10, ఏప్రిల్ 2011, ఆదివారం

చందమామలోముద్రా రాక్షసం

అవునండీ చందమామలోనే, అదీ మన తెలుగు చందమామలోనే అప్పు తచ్చులు, అవే అచ్చు తప్పులు. ఆంగ్లంలో 'Printer's Devil' అనే మాటను మన పూర్వీకులు తెలుగులోకి అద్భుతంగా తర్జుమా చేశారు, ఏమనీ! "ముద్రా రాక్షసం" అని. ఇలా తెలుగు చెయ్యబడిన మాటలు హాయిగా ఉంటాయి అంతర్జాలం (ఏదో మార్జాలం లాగ ) లాంటి మాటలు కాకుండా.

సరే విషయానికి వస్తే ఆగష్టు 1967 సంచికలో "భారత చరిత్ర" ధారావాహిక మకుట చిత్రం లో ఉన్నదా తప్పు. నెలలో తప్పుతో ఉన్న బొమ్మని మరుసటి నెలలో సవ్యంగా ఉన్న బొమ్మనీ రెండిటినీ కింది ఇస్తున్నాను, చూడండి. ఎంత చందమామలోనైనా దేశ పటం ముద్రణలో ఇలాటి తప్పు చాలా ఘోరం.

1 కామెంట్‌:

  1. ‘చందమామ’లోని మచ్చను భలే కనిపెట్టారండీ మీరు! ముద్రా రాక్షసమంటే అక్షర దోషం కాబట్టి- దీన్ని‘ముద్రణా రాక్షసం’ అనాలేమో. చందమామ స్వర్ణయుగంలో కూడా ఈ తారుమారును ప్రచురణకర్తలు గమనించకపోవటం ఆశ్చర్యంగానే ఉంది! పొరపాటు దొర్లటం సరే గానీ, తర్వాతి సంచికలో ఈ దీన్ని ప్రస్తావించి విచారం వెలిబుచ్చివుంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.