(ఏప్రిల్ 1972 యువ సంచిక నుండి)
ఈ ప్రతిపాదన అమలయ్యే అవకాశం ఉన్నదా? "లేదు" అని దిక్కులు మార్మోగేట్టుగా నాకు వినపడుతున్నది. నాకు అనిపిస్తున్న విషయం కాదు అని నిరూపించు స్వామీ వెంకటేశా అని అనుకోవటం తప్ప చెయ్యగలిగినది ఏమన్నా ఉన్నదా అని నిరాశ ఆవహిస్తున్నది.
గోవిందా! ఏడుకొండలవాడా! ఎప్పటికి తీరేనయ్యా తిరుమలలో భక్తుల కష్టాలు! ఈ వి ఐ పీల కళ్ళు తెరిపించు స్వామీ.
అది 1963 వ సంవత్సరం ఏప్రిల్ నెల, యువ పత్రిక పాఠకులకు , సంపాదక వర్గం తమ సంపాదకీయం ద్వారా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, పాఠకుల మనస్సులో మధనపడుతున్న బాధకు అక్షర రూపం ఇచ్చిన వేళ.
చదవండి 1963 లో శ్రీ చక్రపాణి గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న యువ పత్రిక సంపాదకీయం:
ఆఫీసర్లు వస్తున్నారు వెడుతున్నారు. పాలకవర్గం మారుతున్నది, మార్పు రానిది ఒక్కటే తిరుమలలో భక్తుల పాట్లు. నాలుగు దశాబ్దాల క్రితం ఏ ఏ బాధలు ఉన్నాయో అవ్వే మరింత ఎక్కువయ్యి ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. ఒక్కటే కింది తిరుపతి నుండి పై తిరుపతికి వెళ్ళటానికి బస్సు సౌకర్యం మటుకు చాలావరకూ బాగుపడింది. చదవండి 1963 లో శ్రీ చక్రపాణి గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న యువ పత్రిక సంపాదకీయం:
(క్లిక్ చేసి పెద్దవి చేసి చదువగలరు)
అన్నిటి కన్నా చీదర కలిగించే విషయం, తిరుమలకు వి ఐ పిల తాకిడి. ఈ వి ఐ పీలు, వాళ్ళ చంచా గాళ్ళ గుంపు అంతా కలిసి తిరుమలకు రావటం, సామాన్య భక్తులను ఆపేసి వీళ్ళకు ప్రత్యెక దర్శనాలు, పూజలు.
ఈ వి ఐపీలు ఇలా దర్శనం చేసుకుంటే ఫలితం ఏ మాత్రమన్నా ఉంటుందా? ఉండకపోగా, పాపం చుట్టుకుంటుందని, నా ప్రగాఢ విశ్వాసం.
తిరుమలలో ఈ వి ఐపిల పీడను ఎవ్వరూ అరికట్టలేక పోతున్నారు. అనేక మంది మఠాధిపతులు అదే తిరుమలలో పరివేష్టించి ఉన్నారు. వాళ్లకి జరుగవలసిన మర్యాదలు జరిగి పోతున్నాయి. వాళ్ళు వాళ్ళవాళ్ళ ఆశ్రమాలలో ముక్కు మూసుకుని వేదాంతం ప్రవచిస్తూ రోజులు వెళ్ళమారుస్తున్నారు. ఈ మఠాధిపతులు, స్వామీజీలు సామాన్య భక్తుల కష్టాలకు స్పందించి, తిరుమలలో జరిగే ఈ అపచారపు వి ఐ పి దర్శనాలకు అడ్డుకట్ట వేయలేరా? వేయలేనప్పుడు వాళ్లకు మఠాధిపత్యం దేనికి, స్వామీజీ బిరుదులు దేనికి!!
ఈ వి ఐ పీల విషయంలో నా సూచన ఉన్నది. ఎలాగూ వాళ్ళను ఆపలేనప్పుడు, వారంలోఒక్క రోజు పూర్తిగా వాళ్ళకే వదిలెయ్యటం. ఆ రోజున సామాన్య భక్తులు ఎవ్వరూ తిరుమల గుడి చాయలకు వెళ్ళరు . ఈ వి ఐ పీలే వచ్చి వాళ్ళ మందలను వేసుకుని దర్శనం చేసుకు వెళ్లిపోతారు. మిగిలిన ఆరు రోజులూ ఎట్టి పరిస్థితులలోనూ వి ఐ పీ లను అనుమతించకూడదు. ఎవరైనా వి ఐ పి ఎంత సెక్యూరిటీ గలవాడు అయినా సరే మిగిలిన రోజులలో వస్తే సామాన్య భక్తులతో పాటు వరుసలో రావాల్సిందే.
ఈ వి ఐపీలు ఇలా దర్శనం చేసుకుంటే ఫలితం ఏ మాత్రమన్నా ఉంటుందా? ఉండకపోగా, పాపం చుట్టుకుంటుందని, నా ప్రగాఢ విశ్వాసం.
తిరుమలలో ఈ వి ఐపిల పీడను ఎవ్వరూ అరికట్టలేక పోతున్నారు. అనేక మంది మఠాధిపతులు అదే తిరుమలలో పరివేష్టించి ఉన్నారు. వాళ్లకి జరుగవలసిన మర్యాదలు జరిగి పోతున్నాయి. వాళ్ళు వాళ్ళవాళ్ళ ఆశ్రమాలలో ముక్కు మూసుకుని వేదాంతం ప్రవచిస్తూ రోజులు వెళ్ళమారుస్తున్నారు. ఈ మఠాధిపతులు, స్వామీజీలు సామాన్య భక్తుల కష్టాలకు స్పందించి, తిరుమలలో జరిగే ఈ అపచారపు వి ఐ పి దర్శనాలకు అడ్డుకట్ట వేయలేరా? వేయలేనప్పుడు వాళ్లకు మఠాధిపత్యం దేనికి, స్వామీజీ బిరుదులు దేనికి!!
ఈ వి ఐ పీల విషయంలో నా సూచన ఉన్నది. ఎలాగూ వాళ్ళను ఆపలేనప్పుడు, వారంలోఒక్క రోజు పూర్తిగా వాళ్ళకే వదిలెయ్యటం. ఆ రోజున సామాన్య భక్తులు ఎవ్వరూ తిరుమల గుడి చాయలకు వెళ్ళరు . ఈ వి ఐ పీలే వచ్చి వాళ్ళ మందలను వేసుకుని దర్శనం చేసుకు వెళ్లిపోతారు. మిగిలిన ఆరు రోజులూ ఎట్టి పరిస్థితులలోనూ వి ఐ పీ లను అనుమతించకూడదు. ఎవరైనా వి ఐ పి ఎంత సెక్యూరిటీ గలవాడు అయినా సరే మిగిలిన రోజులలో వస్తే సామాన్య భక్తులతో పాటు వరుసలో రావాల్సిందే.
ఈ ప్రతిపాదన అమలయ్యే అవకాశం ఉన్నదా? "లేదు" అని దిక్కులు మార్మోగేట్టుగా నాకు వినపడుతున్నది. నాకు అనిపిస్తున్న విషయం కాదు అని నిరూపించు స్వామీ వెంకటేశా అని అనుకోవటం తప్ప చెయ్యగలిగినది ఏమన్నా ఉన్నదా అని నిరాశ ఆవహిస్తున్నది.
గోవిందా! ఏడుకొండలవాడా! ఎప్పటికి తీరేనయ్యా తిరుమలలో భక్తుల కష్టాలు! ఈ వి ఐ పీల కళ్ళు తెరిపించు స్వామీ.
చక్కగా చెప్పారు ప్రసాద్ గారూ ! ఈ సమస్య తీరేది కాదు.పిల్లి మెడలో గంట ఎవరు కడతారు ?
రిప్లయితొలగించండిsir, you are right on. this is the biggest daridram to suppress thirumala
రిప్లయితొలగించండి