వ్యాస పరంపర వ్రాస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారి ద్వారా "బాబు" గారికి రికమెండ్ చేయించుకుని వారి వివరాలు సంపాయించి, నా వ్యాసం పూర్తి చేశాను. అప్పటి నుండి మన "బాబు" గారితో పరిచయం.

ఒక అద్భుత తెలుగు కార్టూనిస్ట్, మన బ్లాగు లోకంలోకి అడుగు పెట్టడం ఎంతో అద్భుతమైన విషయం.

శ్రీ బాబు గారు బ్లాగ్ ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

బాబు కార్టూన్స్

బ్లాగర్లు, బ్లాగులు చదువుతున్న చదువరులు అందరూ "బాబు కార్టూన్లు " చూసి ఆనందించగలరు.

ఈ శుభ సందర్భంగా శ్రీ బాబు గారికి ఆయన బ్లాగు చూసి, మీ అభిప్రాయాలు తెలియచేస్తూ, శుభాకాంక్షలు తెలియచేయగలరు.












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.