23, మే 2011, సోమవారం

మాకు నమ్మకం లేదు దొరా!...చక్కటి నటన..ఎవరీ నటుడు

శేఖర్ కమ్ముల తీసిన లీడర్ సినిమాలో టేకింగ్ చాలా బాగున్నది. దాదాపు ప్రతి సీనూ సహజంగా జరుగుతున్నట్టుగా తెరకెక్కించటంలో దర్శకుడు కెమెరామాన్ కృతకృత్యులయ్యారు. నిన్న "మా టి వి" చానెల్ల్ లో వాళ్ళు వేసే అసంఖ్యాక ప్రకటనలను స్కిప్ చేస్తూ ఓపికగా మరొక్కసారి చూశాను. సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చిన సీను. ముఖ్యమంత్రి తన పదవి కాపాడుకోవటానికి, మునుస్వామి గ్రూప్ కు చెందిన ఎం ఎల్ ఏ కొడుకు, తమ పల్లెలోని ఒక అమ్మాయిని రేప్ చేసి ఆపైన అమ్మాయిని చంపేసిన వాణ్ణి వదిలెయ్యటానికి ఒప్పుకుంటాడు. తరువాత అమ్మాయి తండ్రి చెల్లెలు ముఖ్య మంత్రి దగ్గరకు, తమ ఊరు వెళ్ళిపోతామని చెప్పటానికి వస్తారు. కాని సినిమాలో వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి రక్షణలో ఉన్నారా? లేదా ముఖ్యమంత్రికి తమ నిరసన తెలియచెయ్యటానికి అప్పుడే వచ్చారా, అప్పటిదాకా ఎక్కడ ఉన్నారు, ఇలాంటి విషయాలు ఎస్టాబ్లిష్ కాలేదు లేదా నేను మిస్ అయ్యానా?



ఏది
ఏమైనా, సీన్లో తండ్రి పాత్ర ధరించిన నటుడు అద్భుతంగా నటించారు. ఆయన కంఠస్వరం గంభీరంగా ఉన్నప్పటికి కూడా, దీనత్వాన్ని, అసహాయతనూ చక్కగా పలికించారు. నటుని చేత పలికించిన మాటలు, నటుని చక్కటి నటనతో నిగ్గుతేలి తూటాల్లా పేలి అప్పటివరకూ ముఖ్య మంత్రి అయ్యి ఏదో తనకు తోచిన పధ్ధతిలో తికమకగా నడుస్తున్న లీడర్ ను ఒక ఎక్కుబెట్టిన బాణంలా తయారు చెయ్యటానికి దర్శకుడు అద్భుతంగా వాడుకున్నారు.

వీడియో కనపడటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ఆడియో ఫైల్ వినండి:


నటుని పేరు తెలిసిన వారు దయచేసి చెప్పగలరు.
















3 కామెంట్‌లు:

  1. అతని పేరు నాకు కూడా తెలియదు కాని అతని నటన అద్భుతం(ఇక్కడ ప్రస్తావననర్హం కాని నా మటుకు వేదం సినిమాలో 'రామయ్య ' పాత్రధారి నటన కన్నా ఇతని నటన చాలా మెరుగు). ఇక ఆపాత్ర ముఖ్యమంత్రి వద్దకు రావడానికి కారణం, ముఖ్యమంత్రి వాళ్ళని క్షమాపణ అడిగి తనకు చేతనయిన 'న్యాయం' చేయడానికి పిలిపించుకుంటాడు.

    రిప్లయితొలగించండి
  2. శివరాంప్రసాద్ గారు,
    ఆ నటుడుపేరు శాస్త్రి అని గుర్తు. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం.ఈపాటికి హయిదరాబాదులో రిటైరయి వుండాలి.

    రిప్లయితొలగించండి
  3. "బాబు" గారూ. మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.