రేడియో నెదర్ లాండ్స్ చిహ్నం |
చిన్నప్పటి నుంచి నాకెంతో అభిమానమైన హాబీ రేడియో వినటం. ఊరికే వినటమే కాదు, దేశదేశాల రేడియోలను వినటం, వాళ్ళకు ఉత్తరాలు వ్రాయటం, ఒక డైరీ పెట్టుకుని, ప్రతి రోజూ ఏ రేడియోలో ఏ వార్తలు చెప్పారు వ్రాసుకోవటం కొన్ని సంవత్సరాల పాటు చేసాను.
నా ఆసక్తి గమనించిన మా బాస్ (వరంగల్లులో పని చేస్తున్నప్పుడు) ఆఫీసులో ఒక బోర్డు ఏర్పాటు చేయించి దానిమీద ప్రతిరోజూ విదేశీ వార్తలను వ్రాయమని నన్ను ప్రోత్సహించారు (ఆయన తరువాత్తరువాత ఒక ప్రవైటు బాంకుకు చైర్మన్ గా పదవీ విరమణ చేసారు).
అక్కడ ఉన్నన్ని రోజులూ "WINDOW ON THE WORLD" అన్న పేరుతొ ప్రపంచ రేడియోలు ఆ రోజున చెప్పిన వార్తలు వ్రాస్తూ ఉండేవాణ్ణి. ఆఫీసుకు వచ్చిన అందరూ నిలబడి ఆ వార్తలు చదువుతూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది.
మరి నేను వ్రాసిన వార్తలు అప్పట్లో మన రేడియోలో వచ్చేవి కాదు, పత్రికల్లో కనపడేవి కాదు. పత్రికల్లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వామపక్ష వాదులు ఈ వార్తలను సెన్సార్ చేసి పూర్తిగా వ్రాసేవారు కాదు. నా విండో ఆన్ వరల్డ్ 1985 ప్రాంతాల్లో చదివిన వాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా యూరోప్ లో కమ్యూనిస్టుల నియంత పాలన 1990లలో అంతమవ్వటం ఆశ్చర్యం కలిగించలేదు.
ఎందుకు అంటే ఈ వార్తలన్నీ పూర్తిగా అన్ని వివరాలు సంపాయించి వ్రాసే వాణ్ణి. 1980 లలో పోలాండ్ లో పడిన కార్మిక ఉద్యమ బీజం (కార్మిక ఉద్యమాలు పూర్తిగా వాళ్ళ గుత్తాధిపత్యం అని కామీ లు అనుకుంటూ ఉంటారు, కానీ భారత దేశంలో అతి పెద్ద ట్రేడ్ యూనియన్ హింద్ మజ్దూర్ సభ) సోలిడారిటీ పేరుతొ వామనావతారం లాగ పెరిగి పెద్దయ్యి ఆ ఉద్యమ నాయకుడే లే వలీజా పోలాండ్ దేశాధినేత అయ్యేంత శక్తివంతం అయ్యింది. ఆ తరువాత జరిగిన అనేక సంఘటనలు, తూర్పు యూరోప్ విముక్తి, ఇప్పుడు చరిత్రలో భాగం.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రేడియో పెడితే వినబడేది స్టేషన్లు కాదు (ముఖ్యంగాషార్ట్ వేవ్ లో-అదంటే ఎంత మందికి తెలుసు ఇవ్వాళ?!) అనేకానేక కమ్యూనికేషన్ వ్యవస్థల-సెల్ టవర్లు, కేబుల్ ఇంటర్నెట్, కేబుల్ టి వి ఇంకా ఇలానే ఎన్నెన్నో-చప్పుళ్ళే. విందామన్నా అలనాటి రేడియోలు లేవు.
నాకు ఎంతగానో ప్రీతిపాత్రం ఐన రేడియో స్టేషన్ "రేడియో నెదర్లాండ్స్" . ఈ రేడియోని అనేక తంటాలు పడి అంటేన్నాలు కట్టుకుని ఎంతో కష్టపడి, ఒక ఫ్రీక్వెన్సీ లో రాకపోతే మరో ఫ్రీక్వెన్సీ లో ప్రయత్నిస్తూ రోజూ వినేవాణ్ణి . వాళ్ళ కార్యక్రమాలు అంత బాగుండేవి.
ఇప్పుడు అనేక రేడియోలు ఇంటర్నెట్లో వస్తున్నాయి. రేడియో నెదర్లాండ్స్ కూడ ఇంటర్నెట్ లో హాయిగా ఏవిధమైన అంతరాయాలు, గర గర చప్పుళ్ళు వగైరా లేకుండా స్వచ్చమైన ఆడియో తో వినవచ్చు. ఈ కింద ఆ రేడియో వినటానికి వీలయ్యే అవకాశం ఇస్తున్నాను. ఆసక్తి కలవాళ్ళు విని ఆనందింవచ్చు.

అప్పట్లో వచ్చే రేడియో స్వీడన్ వంటివి కనుమరుగు అయ్యాయి. ఆయా స్టేషన్లు చేసిన చివరి బ్రాడ్కాస్ట్ ఈ కింది లింకుతో వినవచ్చు.
రేడియో నెదర్లాండ్స్ గురించి.. పరిచయం చాలా బాగుంది. చాలా ఆసక్తికర విషయాలు తెలియజేసారు. ఇప్పుడు రేడియో వినదమా? ఎప్పటి కాలంలో ఉన్నారండీ! అన్న ప్రశ్నలు వినవలసి వస్తుంటే.. మీ..టపాలు.. ఊపిరిపోసినట్లు ఉంటున్నాయి .మీకు హృదయ పూర్వక ధన్యవాదములు
రిప్లయితొలగించండిThanks for good info
రిప్లయితొలగించండిచాలా మంచి పోస్టు వ్రాశారు. నేనుకూడా రేడియో నెడర్లాండ్ (విరల్డమ్ రూప్) అభిమానిని. ఒకప్పుడు రేడియో స్వీడన్, రేడియో మాస్కో, రేడియో నార్వే ఇంటర్నేషనల్, రేడియో ప్రాగ్ ఇంకా రేడియో డాయ్ ట్షెవెల్లె క్రమంతప్పక వినేవాడిని. ఇంకా రేడియో ఆస్ట్రేలియా కూడా. నా దగ్గర పోయినవి పోగా ఇంకా కొన్ని QSL కార్డులు ఉన్నాయి గత కాలపు స్మృతులుగా. ఇప్పుడు ఏ రేడియో స్టేషనూ QSL కార్డులు పంపుతున్నట్లు లేదు.
రిప్లయితొలగించండి@Chandramohan.
రిప్లయితొలగించండిThank you for your comments. For the first time I met somebody in the blog world who knows about shortwave radio, Dxing and Qsl Cards.
I have hundreds of QSL cards including those from Pirate Radios, Commercial Radios in South America and from Ham Radio Operators.
Dxing is just meaningless now with improved communications of Net Radio.
Even if we tune into Shortwave radio, there such noise of inteference its impossible to tune into any station.