11, జూన్ 2011, శనివారం

అదే మంచి మార్గం-THAT'S THE EASY WAY

ఎడ్డీ ఆర్నాల్డ్

విజయవాడలో, మొట్టమొదటగా నగరం ఏర్పడ్డ ప్రాంతానికి పేరు లేదు. వన్ టౌన్ అని పిలుస్తారు, ఎందుకు, అది విజయవాడ ఒకటి కాబట్టి. మా చిన్నప్పుడు, మా నాన్నగారు "ఊళ్లోకి వెళ్లొస్తాను" అని ఆ వన్ టౌన్ వెళ్లి వస్తూ ఉండేవారు. ఆయన సత్యనారాయణపురం లో ఇల్లు కట్టేప్పటికి అది ఊరి చివర, ఊళ్లోకి వెళ్ళటం అంటే వన్ టౌన్ కి వెళ్ళటం.

అటువంటి వన్ టౌన్ లో, మా చిన్నప్పుడు అంటే 1975 ప్రాంతాల్లో మాధవ అండ్ కంపెనీ అని ఒక రేడియో షాపు ఉండేది. వాళ్ళు గ్రామఫోన్ రికార్డులు కూడా అమ్మేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఒక పెద్దాయన ఖద్దరు గుడ్డలు కట్టుకుని కనిపించేవారు. అక్కడే గ్రామోఫోన్ కొనటం జరిగింది.

గ్రామోఫోన్ కొన్న తరువాత రికార్డులు కొనవద్దా! దీనికొక ఉద్యమం. మా నాన్న మాకు రోజూ ఇచ్చే అర్ధ రూపాయి, అందులోనే పాత చందమామలు కొనాలి, లీలామహల్లో/నవరంగ్ లో సినిమాలు క్రమం తప్పకుండా చూడాలి. ఎన్నెన్ని పనులు. మా అమ్మ మాకు అప్పుడప్పుడూ సహాయం చేస్తూ ఉండేది. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు (అంటే మా నాన్న) మాత్రం యమా స్ట్రిక్ట్.డబ్బులు వినియోగం విషయంలో ఆయనలా క్రమశిక్షణలో ఉంచబట్టి ఆర్ధికపరమైన తెలివితేటలు పెద్దగా లేకపోయినా బతకగలుతుతున్నాము.

సరే అసలు విషయం లోకి వస్తే, ఆ మాధవ అండ్ కో లో 45 ఆర్ పీ ఎం రికార్డులు కేవలం ఐదు రూపాయలకు అమ్మేవాళ్ళు. ఒక్కటే నిబంధన. కొందామనుకున్న రికార్డు అక్కడ వినటానికి లేదు. అసలు ధర ఎనిమిది రూపాయల అరవై పైసలు. అసలు ధరతో కొంటే అక్కడ విని బాగుంటే కొనవచ్చు లేదా మరొక రికార్డ్ వెతుక్కోవచ్చు . కాబట్టి ఆ తక్కువ ధరకు లాటరీ వేసి కొనేసి, పరుగు పరుగున ఇంటికి వచ్చి వినాలి. బాగుంటే ఆనందం! సామాన్యంగా మేము కొన్నవి అన్ని బాగానే ఉన్నాయి.

అలా కొన్న పాటల్లో ఒకటి ఎడ్డీ ఆర్నాల్డ్ పాడిన పాట "THAT IS THE EASY WAY" ఆ పాట సాహిత్యం చాలా చిత్రంగా ఉండి భావం తికమక పెట్టేది. ఈ కింది ప్లేయర్లో వినండి.
ఈ పాట సాహిత్యం ఈ విధంగా ఉన్నది:

I've always been a lover the easy going kind
I've known a million pretty girls but I left them all behind
Don't want no ties to hold me that's why I never stay
I just love 'em and leave 'em that's the easy way

The easy way is the system I use
Spread yourself around and you'll never have the blues
Forget about tomorrow when you greet a brand new day
Just love 'em and leave 'em that's the easy way

I know all the places where it's fast and it's fun
Lots of good times I have and I don't hurt anyone
So if folks talk about me one thing they have to say
The loving I get I get the easy way

The easy way is the system I use...

So take some good advice from a man who knows
To keep from gettin' trapped you gotta still your toes
You leave your heart at home when you're goin' out to play
Just love 'em and leave 'em that's the easy way

The easy way is the system I use...
Just love 'em and leave 'em that's the easy way
Just love 'em and leave 'em that's the easy way

పాటకు కూడ యు ట్యూబ్ లో వీడియో దొరికింది. మా తమ్ముడే అప్లోడ్ చేసాడు.


THAT'S THE EASY WAY IN YOU TUBE


కొంత కాలం తరువాత తెలిసింది. అసలు హిట్ సాంగ్ ఆ రికార్డుకు మరొక వైపున ఉన్నది అని ఆ పాట పేరు "MAKE THE WORLD GO AWAY". ఈ పాటను కూడా వినండి.


ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది:

Make the world go away
And get it off my shoulder
Say the things you used to say
And make the world go away.

Do you remember when you loved me
Before the world took me astray
If you do then forgive me
And make the world go away.

Make the world go away
And get it off my shoulder
Say the things you used to say
And make the world go away.

I'm sorry if I hurt you
I'll make it up day by day
Just say you love me like you used to
And make the world go away.
Make the world go away
And get it off my shoulder
Say the things you used to say
And make the world go away...

ఇదే పాట ఎడ్డీ ఆర్నాల్డ్ పాడుతుండగా తీసిన వీడియోగా "YOU TUBE" లో ఉన్నది చూడండి:

అన్నట్టు మరచాను, ఎడ్డీ ఆర్నాల్డ్ కు ప్రత్యెక మైన వెబ్ సైటు ఉన్నది. అది కూడా ఒక సారి చూడండి:


ఆ అద్భుతమైన రోజులు జ్ఞాపకాలుగా మిగిలిపోయినప్పటికీ మరొక్కసారి మీ అందరితో పంచుకోవటంలో ఆనందం ఉన్నది.

1 వ్యాఖ్య:

  1. అప్పటి చక్కటి జ్ఞాపకాలను గుర్తు చెసుకుంటే చాలా ఆనందంగా వున్నది. అప్పట్లో ఎక్కడ ఏది కొన్నా అమ్మినవారిని గుర్తు పెట్టుకునేట్లు వుండేవారు. వారికి అమ్మే వస్తువుల పట్ల ఆసక్తి మరియు జ్ఞానం వుండేది. చేసిది వ్యాపారమైనా అది కేవలం డబ్బు యావతో చెసినట్లు వుండేది కాదు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.