10, ఏప్రిల్ 2011, ఆదివారం

చిత్రా అద్భుత చిత్రీకరణ

శ్రీ చిత్రా
చందమామ అంటేనే బొమ్మలకు ప్రసిద్ది. కథ ఏదైనా సరే (కథలు గొప్పవి కావని కాదు!) బొమ్మల ఆకర్షణలో కథ చదవకుండానే అర్ధమయ్యే రీతిలో ఉండేవి బొమ్మలు అప్పట్లో. ముఖ్యంగా "చిత్రా" గారి బొమ్మలు. పాతాళ దుర్గం అని ఒక ధారావాహిక 1960 లలో వచ్చింది. ధారావాహికలోది , ఒక పూర్తి పుట చిత్రం కింద ఇస్తున్నాను. ఇది పాతాళ దుర్గం లోపలి బొమ్మ. చూడండి చిత్రాగారు ఎంత చిత్రంగా చిత్రించారో!! పాతాళంలో ఉన్నవాళ్ళకి లైటు ఎలా అనుకునే పిల్లలకి చక్కగా తెలిసేట్టుగా అక్కడక్కడా అంతర్ గుహా నిర్మాణం లో ఉన్న రంధ్రాల నుండి "స్కై లైట్" లాగ సూర్య కిరణాలుఎలా ప్రసరిస్తున్నాయో. చక్కటి "Light & Shade effect" బొమ్మ పరిపూర్ణంగాఉన్నది. స్వతహాగా చక్కటి ఫోటోగ్రాఫర్ ఐన చిత్రాగారు, తన బొమ్మల్ని కూడా ఫోటో తీసినట్టు వేసేవారు. ఇకచూడండి అద్భుత చిత్రం.


2 వ్యాఖ్యలు:

  1. చిత్రా గారి బొమ్మలతో నాకు "తోకచుక్క" కాలంలో పరిచయం.ఓ మారు చతుర్నేత్రుడి టోపీ వేలాడుతున్నట్టు గీశారు. భయం గొలుపుతూ ఉంటుందా బొమ్మ.

    చిత్రా గారి తర్వాత పైనుండి చూస్తున్నట్టుగా బొమ్మలు రాజి అనే కళాకారులు వేసారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఇలాంటి విహంగ వీక్షణ (Bird's eye view) చిత్రాలను వేయటం చిత్రా గారి ప్రత్యేకత. ఇందులో కాంతికిరణాలను చాలా బాగా చూపించారు. ‘జ్వాలాదీపం’ సీరియల్ లోని అద్భుత చిత్రం కూడా చాలా ఎత్తు నుంచి దృశ్యాన్ని చూపించేదే. అది దాసరి గారి సంస్మరణ సంచికగా ప్రచురించిన ‘రచన’ ముఖచిత్రంగా వచ్చింది!

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.