ఓలేటి వెంకటేశ్వర్లు గారిని మళ్ళి ఇలా చూడగలనని అనుకోలేదు. మా చిన్నప్పుడు (నాకు 10-11 ఏళ్ళు) మా పక్కింట్లో వాళ్ళకి సంగీతం నేర్పటానికి ఈ మహా విద్వాంసుడు వస్తూ ఉండేవారు. అప్పటికి ఆయన గొప్పతనం తెలియదు. పక్కింట్లోంచి వినపడే ఆయన గొంతు విని ఈయన రేడియోలో పాడతారా అని ఆశ్చర్యపోతూ గోడ మీద కూచుని వినటం, ఆయన నడిచి వెడుతుంటే ఆయనను చూసి ఆనందించటమే తెలుసు.
మంచి ఒడ్డు, పొడుగు, ఖద్దరు పంచ, లాల్చి, చేతిలో ఒక చిన్న గుడ్డ సంచి, చంకలో ముడిచిన గొడుగు, నెమ్మదిగా అలా నడిచి వెడుతున్న ఆకారం ఇప్పటికీ నాకు అలా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది (1968 మాట). ఆయన నడకను అనుసరించి ఆయనకు "పెంగ్విన్" అనే పేరు ఉండేదని, ఆయనతో పనిచేసిన అదృష్టం కలిగిన ఆయన కంటే ఒక తరం చిన్న వాడైన ఒక పూర్వ అకాశవాణి ఉద్యోగి ఈ మధ్యనే నాకు చెప్పారు.
రేడియోలో ఆయన రక్తి కట్టించిన అనేకానేక సంగీత కార్యక్రమాలు వింటూ ఉండేవాళ్ళం. చిన్నతనమైనా సంగీతానికి ఉన్న అద్భుతమైన శక్తి నన్ను ఆయన పాటలకు ఆకర్షితుణ్ణి చేసేది. అలా విన్న పాటలలో ముఖ్యంగా ఆయన పాడిన "భజగోవిందం" నాకు ఎప్పటికీ ఇష్టమైన భక్తిరంజని పాట. ఆ పాట ఆయన గళంలో కొద్దిగా వినండి.
ఇష్టపడినవాళ్ళు ఆకాశవాణి వారి వద్ద కొనుక్కోవచ్చు. ఆకాశవాణి వారు చేసిన అతి కొద్ది మంచి పనుల్లో ఈ సి డి విడుదల చెయ్యటం మొదటిది.
అలా గుర్తుండిపోయిన ఆ మహా సంగీత విద్వాంసుడు ఈ రోజున యు ట్యూబ్ లో దర్శనమిచ్చారు. ఒకటి కాదు అనేకానేక వీడియోలు ఆయనవి. మచ్చుకి ఆయన పాడిన ఒక జావళి చూస్తూ వినండి.
ఇలా చెబుతూ ఉంటే అనేకం ఉన్నాయి. ఈ కింది లింకు చూడండి ఆయన వీడియోలు అనేకం ఉన్నాయి.
ఈ వీడియోలు అన్ని ఒక చోట కనబడటం కర్నాటిక్ సంగీతం మీద అభిరుచి ఉన్న వాళ్ళందరికీ పండుగే.ఈ వీడియోలన్ని ఎవరు సేకరించి, మనందరికి ఇచ్చారు అన్న ఆసక్తి తప్పక కలుగుతుంది. ఆ చక్కటి పని చేసిన ఆయన పేరు రామ వర్మ గారు. ట్రివేండ్రానికి చెందిన వారు, స్వంతంగా వ్యాపారం చేకుంటున్నారు. ఆయనకి కర్ణాటిక్ సంగీతమంటే అభిరుచి. తెలుగువాడైన మన ఓలేటి గారిని మనకి కేరళీయుడు చూపించటం లో ఆశ్చర్యం లేదు కదా!
ఇన్ని చక్కటి, అపురూపమైన వీడియోలను అందించిన శ్రీ రామ వర్మ గారి అభిరుచి, ఆసక్తి అన్నిటికి మించి అందరితో పంచుకోవాలన్న మంచి అభిప్రాయానికి, కృతజ్ఞతలు. ఆయన తాను స్వయంగా పాడిన ఒక పాటకు వీడియో ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

శ్రీ రామ వర్మ
వింటేజ్ ఆర్ అనే మారుపేరుతో, పేరు "ఆర్" అని మాత్రమే ప్రచురించుకున్న ఒక అజ్ఞాత సంగీత ప్రియుడు అప్లోడ్ చేసిన శ్రీ ఓలేటిగారి వీడియోని చూసి, విని ఆనందించండి.

శివ గారూ !
రిప్లయితొలగించండిఅపురూపమైన నిధిని అందించినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి