20, జులై 2011, బుధవారం

బీటిల్స్ - వెంచర్స్1960లు 1970లలో పాప్ సంగీతంలో ఎంతగానో పేరు తెచ్చుకున్న బీటిల్స్ గురించి అందరికీ తెలుసు. అప్పట్లో ఆ నలుగురు యువకులు తమకు తామే వ్రాసుకుని, సంగీతం కూర్చుకుని పాడిన పాటలు ప్రపంచ వ్యాప్తంగా "హిట్" లు కొట్టాయి, అప్పటి కుర్రకారు ఈ పాటలను ఎంతో మక్కువగా వినేవరు. ఇప్పటికీ వింటూనే ఉన్నారు. ఈ పాప్ గ్రూప్ 1969 కల్లా విడిపోయి కలిసి పాడటం మానేశారు.

అలాగే అమెరికాకు చెందిన వెంచర్స్ బృందం వీళ్ళు పాటలు పాడేవాళ్ళు కాదు. గిటార్ డ్రంస్ ముఖ్య వాయిద్యాలుగా అనేకానేక ట్యూన్లను అందించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు పూర్తిగా వాయిద్య సంగీత ప్రధానమైన పాప్ గ్రూప్.వెంచర్స్ ఇప్పటికీ కలిసే ఉండి అప్పుడప్పుడూ చక్కటి ఇన్స్‌ట్రుమెంటల్ సంగీతాన్ని అందిస్తూనే ఉన్నారు.

మరి వీళ్ళీద్దరూ కలిస్తే! అద్భుతం కదూ. అలనాడు బీటిల్స్ పాడిన పాటలలో కొన్నిటిని వెంచర్స్ తమ వాయిద్య సంగీతంలోకి మార్చి పూర్తిగా ఇన్స్‌ట్రుమెంటల్ సంగీతంగా అందించారు. విని ఆనందించండి


The Ventures - In My Life (2010)

In My Life
Norwegian Wood
Strawberry Fields Forever (2010 remix)
Michelle
Yesterday (2010 remix)
Eleanor Rigby
Back In The U.S.S.R.
I Feel Fine
Paperback Writer
All You Need Is Love
Hey Jude
Let It Be
Here Comes The Sun
Golden Slumbers / Carry That Weight / The End
Imagine

More music here...


ఇవన్నీ ఎక్కడ సంపాయించారు అనికదూ మీ ప్రశ్న. ఇదే బ్లాగులో ఇంతకు ముందొకసారి వ్రాశాను. అయినా మళ్ళీ మీకోసం. ఈ కింది లింకు నొక్కి ఆ వెబ్ సైటులోకి వెళ్ళి అపరిమితమైన పాశ్చాత్య సంగీతం విని ఆనందించండి.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.