3, జులై 2011, ఆదివారం

HAPPY BIRTHDAY CNU

1985 సంవత్సరం, జులై నెల నాలుగు పొద్దున్న పదకొండు గంటలకు వరంగల్లులో మా ఆఫీసులో నాకు ట్రంక్ కాల్ వచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్లు అంటే ఏమీటో తెలియదు. ఫోనులో మా నాన్న ఒక శుభవార్త చెప్పారు. అంతకు ముందు రోజు (జులై 3, 1985) సాయంత్రం నాలుగున్నరకి పుత్రోదయం అని. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళటానికి మధ్యాహ్నం రెండున్నర వరకూ కూడా రైలు లేదు (కోణార్క్). రైలు వరంగల్లుకే నలభై నిమిషాలు ఆలశ్యం. నేను అప్పట్లో వేరే బాంకులో పనిచేస్తున్న ఒక పెద్దాయన ( ఒకే మేస్ లో భోజనం చేసేవాళ్ళం) కలిసి ప్రయాణం చేశాం.

ఆయనేమో ఏభై ఏళ్ళు వచ్చిన ఘోటక బ్రహ్మచారి. నేను ఇరవై ఏడేళ్ళ కొత్త తండ్రిని. నా ఆనందం ఆయనతో పంచుకోవచ్చా లేదా అని సంశయిస్తూనే కాసేపటికి నా విజయవాడ ప్రయాణం గురించి చెప్పాను. ఆయన ముక్తసరిగా శుభాకాంక్షలు చెప్పారు. కాసేపు నిశ్శబ్దం (మా మధ్యనే, లేకపోతె రైల్లో శబ్దం లేకుండా ఎలా ఉంటుంది!).

ఆయన గొంతు సవరించుకుని, "ప్రసాద్! ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు ఇవ్వాళ చెప్తున్నాను" అని తన జీవిత రహ్యస్యం చెప్పారు. ఫలించని ప్రేమ గాధ ఆయనది. రైల్లో ఉన్నా కూడా ఆనందంతో గాల్లోనే ప్రయాణిస్తున్న నాకు, ఆయన పూర్వ కథలోని బాధ, నన్ను కొంత భూమ్మీదకు తీసుకు వచ్చింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ అవ్వాళ అంతగా కిక్కిరిసి లేదు. సీట్ల నిండుగా జనం ఉన్నారు అంతే.

మాటల్లోపడి గమనించలేదు, అప్పటికే ఖమ్మం దాటేసింది రైలు. టైం చూసుకున్నాను. ఆశ్చర్యం! నలభై నిమిషాల ఆలాశ్యాన్ని పది నిమిషాలకి తీసుకోచ్చేసాడు డ్రైవర్. కాసేపటికి విజయవాడ సరైన సమయానికి చేరింది.

అప్పటికే కొడుకు పుట్టిన ఆనందం లో ఉన్నానేమో, నేను ఉన్న కంపార్ట్మెంటు నుంచి దిగి ఇంజన్ వైపు వెళ్లి అక్కడ బాగ్ పట్టుకు వెళ్ళబోతున్న ఆయన్ని అడిగాను. "మీరేనా, హైదరాబాద్ నుంచి తీసుకు వచ్చింది" అని. ఆయన కొంచెం చిరాకుగా, అవును ఎం! అన్నాడు. "ధన్యవాదాలండీ సరైన సమయానికి తీసుకు వచ్చారు" అని అయనకి థాంక్స్ చెప్పి ఆయన ఇంకా ఇటువంటి ప్రశంస అందుకున్న ఆశ్చర్యం లోంచి బయటపడే లోగా నేను స్టేషన్ లోంచి బయటకు గాలిలో ప్రయాణం చేసి, సీదాగా కృష్ణ కుమారిగారి హాస్పిటల్ వెళ్లి మా అబ్బాయిని, మా ఆవిడను చూశాను.

పుట్టిన కొడుకును చూసుకోవటం లో ఉన్న అపూర్వ ఆనందాన్ని మా ఆవిడతో కలిసి పంచుకున్నాను.

అలనాటి ఆనదం పెరిగి పెద్దై రోజున అమెరికాలో తన ఇరవై ఏడో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, మా పెద్దబ్బాయి శ్రీనివాస ప్రసాద్.శుభాకాంక్షలు

Eddy Arnold - Happy Birthday to You
Found at abmp3 search engine9 వ్యాఖ్యలు:

 1. నా తరపున కూడా జన్మ దిన శుభాకాంక్షలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీనివాస్.. మీకు.. నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ ! యశస్వి భవ!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రభంద్ గారూ, వనజ వనమాలీ గారూ!

  మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చి.శ్రీనివాస ప్రసాద్‍కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
  మా అబ్బాయి విజయ చైతన్య పుట్టిన రోజు కూడా ఈ రోజే.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. విజయమోహన్ గారూ ధన్యవాదాలు.

  మీ అబ్బాయి చిరంజీవి విజయ చైతన్యకు మా అందరి తరఫున జన్మ దిన శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రీనివాస్. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ ! యశస్వి భవ

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ అబ్బాయి మీ చిన్నప్పటి ఫోటోలాగానే ఉన్నాడు. నా తరపునుంచి కూడా జన్మదినశుభాకాంక్షలు...అతనికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నమస్తె, శుభాకంక్షలు తెలిపిన అందరికీ నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు :)

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.