16, జూన్ 2011, గురువారం

భలే బ్లాగ్ఈ మధ్యనే దేనికోసమో గూగిలిస్తూ (ఇదో కొత్త తెలుగు మాట గమనించ గలరు) ఉంటే, ఒక కొత్త వెబ్ సైట్ అనాలో బ్లాగ్ అనాలో తెలియదు. కనపడింది. మొట్టమొదట నేను అందులో చదివినది, "అభిమాని" ఒక చిన్న స్కిట్ లాంటిది. ఒకాయన తన అభిమాని ఇంటికి భోజనానికి వెళ్ళటం, అంతకు ముందు ఆయన పెట్టె షరతులు, ఆ తరువాత ఏమి జరిగింది, భలే తమాషాగా, హాయిగా ఉన్న శైలిలో వ్రాసారు. ఆ తరువాత, "మా హిందీ మాష్టారు" ఎంతో బాగున్నది.


శ్రీ శైలజా చందు గారు వ్రాస్తున్న ఈ వ్యాసాల వంటి కథలనలా, స్వీయ అనుభవాలు అనాలా, ఫస్ట్ పెర్సన్ లో వ్రాయబడినవి చదవటానికి ఎంతో బాగున్నాయి.ఆయన వ్రాసిన కథనాలు అన్నిటిలోనూ నాలుగు భాగాలుగా వ్రాసిన "అమృతం" అనే కథ. హాస్య ప్రధానంగానే వ్రాస్తూ, ఒక అభాగ్యురాలి గురించి ఎంతో హృద్యంగా కథ నడిపారు. ఇలాంటి కథ ఒక మంచి సాహిత్య పత్రికలో (రచన) లో కొద్దిగా సవరించి, కొంత ఎడిట్ చేసి వేయదగ్గ కథ.

ఆ మాటే ఆయనకు మెయిలు చేసాను. కాకపొతే మనం మామూలుగా చూసే బ్లాగు రూపంలో లేదు. బ్లాగ్/వెబ్సైట్ కు పేరు లేదు. ఏ వ్యాసం లేదా కథనం వ్రాస్తే అదే శీర్షికగా వస్తున్నది. అన్ని కథనాలకు వ్యాఖ్యలు వ్రాసే వీలూ లేదు.

ఇక ఈ బ్లాగు ఏమిటో, ఎక్కడ చూడాలో అని చెప్పాలి కదూ! ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి చూడండి:

ఈ బ్లాగ్ రచయిత ఐన "చందు" గారికి ఒక చిన్న సలహా.

"మీ బ్లాగ్ ను బ్లాగర్ కాం లోకి తీసుకు రండి. అనేకానేక సదుపాయాలు ఉన్నాయి. బ్లాగులు చదివే వారికి కూడ అందుబాటులోకి వస్తారు. సంకలినులు (AGGREGATOR) మాలిక, కూడలి వంటి వాటికి మీ సైటు లేదా బ్లాగ్ ను కలపండి. తరచూ వ్రాసి మీరు వ్రాసే శైలి చెడగొట్టుకోవద్దు. పొదుపుగా వ్రాసి అందరినీ అలరించండి"అందరూ చదివి ఆనందించండి
1 వ్యాఖ్య:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.