21, జూన్ 2011, మంగళవారం

పాపం ఈ నాటి పిల్లలు

పై బొమ్మ సౌజన్యం CHILDREN ARE GIFT బ్లాగ్(క్లిక్) నుండి
*****
***
*

ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మణుగు బరువున్న పుస్తకాల బాగ్ మొయ్యటం చూడటం పరిపాటిఅయ్యింది. కాని, ఎప్పుడో 1972 లో మూడున్నర దశాబ్దాల పై మాట! అప్పుడప్పుడే పెచ్చరిల్లుతున్న కాన్వెంట్ చదువులు, పుస్తకాల భారం ఎద్దేవా చేస్తూ, పెరిగిన పుస్తకాల బరువును అప్పటి తెలివైన బాలుడు ఎలా స్కూలుకు తీసుకు వెళ్తున్నాడో, చూపిస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ "బాబు" గారు (కొలను వెంకట దుర్గా ప్రసాద్) వేసిన చక్కటి కార్టూన్.


కార్టూన్ సౌజన్యం శ్రీ "బాబు" (ఆంధ్ర పత్రిక జూన్ 1972)


ఎంతో మంది పెద్ద పెద్ద బుర్రలు ఉన్న వాళ్ళు పిల్లలు-చదువు గురించి తెగ వ్రాస్తున్నారు, వాగేస్తున్నారు (టివిల్లో ఐతే అంతేగా మరి!). కాని చిన్న పిల్లలు పుస్తక బరువు మాత్రం తగ్గటం లేదు. శోచనీయం.

పాత పుస్తకాల్లో దొరికిన వారి కార్టూన్లు జయదేవ్ గారికి పంపించినపుడు, తనపాత కార్టూన్లు చూసుకుని సంతోషించి, ఆయన అన్న మాటలు, "చిత్రం! ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఈ కార్టూన్లను ఇప్పటి కాలానికి కూడా అన్వయించ వచ్చు!"


ఆయన మాటలు చూడగానే, నాకు అనిపిస్తున్నది, సాంకేతికంగా మనం ఎంతో ముందుకు, సామాజికంగా ఎక్కడి గొంగళి అక్కడే కాకపోగా మరింత వెనక్కి! కలికాలమండీ! కలికాలం!! కాకపొతే మరేమిటీ!!

*
***
*****





































1 కామెంట్‌:

  1. మీరు చెప్పింది నిజమే. అన్నీ తెలిసీ ఏమీ చెయ్యలేకపోతున్నామని బాధ. ఈ దేశంలో పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించాలని ఒక ఉద్యమం చేపడితే బాగుండును. అతి పెద్ద అవీనీతి వలయం మన విద్యా వ్యవస్థ.దీన్నేవారు మార్చగలరు?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.